news

News March 23, 2024

బిగ్‌బాస్ విన్నర్‌కు బెయిల్

image

పాము విషం సరఫరా కేసులో అరెస్టైన బిగ్‌బాస్ ఓటీటీ2 విన్నర్, యూట్యూబర్‌ ఎల్విశ్ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. నోయిడా జైలులో ఉన్న ఆయనకు గురుగ్రామ్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. మార్చి 17న ఎల్విశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

News March 23, 2024

లిక్కర్ స్కామ్‌తో సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా?: కిషన్‌రెడ్డి

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తమ కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘లిక్కర్ స్కామ్‌లో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఢిల్లీలో తీగ లాగితే హైదరాబాద్‌లో డొంక కదులుతోంది. కేజ్రీవాల్ సీఎం అయితే అవినీతిని విడిచిపెట్టాలా? తెలంగాణ లిక్కర్ మోడల్‌నే ఢిల్లీకి బదిలీ చేశారు. దర్యాప్తు సంస్థలు దోషుల్ని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుంది?’ అని అన్నారు.

News March 23, 2024

రేవంత్ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు: వీహెచ్

image

TG: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ నేతల చేరికపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అసహనం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్‌ను కాదని ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలను కాంగ్రెస్‌లోకి ఎలా తీసుకుంటారు. వాళ్లను తీసుకుని మన కార్యకర్తలకు అన్యాయం చేయొద్దు. రేవంత్ వెళ్లి ఆ పార్టీ నేతలను ఆహ్వానించడం సరికాదు. ఇలా చేసి ఆయన తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.

News March 23, 2024

సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా!

image

IPLలో హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు రెండు టైటిళ్లు గెలిచింది. 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున గిల్ క్రిస్ట్ కెప్టెన్సీలో.. 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో SRH ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్‌కు హైదరాబాద్ కెప్టెన్ ఆస్ట్రేలియా ప్లేయరే కావడంతో ఫ్యాన్స్ ఇదే సెంటి‌మెంట్‌పై ఆశలు పెట్టుకున్నారు. కమిన్స్ నాయకత్వంలో టైటిల్ గెలవడం ఖాయమంటూ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ సెంటిమెంట్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

News March 23, 2024

ఉగ్రదాడిపై రష్యా, ఉక్రెయిన్ పరస్పర ఆరోపణలు

image

రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడికి కారకులు మీరంటే మీరని ఉక్రెయిన్, రష్యా ఆరోపించుకుంటున్నాయి. ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నామని.. అదే నిజమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యా పేర్కొంది. మరోవైపు ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ఉక్రెయిన్ చెబుతోంది. ప్రజలను రెచ్చగొట్టేందుకు ఆ దేశ అధ్యక్షుడు పుతినే ఈ పని చేయించి ఉంటారని ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ పేర్కొనడం గమనార్హం.

News March 23, 2024

ట్యాగ్స్ మారాయి

image

స్టార్ ట్యాగ్ ప్రతి హీరోకు ఉంటుంది. అది ఫ్యాన్స్‌కి ఓ ఎమోషన్. అభిమాన నటుడిని ఆ ట్యాగ్‌తో పిలిచేందుకు ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. అయితే హీరో రేంజ్ పెరిగేకొద్దీ ఈ ట్యాగ్ పేర్లూ మారుతున్నాయి. ‘పుష్ప’కి ముందు అల్లు అర్జున్‌కి స్టైలిష్ స్టార్ అని ఉండగా తర్వాత ఐకాన్ స్టార్ అయ్యారు. RRR తర్వాత యంగ్ టైగర్ కాస్తా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌గా ట్యాగ్స్ మారాయి.

News March 23, 2024

టెన్త్ క్లాస్ అమ్మాయిలకు గంజాయి.. సంచలన విషయాలు

image

TS: జగిత్యాలలో టెన్త్ క్లాస్ అమ్మాయిలు <<12905092>>గంజాయికి<<>> బానిసలైన కేసులో ఎస్పీ సంచలన విషయాలు వెల్లడించారు. జగిత్యాల గంజాయికి విశాఖతో లింక్ ఉందని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశామని, వీరు చదువు మానేసి గంజాయి విక్రయిస్తున్నారని తెలిపారు. సీలేరు నుంచి గంజాయి తెచ్చి జగిత్యాలలో చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.

News March 23, 2024

సికింద్రాబాద్ BRS ఎంపీ అభ్యర్థిగా పద్మారావు‌గౌడ్

image

TG: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. పద్మారావుగౌడ్ గతంలో ఎక్సైజ్ మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఈయన సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు సికింద్రాబాద్ స్థానంలో బీజేపీ తరఫున కిషన్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున దానం నాగేందర్ బరిలో ఉన్నారు.

News March 23, 2024

160కి పైగా సీట్లు వస్తాయి: CBN

image

AP: పొత్తుల వల్ల అందరికీ సీట్లు ఇవ్వలేకపోయామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి అభ్యర్థి గెలవాలనేది మూడు పార్టీల లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సారి గెలవకపోతే రాష్ట్రం నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. ఎన్డీయేకు దేశంలో 400కు పైగా, రాష్ట్రంలో 160కి పైగా సీట్లు వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ-జనసేన-బీజేపీ నేతలతో వర్క్‌షాప్‌లో CBN ఈ కామెంట్స్ చేశారు.

News March 23, 2024

ధోనీ కొన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చు: గేల్

image

ఆర్సీబీతో మ్యాచ్‌లో చురుగ్గా కనిపించిన ఎంఎస్ ధోనీ ఈ ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడకపోవచ్చని మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ తెలిపారు. ‘ఈ సీజన్‌లో కెప్టెన్ కూల్ బహుశా అన్ని మ్యాచ్‌లు ఆడరు. టోర్నమెంట్ మధ్యలో స్వల్ప విరామం తీసుకోవచ్చు. అందుకే నాయకత్వ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించారు. అయినా ధోనీ బాగానే రాణిస్తారు. దీని గురించి చింతించకండి’ అని గేల్ తెలిపారు.

error: Content is protected !!