news

News November 27, 2024

సాస్కి నిధులతో గోదావరి, గండికోట అభివృద్ధి: దుర్గేష్

image

సాస్కి(స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్) పథకం ద్వారా APకి కేంద్రం రూ.113.75 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో అఖండ గోదావరి, గండికోట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తొలి విడత నిధుల్లో 75% వినియోగించాక కేంద్రం తదుపరి విడత నిధులు విడుదల చేస్తుందన్నారు. కేంద్రం సాయంతో పర్యాటకంలో ఏపీని నం.1గా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.

News November 27, 2024

SRHకు సెలక్ట్ అవ్వడం రిలీఫ్‌గా ఉంది: హర్షల్

image

IPL వేలంలో SRHకు ఎంపికవడంపై హర్షల్ పటేల్ సంతోషం వ్యక్తం చేశారు. ‘SRHకు ఎంపికవడం చాలా రిలీఫ్‌గా ఉంది. ఆ జట్టు తరఫున బౌలింగ్ చేయడం సులువేమో కానీ వారికి అపోజిట్‌గా బౌలింగ్ వేయడం కష్టం. గత సీజన్‌లో SRH బ్యాటర్లు ఎలా విధ్వంసకరంగా బ్యాటింగ్ చేశారో చూశాం. కాబట్టి ఆ టీమ్‌కు ఆడటం ఉపశమనాన్నిస్తుంది’ అని తెలిపారు. గత సీజన్‌లో PBKSకు ఆడిన హర్షల్‌ను తాజా వేలంలో రూ.8కోట్లతో SRH కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే .

News November 27, 2024

EVMలపై INDIA పోరుబాట: దేశవ్యాప్త ఆందోళనకు ప్లానింగ్!

image

మహారాష్ట్రలో చిత్తుగా ఓడిపోయిన MVA దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతోందని సమాచారం. తమ పరాభవానికి EVMలే కారణమని భావిస్తోంది. వాటిని తీసేసి మళ్లీ బ్యాలెట్ వ్యవస్థ అమలు కోసం నిరసనలు చేపట్టనుందని తెలుస్తోంది. ఇందుకోసం కోర్టుల్లో పోరాడేందుకు కాంగ్రెస్, NCP SP, SS UBT లీగల్ టీమ్స్‌నూ ఏర్పాటు చేస్తున్నాయి. మహారాష్ట్ర ఓటమిపై ప్రశ్నిస్తున్న ఇండియా కూటమి ఝార్ఖండ్‌లో విజయంపై సందేహాల్లేవని చెప్తుండటం గమనార్హం.

News November 27, 2024

అభివృద్ధిని ఓర్వలేక కాకుల్లా అరుస్తున్నారు: భట్టి

image

TG: మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికే రూ.10 వేల కోట్ల కేటాయించామని, అభివృద్ధిని ఓర్వలేకే కొందరు కాకుల్లా అరుస్తున్నారని మండిపడ్డారు. పనిలేని విమర్శలతో ప్రతిపక్షాలకు ప్రయోజనం ఉండదన్నారు. మూసీ నిర్వాసితులకు వ్యాపార రుణాలు ఇస్తామని చిట్‌చాట్‌లో వెల్లడించారు.

News November 27, 2024

కారు కొంటున్నారా? ఈ విషయం తెలుసా?

image

ఇండియాలో కార్ల ధరలో సగం పన్నులే అని మీకు తెలుసా? GST 28%, సెస్ 17% ఎక్స్-షోరూం ధరలో కలిసి ఉంటాయి. ఆ తర్వాత రోడ్ ట్యాక్స్ 15-20%, ఇన్సూరెన్స్‌పై 18% జీఎస్టీ విధిస్తారు. కారు రేటు రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే అదనంగా 1% TCS ఉంటుంది. ఉదాహరణకు ఓ కారు ఎక్స్-షోరూం ధర రూ.10 లక్షలు ఉంటే అందులో రూ.3.11 లక్షలు పన్నులే (28% జీఎస్టీ+17% సెస్) ఉంటాయి. ఆ తర్వాత రోడ్ ట్యాక్స్ కింద రూ.2 లక్షలు చెల్లించాలి.

News November 27, 2024

BJP ఎమ్మెల్యేపై చంద్రబాబు సీరియస్

image

AP: ఆర్టీపీపీ బూడిద తరలింపు వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కల్పిస్తే సహించను. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి. ఈ విషయంలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలి’ అని ఆయన ఆదేశించారు.

News November 27, 2024

అదానీ షేర్లు అదుర్స్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్స్

image

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు నేడు దుమ్మురేపుతున్నాయి. US కోర్టు మోపిన అవినీతి, లంచం అభియోగాల్లో తమ ప్రతినిధుల పేర్లు లేవని చెప్పడం ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపింది. అదానీ టోటల్ గ్యాస్ 19.9, అదానీ పవర్ 17.1, అదానీ ఎనర్జీ 10, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 9.9, అదానీ గ్రీన్ ఎనర్జీ 9.8, అదానీ విల్మార్ 9, NDTV 7.6, అదానీ పోర్ట్స్ 7.2, అంబుజా 4.7, ఏసీసీ 4, సంఘి 3.7% మేర ఎగిశాయి. ఇక అదానీ నెట్‌వర్త్ $70.8bగా ఉంది.

News November 27, 2024

ఇథనాల్ పరిశ్రమ పనులు ఆపేయాలని కలెక్టర్ ఆదేశాలు

image

TG: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ వద్ద ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు జారీ చేశారు. దిలావర్‌పూర్ గ్రామస్థులతో ఆమె చర్చలు జరిపారు. నిన్నటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చానని, సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వారికి చెప్పారు.

News November 27, 2024

అదానీ అంశంపై క్యాబినెట్‌లో చర్చిస్తాం: పవన్

image

AP: అదానీ వ్యవహారంపై క్యాబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఢిల్లీలో పీఎం మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. మోదీతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలు పరిశీలించాకే చర్యలు తీసుకుంటామని మీడియాతో పవన్ చెప్పారు.

News November 27, 2024

రూ.40 వేల కోట్లు వదిలేసుకుని..

image

వెన్ అజాన్ సిరిపన్యో బౌద్ధ సన్యాసి. ఇతని తండ్రి ఆనంద కృష్ణన్ మలేషియాలోని టాప్-3 ధనవంతుల్లో ఒకరు కాగా తల్లిది థాయ్ రాయల్ ఫ్యామిలీ. 18ఏళ్ల వయసులో థాయ్‌లాండ్ వెళ్లిన సిరిపన్యో సరదాగా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆపై దానికే జీవితాన్ని అంకితం చేసి రూ.40వేల కోట్ల వారసత్వ ఆస్తిని త్యజించాడు. అప్పుడప్పుడు కుటుంబాన్నికలిసే సిరిపన్యో పాత జీవితం తాత్కాలికమైందని చెబుతుంటారంట. ఇతనికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు.