News October 24, 2024
ట్రంప్ నన్ను అసభ్యంగా తాకారు: మాజీ మోడల్
అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తనను 1993లో అసభ్యంగా తాకారని మాజీ మోడల్ స్టేసీ విలియమ్స్ ఆరోపించారు. ‘న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ నాకు ట్రంప్‌ను తొలిసారి పరిచయం చేశారు. మొదట మామూలుగా పలకరించారు. తర్వాత అసభ్యంగా తాకడం ప్రారంభించారు. భయంతో నాకు నోట మాట రాలేదు. తర్వాత కుమిలిపోయాను’ అని వెల్లడించారు. ఆమె ఆరోపణల్ని ట్రంప్ వర్గం ఖండించింది.
Similar News
News November 5, 2024
ఆడబిడ్డల పరామర్శకు వెళ్లండి పవన్: అంబటి
AP: పల్నాడు జిల్లాలో జగన్‌కు చెందిన సరస్వతి పవర్ భూముల పరిశీలనకు వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘సరస్వతి భూముల పరిశీలనకు కాదు వెళ్లాల్సింది. బలైపోయిన ఆడబిడ్డల కుటుంబాల పరామర్శకు!’ అని రాసుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని విపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
News November 5, 2024
చీటింగ్ చేసేందుకే ఆ చట్టం తెచ్చారు: ఎలాన్ మస్క్
అమెరికా ఎన్నికల పోలింగ్ జరగనున్న వేళ కాలిఫోర్నియా గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త రూల్‌ను ఎలాన్ మస్క్ లేవనెత్తారు. నెల రోజుల క్రితమే అక్కడ ఎన్నికలలో IDని చూపించడాన్ని చట్టవిరుద్ధం చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఓటింగ్‌లో చీటింగ్ చేసేందుకే ఇది తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ప్రతిచోట ఐడీ చూపించాలని నిబంధన పెట్టి, ఎంతో ముఖ్యమైన ఓటింగ్ సమయంలో చూపించడం నేరమంటే ఎలా అని నెటిజన్లు మండిపడుతున్నారు.
News November 5, 2024
సిక్కులు, హిందువుల విభజనే ఖలిస్థానీల టార్గెట్: కెనడా మాజీ మంత్రి
కెనడాలో సిక్కులు, హిందువులను విడదీయడమే ఖలిస్థానీల టార్గెట్ కావొచ్చని ఆ దేశ మాజీమంత్రి ఉజ్జల్ దేవ్ దోసాంజి అన్నారు. అక్కడి విభజన విత్తనాన్ని మెల్లగా భారత్‌లో నాటాలన్నదే ప్లాన్ అని పేర్కొన్నారు. ఖలిస్థానీ ఇష్యూపై అక్కడి నేతలు నిద్ర నటిస్తున్నారని, కనీసం ఆ పేరే ఎత్తడం లేదని విమర్శించారు. చాన్నాళ్లుగా ఖలిస్థానీ తీవ్రవాదం మరుగున పడిందని, ట్రూడో రాగానే మళ్లీ మొదలైందని వివరించారు.