News November 14, 2024
STOCK MARKETS: రికవరీయా? పతనమా?
స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. సూచీల గమనం చూస్తుంటే రికవరీ బాట పడతాయో, మరింత పతనమవుతాయో తెలియడం లేదని ఇన్వెస్టర్లు వాపోతున్నారు. నిఫ్టీ 23,591 (+32), సెన్సెక్స్ 77,829 (+141) వద్ద చలిస్తున్నాయి. మీడియా, బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. FMCG, ఆటో, O&G రంగాల్లో సెల్లింగ్ ప్రెజర్ ఉంది. శ్రీరామ్ ఫిన్, M&M, అల్ట్రాటెక్ సెమ్, BEL, ట్రెంట్ లాప్ లూజర్స్.
Similar News
News December 11, 2024
నేడు, రేపు కలెక్టర్ల సదస్సు
AP: రాష్ట్ర ప్రభుత్వం నేడు, రేపు వెలగపూడి సచివాలయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. CM చంద్రబాబు అధ్యక్షత వహించనున్న ఈ సదస్సులో స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్, కొత్త పాలసీలు, రానున్న రోజుల్లో అందించే పాలన, తదితరాలపై దిశానిర్దేశం చేయనున్నారు. సదస్సు ఉదయం 10.30గంటలకు ప్రారంభమై సాయంత్రం 7.30 వరకు కొనసాగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఓసారి సదస్సు నిర్వహించగా, ఇది రెండోది.
News December 11, 2024
హోంమంత్రి అనితపై కేసు కొట్టివేత
AP: హోంమంత్రి అనితకు చౌక్ బౌన్స్ కేసులో ఊరట దక్కింది. తన వద్ద తీసుకున్న రూ.70లక్షలకు గానూ అనిత ఇచ్చిన చెక్కు చెల్లలేదని 2019లో వేగి శ్రీనివాసరావు అనే వ్యక్తి విశాఖ కోర్టును ఆశ్రయించారు. కేసును రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని వీరిద్దరూ నిర్ణయానికి రాగా, విశాఖ కోర్టులో ప్రొసీడింగ్స్ కొట్టేయాలని అనిత హైకోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం విచారణ జరగ్గా ఆమెపై ఉన్న కేసును కోర్టు కొట్టేసింది.
News December 11, 2024
గజగజ.. మళ్లీ పెరిగిన చలి
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. గతనెల నుంచే చలి తీవ్రత విపరీతంగా మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. TGలోనూ మోస్తరు వానలు, ఆకాశం మబ్బు పట్టడం వల్ల చలి బాగా తగ్గిపోయింది. కానీ గత 2 రోజులుగా చలి మళ్లీ పెరిగింది. రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.