news

News October 24, 2024

ఒక్కో కార్మికుడికి రూ.93,750.. దీపావళి బోనస్ రిలీజ్

image

TG: ఒక్కో కార్మికుడికి దీపావళి బోనస్‌గా సింగరేణి యాజమాన్యం రూ.93,750 ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా యాజమాన్యం బోనస్ అమౌంట్ రూ.358 కోట్లు రిలీజ్ చేసింది. అంతకుముందు లాభాల వాటా రూ.796 కోట్లను కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు అందజేసిన సంగతి తెలిసిందే.

News October 24, 2024

సంచలనం.. 256 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే చేధించారు

image

మహారాష్ట్ర ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలనం నమోదైంది. పీబీజీతో జరిగిన మ్యాచులో జెట్ జట్టు భారీ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన PBG 20 ఓవర్లలో 256 పరుగులు చేసింది. ఛేదనలో జెట్ 18.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. జెట్ బ్యాటర్లలో దివ్యాంగ్(49 బంతుల్లో 93*), రోహిత్ పాటిల్(30 బంతుల్లో 80) పరుగులు చేశారు.

News October 24, 2024

బెంగళూరు నుంచి ఏపీకి వచ్చేయండి: నారా లోకేశ్

image

బెంగళూరులో డ్రైనేజీ, ట్రాఫిక్ ఐటీ కంపెనీల విస్తరణకు ఆటంకాలుగా మారాయని పారిశ్రామికవేత్త మోహన్‌దాస్ పాయ్ చేసిన ట్వీట్‌కు మంత్రి లోకేశ్ స్పందించారు. బెంగళూరును వదిలి APకి రావాలని, పెట్టుబడులు పెట్టే వారి కోసం 6 పాలసీలు సిద్ధం చేశామని తెలిపారు. ‘జగన్ ప్రభుత్వంలో పెట్టుబడిదారులు కంపెనీలు స్థాపించేందుకు భయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడినా, ఇంకా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంది’ అని మోహన్ అన్నారు.

News October 24, 2024

సుందర్ మ్యాజిక్.. న్యూజిలాండ్ 259కు ఆలౌట్

image

టీమ్ ఇండియా స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ విజృంభణతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో 197/4తో పటిష్ఠంగా ఉన్న కివీస్‌ను సుందర్ చావు దెబ్బ తీశారు. మొత్తం 7 వికెట్లు తీసి ప్రత్యర్థుల పతనాన్ని శాసించారు. బ్లాక్ క్యాప్స్‌లో డెవాన్ కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) ఫిఫ్టీలతో రాణించారు. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించాల్సి ఉంది.

News October 24, 2024

సుందర్ వండర్

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కుల్దీప్ స్థానంలో జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ అదరగొడుతున్నారు. మూడేళ్ల తర్వాత టీమ్‌లో చోటు దక్కించుకున్న ఆయన తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు నేలకూల్చారు. సెటిల్‌గా కనిపిస్తున్న రవీంద్రను ఔట్ చేసి వికెట్ల వేటను ప్రారంభించారు. ఏకంగా ఐదుగురిని బౌల్డ్ చేయడం విశేషం. టెస్టుల్లో 5 వికెట్లు తీయడం సుందర్‌కు ఇదే తొలిసారి.

News October 24, 2024

ట్రంప్ నన్ను అసభ్యంగా తాకారు: మాజీ మోడల్

image

అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనను 1993లో అసభ్యంగా తాకారని మాజీ మోడల్ స్టేసీ విలియమ్స్ ఆరోపించారు. ‘న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ నాకు ట్రంప్‌ను తొలిసారి పరిచయం చేశారు. మొదట మామూలుగా పలకరించారు. తర్వాత అసభ్యంగా తాకడం ప్రారంభించారు. భయంతో నాకు నోట మాట రాలేదు. తర్వాత కుమిలిపోయాను’ అని వెల్లడించారు. ఆమె ఆరోపణల్ని ట్రంప్ వర్గం ఖండించింది.

News October 24, 2024

సైకిల్ గుర్తుపై పోటీ చేయ‌నున్న కాంగ్రెస్ అభ్య‌ర్థులు

image

UPలో 9 అసెంబ్లీ స్థానాల‌ ఉపఎన్నిక‌ల్లో పోటీపై ఇండియా కూట‌మి అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. కాంగ్రెస్ అభ్య‌ర్థులు కూడా స‌మాజ్‌వాదీ పార్టీ ‘సైకిల్’ గుర్తు మీద పోటీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు రాహుల్‌తో చ‌ర్చించాక అఖిలేశ్ యాద‌వ్ వెల్ల‌డించారు. సీట్ల పంప‌కాల కంటే గెలుపే ల‌క్ష్యంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. 9 స్థానాల్లో 7 చోట్ల‌ ఎస్పీ, 2 చోట్ల కాంగ్రెస్ అభ్య‌ర్థులు సైకిల్ గుర్తుపై పోటీ చేయనున్నారు.

News October 24, 2024

అందుకే రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం: కిషన్‌రెడ్డి

image

రాష్ట్రాలు వాటా ఇవ్వకపోవడంతో కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 40 స్టేషన్లను ఆధునీకరిస్తామని ఆయన వెల్లడించారు. కాజీపేటలో రూ.680కోట్లతో తయారీ యూనిట్ రాబోతోందన్నారు. రాష్ట్రం నుంచి సహకారం లేకపోయినా రూ.650కోట్లతో MMTS పొడిగిస్తామన్నారు.

News October 24, 2024

గ్రూప్-1, గ్రూప్-2పై ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ ఆరా

image

AP: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం పెండింగ్ లో ఉన్న నియామకాలపై బోర్డు సభ్యులు, అధికారులతో రివ్యూ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 సహా పలు పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆరా తీశారు. కొత్తగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లపై వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటామని అనురాధ తెలిపారు.

News October 24, 2024

వాంతులు, విరేచ‌నాల‌తో ఇద్ద‌రు మృతి.. మంత్రి కీలక ఆదేశాలు

image

AP: ప‌ల్నాడు(D) దాచేప‌ల్లిలో వాంతులు, విరేచ‌నాల‌తో ఇద్ద‌రు వ్య‌క్తుల మృతిపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ నిర్వహించారు. వారి మృతికి నీరు క‌లుషితం కావ‌డమే కారణమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. స్థానికంగా ఉన్న బోర్ల‌లో నీటిని విజ‌య‌వాడ ల్యాబ్‌కు ప‌రీక్ష‌ల‌కు పంపాల‌ని ఆదేశించారు. బోర్ల‌ను మూసివేసి వాట‌ర్ ట్యాంక‌ర్ల ద్వారా తాగునీరు స‌ర‌ఫ‌రా చేయాల‌ని సూచించారు. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.