News November 10, 2024

NDA vs INDIA: ఈ 2 నినాదాలపై ఎవరి వెర్షన్ వాళ్లది!

image

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బాటేంగే తో కాటేంగే, ఏక్ హై తో సేఫ్ హై నినాదాలు మార్మోగుతున్నాయి. NDA, INDIA వీటిని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి. బాటేంగే తో కాటేంగేకు విడిపోతే నష్టపోతామని అర్థం. ఏక్ హై తో సేఫ్ హై అంటే ఒక్కటిగా ఉంటే భద్రంగా ఉంటామని అర్థం. కులాల వారీగా విడిపోతే నష్టపోతామని, హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని బీజేపీ అంటోంది. హిందూ ముస్లిములను విడదీస్తే నష్టమన్నది కాంగ్రెస్ వాదన.

Similar News

News December 11, 2024

పేర్ని నాని భార్య జయసుధపై కేసు

image

AP: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధపై కేసు నమోదైంది. సివిల్ సప్లైస్ అధికారి కోటి రెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో జయసుధ పేరిట నాని ఓ గిడ్డంగి నిర్మించారు. దీనిని పౌరసరఫరాలశాఖకు అద్దెకు ఇచ్చారు. ఇటీవల ఈ గోడౌన్‌ను పోలీసులు తనిఖీలు చేయగా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు.

News December 11, 2024

రాష్ట్రంలో మళ్లీ రేషన్ మాఫియా: జగన్

image

AP: రాష్ట్రంలో రేషన్ మాఫియా మళ్లీ వచ్చిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన మండిపడ్డారు. ‘ప్రజలకు నాణ్యమైన స్వర్ణరకం బియ్యం ఇవ్వడం లేదు. సార్టెక్స్ బియ్యం అందుబాటులో లేదు. ప్రజలకు నాసిరకం బియ్యం ఇస్తున్నారు. ఆర్థిక మంత్రి వియ్యంకుడే బియ్యం అక్రమ ఎగుమతులు చేస్తున్నారు. కానీ నిందలు మాపై వేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News December 11, 2024

ఇంకా జోరు తగ్గని ‘దేవర’

image

ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ విడుదలై మూడు నెలలు దాటినా జోరు కొనసాగిస్తోంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆ వేదికపై అత్యధికంగా వీక్షించిన రెండో దక్షిణాది చిత్రంగా నిలిచింది. వరుసగా 5వారాల పాటు టాప్ 10లో ట్రెండ్ అవుతోందని దేవర మూవీ టీమ్ తెలిపింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్‌వైడ్ రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.