news

News March 22, 2024

డాక్టర్లు సైతం ఏఐ వాడాల్సిందే: ప్రముఖ సర్జన్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైద్య రంగాన్ని దెబ్బతీయొచ్చని ఊహాగానాలు వస్తున్న వేళ ప్రముఖ సర్జన్ డాక్టర్ అతుల్ గవాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘వైద్య రంగంలో ఏఐ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఏఐ డాక్టర్లను భర్తీ చేయదు. కానీ ఏఐని ఉపయోగించని డాక్టర్ స్థానంలో ఆ టెక్నాలజీ వాడే మరో డాక్టర్ వస్తారు. ఏఐతో వ్యాధులను ముందస్తుగా గుర్తించడమే కాక మరింత వేగంగా చికిత్స అందించొచ్చు’ అని పేర్కొన్నారు.

News March 22, 2024

కోహ్లీ.. T20ల్లో 12,000 రన్స్

image

రన్ మెషీన్ కోహ్లీ అరుదైన మైలురాయి అందుకున్నారు. T20 క్రికెట్‌లో 12,000 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా అవతరించారు. మొత్తంగా 6వ క్రికెటర్‌గా నిలిచారు. గతంలో గేల్(14562), మాలిక్(13360), పొలార్డ్(12900), హేల్స్(12319), వార్నర్(12065) ఈ ఫీట్ సాధించారు. కాగా తక్కువ ఇన్నింగ్సుల్లో(360) ఈ మైలురాయి అందుకున్న 2వ క్రికెటర్‌గా కోహ్లీ నిలిచారు. గేల్(345) టాప్‌లో ఉన్నారు.

News March 22, 2024

‘దేవర’లో NTR భార్య ఈవిడే

image

దేవర సినిమాలో తాను నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి మరాఠే స్వయంగా ప్రకటించారు. ‘దేవర సినిమా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శ్రుతి. ఇప్పటికే ఈ మూవీలో జాన్వీ కపూర్ ‘తంగం’ అనే పాత్రలో కనిపించనుండగా, శ్రుతి రెండో హీరోయిన్. ఎన్టీఆర్ కూడా డ్యూయల్ రోల్ చేస్తారని టాక్.

News March 22, 2024

దారికొచ్చిన మాల్దీవ్స్!

image

ఇటీవల ఇండియాపై విషం కక్కుతున్న మాల్దీవ్స్ దారికొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ దేశ ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జు తాజాగా ఇండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ తమకు అత్యంత సన్నిహిత దేశమని అభివర్ణించారు. అంతేకాదు.. ఇటీవల మాల్దీవ్స్ నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలని హుకుం జారీ చేసిన ముయిజ్జు ఇప్పుడు భారత్ నుంచి రుణ విముక్తి కోరుతున్నారు. మాల్దీవ్స్‌కు సహాయం అందించడంలో భారత్ ముందుంటుందని కొనియాడారు.

News March 22, 2024

నరసరావుపేట బరిలో ఎముకల వైద్య నిపుణులు

image

AP: పల్నాడు(D) నరసరావుపేటలో మరోసారి ఆసక్తికర పోరు జరగనుంది. TDP నుంచి చదలవాడ అరవింద బాబు, YCP తరఫున గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోటీకి సై అంటున్నారు. వృత్తి రీత్యా వీరిద్దరూ ఎముకలు, కీళ్లకు సంబంధించిన సీనియర్ వైద్యులు కావడం గమనార్హం. నియోజకవర్గ పరిధిలో సొంత హాస్పిటల్స్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. 2019 ఎన్నికల్లో గోపిరెడ్డికి లక్ష ఓట్లు రాగా, చదలవాడకు 68 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.

News March 22, 2024

మిగతా నగరాలకూ బెంగళూరు పరిస్థితేనా?

image

తగిన చర్యలు తీసుకోకుంటే ఇతర ప్రాంతాలకూ బెంగళూరు తరహాలో నీటి ఎద్దడి తప్పవంటున్నారు నిపుణులు. ప్రస్తుతం దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు 38% మాత్రమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటకతో పాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, MP, త్రిపుర, రాజస్థాన్, బిహార్, మహారాష్ట్ర, UP, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గత ఏడాదితో పోలిస్తే నీటి నిల్వలు తగ్గినట్లు తెలుస్తోంది.

News March 22, 2024

జైలు నుంచే CMగా పని చేయవచ్చా?

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ CM కేజ్రీవాల్‌కు నేరం రుజువైతే జైలు శిక్ష పడవచ్చు. అయితే.. ఆయన జైలు నుంచే రాష్ట్రాన్ని నడిపిస్తారని AAP నేతలు చెబుతున్నారు. మరి అది సాధ్యమేనా? అంటే.. సాధ్యమే. కేజ్రీవాల్‌కు జైలు శిక్ష పడినా కారాగారం నుంచే ప్రభుత్వాన్ని నడిపించవచ్చు. జైలు నుంచి CMగా పని చేయవద్దనే నిబంధనలు రాజ్యాంగంలో లేవు. 2ఏళ్ల జైలు శిక్ష పడితే మాత్రం ఆయన పదవి కోల్పోతారు.

News March 22, 2024

పురందీశ్వరి రాజీనామా అంటూ ప్రచారం.. ఖండించిన బీజేపీ

image

ఏపీ బీజేపీ అధ్యక్షురాలి పదవికి పురందీశ్వరి రాజీనామా చేశారనే వార్త వైరల్ అవుతోంది. దీనిపై ఏపీ BJP స్పందించింది. ‘సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ లెటర్ ఒక ఫేక్ లెటర్. ఎన్డీయే కూటమి వ్యతిరేక శక్తులు ప్రచారం చేస్తున్న ఫేక్ న్యూస్ అని గమనించగలరు’ అని ట్వీట్ చేసింది. కాగా, విశాఖ తీరంలో దొరికిన డ్రగ్స్ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో రాజీనామా చేస్తున్నానని పురందీశ్వరి పేరిట ఫేక్ లెటర్ క్రియేట్ చేశారు.

News March 22, 2024

సంచలనంగా మారిన కేజ్రీవాల్ కస్టడీ విధింపు!

image

లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు కస్టడీ విధించడం సంచలనంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీకి సీఎం అయిన ఆయనను అరెస్ట్ చేయడంపై ఇప్పటికే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో అరెస్టును ఖండించాయి. ఇప్పుడు ఏకంగా కస్టడీకి ఇవ్వడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే జైలులో ఉన్న కవిత, మనీశ్ సిసోడియాతో కలిపి కేజ్రీవాల్‌ను విచారించొచ్చు.

News March 22, 2024

RCBకి షాక్

image

CSKతో జరుగుతున్న ఆరంభ మ్యాచులో RCBకి బిగ్ షాక్ తగిలింది. చెన్నై బౌలర్ ముస్తాఫిజుర్ విజృంభించి ఏకంగా 4 వికెట్లు పడగొట్టారు. దీంతో RCB 12 ఓవర్లకే 78 పరుగులకు 5 కీలక వికెట్లు కోల్పోయింది. డుప్లెసిస్ (35), కోహ్లీ(21), గ్రీన్(18), రజత్ పాటీదార్, మ్యాక్స్‌వెల్ డకౌట్ అయ్యారు.

error: Content is protected !!