news

News March 24, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 24, 2024

మార్చి 24: చరిత్రలో ఈ రోజు

image

1603: క్వీన్ ఎలిజబెత్ మరణం
1882: ‘క్షయ’ కారక బాక్టీరియాను కనుగొన్న రాబర్ట్ కోచ్
1896: రేడియో ప్రసార సంకేతాలను సృష్టించిన ఏఎస్ పోపోవ్
1914: సాహితీకారుడు పుట్టపర్తి నారాయణాచార్యుల జననం
1977: భారత ప్రధానిగా ఇందిరాగాందీ పదవీవిరమణ
1998: లోక్‌సభ స్పీకర్‌గా దివంగత జీఎంసీ బాలయోగి ప్రమాణస్వీకారం
2017: క్రేన్ వక్కపొడి అధినేత గ్రంధి సుబ్బారావు కన్నుమూత
నేడు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

News March 24, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: మార్చి 24, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:05
సూర్యోదయం: ఉదయం గం.6:17
జొహర్: మధ్యాహ్నం గం.12:22
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:28
ఇష: రాత్రి గం.07.40
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 24, 2024

శుభ ముహూర్తం

image

తేదీ: మార్చి 24, ఆదివారం
శుద్ధ చతుర్దశి: ఉదయం 09:55 గంటలకు
పుబ్బ: ఉదయం 07:33 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 04:38-05:27 గంటల వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 03:41-17:29 గంటల వరకు

News March 24, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 24, 2024

TODAY HEADLINES

image

* ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడిగింపు
* జీవో 317 సమస్యల్ని త్వరలోనే పరిష్కరిస్తాం: CM రేవంత్
* ఏపీలో NDAకు 160కి పైగా సీట్లు వస్తాయి: CBN
* సినీ నటులకు మించిన క్రేజ్ CM జగన్ సొంతం: రోజా
* రెండు అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థుల ప్రకటన
* కేజ్రీవాల్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు ఢిల్లీ HC నిరాకరణ
* IPL: ఢిల్లీపై పంజాబ్, SRHపై KKR విజయం
* మాస్కోలో ఉగ్రదాడి.. 150 మంది మృతి

News March 23, 2024

ఉత్కంఠ పోరులో SRH ఓటమి

image

సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20ఓవర్లలో 208 రన్స్ చేయగా.. చేధనకు దిగిన హైదరాబాద్ చివరి వరకు పోరాడి 204 రన్స్ చేసింది. క్లాసెన్ (25 బంతుల్లో 61) అద్భుత పోరాటం వృథా అయింది. చివరి ఓవర్లో క్లాసెన్, షాబాజ్ ఔట్ కావడంతో KKR 4 రన్స్ తేడాతో గెలిచింది. రస్సెల్ బ్యాటింగ్‌లో 64 రన్స్, బౌలింగ్‌లో 2వికెట్లతో రాణించారు.

News March 23, 2024

సమంతకు లవ్ ప్రపోజ్ చేసిన అభిమాని!

image

నటి సమంత రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ సరదాగా ఉంటారు. తాజాగా ఓ అభిమాని ఆమెకు గులాబీ పువ్వు ఇచ్చి లవ్ ప్రపోజ్ చేశారు. ఆ ప్రపోజల్‌ని సామ్ నవ్వుతూ యాక్సెప్ట్ చేశారట. ఈ విషయాన్ని సదరు అభిమాని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘మొత్తానికి నా క్రష్‌కు లవ్ ప్రపోజ్ చేశాను. ఆమె ‘YES’ చెప్పారు. జీవితంలో మర్చిపోలేని రోజు ఇది’ అని ట్వీట్ చేశారు. సామ్ అందరితో సరదాగా ఉంటారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News March 23, 2024

ఏపీ గవర్నర్‌కు అస్వస్థత

image

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది ఆయనను విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన అనారోగ్యానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

News March 23, 2024

కాంగ్రెస్ నాలుగో లిస్ట్ విడుదల

image

కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదలైంది. 46 మంది కాంగ్రెస్ లిస్ట్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో తెలంగాణ నుంచి ఎలాంటి పేరు లేదు. అస్సాం, అండమాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, వెస్ట్ బెంగాల్, ఉత్తరాఖండ్ నుంచి అభ్యర్థులను ప్రకటించింది.

error: Content is protected !!