News March 23, 2024
రేవంత్ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు: వీహెచ్
TG: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ నేతల చేరికపై ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అసహనం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్‌ను కాదని ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇప్పుడు ఆ పార్టీ నేతలను కాంగ్రెస్‌లోకి ఎలా తీసుకుంటారు. వాళ్లను తీసుకుని మన కార్యకర్తలకు అన్యాయం చేయొద్దు. రేవంత్ వెళ్లి ఆ పార్టీ నేతలను ఆహ్వానించడం సరికాదు. ఇలా చేసి ఆయన తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News September 9, 2024
NTR ‘దేవర’ క్రేజ్ ఇదే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ మూవీ ప్రీబుకింగ్స్‌లో గత రికార్డులను బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్తోంది. సినిమా రిలీజ్‌కు ఇంకా 18 రోజులు ఉండగా, ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే ‘దేవర’ నార్త్ అమెరికా బుకింగ్స్‌లో $1Mకు చేరువైంది. రేపు విడుదలయ్యే ట్రైలర్ అంచనాలు పెంచితే ఈ క్రేజ్ మరింత పీక్స్‌కు చేరే ఛాన్సుంది. ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.
News September 9, 2024
మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అస్వస్థత
TG: మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. దీంతో హుటాహుటిన ఆయనను గ్రీన్ ఛానెల్ ద్వారా ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 9, 2024
ఏలేరు రిజర్వాయర్‌కు పోటెత్తిన వరద
AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో కాకినాడ(D) ఏలేరు రిజర్వాయర్‌కు భారీ వరద వస్తోంది. ఇన్‌ఫ్లో 45,019, ఔట్‌ఫ్లో 21,775 క్యూసెక్కులుగా ఉంది. ఏలేశ్వరం- అప్పన్నపాలెం మధ్య కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాజుపాలెం వద్ద కాలువకు గండి పడింది. కాండ్రకోట వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. కిర్లంపూడి, పెద్దాపురం మండలాల్లో పంటలు నీట మునిగాయి. సమీప గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.