news

News October 11, 2024

పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య: పొంగులేటి

image

TG: GOVT స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ‘అమ్మ ఆదర్శ పథకం’ కింద ₹657 కోట్లు కేటాయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం(D) పొన్నెకల్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమది చేతల ప్రభుత్వమని చెప్పారు. విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

News October 11, 2024

గోపీచంద్ ‘విశ్వం’ REVIEW

image

మంత్రి హత్యను చూసిన ఓ పాప ప్రాణాలను రక్షించేందుకు గోపీరెడ్డి అలియాస్ విశ్వం రంగంలోకి దిగుతాడు. అసలు ఈ విశ్వం ఎవరు, ఎందుకు పాపను రక్షిస్తున్నాడు అన్నది బ్యాలెన్స్ కథ. గోపీచంద్ తన పాత్రను అలవోకగా పోషించారు. నరేశ్, ప్రగతి, పృథ్వీరాజ్, వెన్నెల కిషోర్ కామెడీ ఫర్వాలేదు. సెకండాఫ్‌లో కథను హడావుడిగా చుట్టేయడమే మైనస్. శ్రీను వైట్ల గత 3 సినిమాలతో పోలిస్తే ‘విశ్వం’ బాగుందని చెప్పొచ్చు.
రేటింగ్: 2.25/5

News October 11, 2024

వరదల్లో జగన్ అడుగు బయటపెట్టలేదు: లోకేశ్

image

AP: చట్టాన్ని ఉల్లంఘించిన వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌లో పేరుందని వారు భయపడుతున్నారన్నారు. వరదలొచ్చినప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టలేదని, ఇప్పుడు వరద సాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 11, 2024

నితీశ్‌కుమార్ రెడ్డికి గంభీర్ గోల్డెన్ అడ్వైస్

image

కోచ్ గౌతమ్ గంభీర్ సలహా తన కాన్ఫిడెన్స్‌ను పెంచిందని టీమ్ఇండియా యంగ్ సెన్సేషన్ నితీశ్‌కుమార్ రెడ్డి (NKR) అన్నారు. బంగ్లాతో రెండో టీ20లో మెరుగైన ప్రదర్శనకు అదే కారణమని చెప్పారు. ‘నిజం చెప్పాలంటే నేను గౌతమ్ సర్‌కు థాంక్స్ చెప్పాలి. బౌలింగ్ చేస్తున్నప్పుడు బౌలర్‌లా ఆలోచించాలని, బౌలింగ్ చేయగలిగే బ్యాటర్‌గా కాదని ప్రతిసారీ చెప్తుంటారు’ అని అన్నారు. మ్యాచులో NKR 74 (34balls), 2 వికెట్లు సాధించారు.

News October 11, 2024

తల్లి లేదు.. రాదు.. పాపం ఆ పిల్లలకు అది తెలియదు!

image

ఆ తల్లి కుక్క ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దానికి పాలు తాగే నాలుగు పిల్లలున్నాయి. తమ తల్లి ప్రాణాలతో లేదన్న విషయం అన్నెం పున్నెం తెలియని ఆ పిల్లలకు తెలిసే దారేది? అప్పటి వరకూ ఆడుకుని అలసిపోయి వచ్చాయి. అమ్మ లేస్తుందని, పాలిస్తుందని చూశాయి. ఎంతసేపటికీ తల్లి లేవకపోవడంతో దీనంగా దాని చెంతనే నిద్రపోయాయి. కర్నూలు జిల్లా సి.బెళగల్ బస్టాండ్ ఆవరణలో చోటుచేసుకున్న ఈ సన్నివేశం చూపరులను కదిలించింది.

News October 11, 2024

చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు: లోకేశ్

image

AP: పంటలు పండని అనంతపురంలో కార్లు పరిగెత్తించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి నారా లోకేశ్ చెప్పారు. మంగళగిరిలో కియా షోరూమ్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘దేశంలో ఎక్కడ కియా కారు కనిపించినా మేడిన్ ఆంధ్రా అంటున్నారు. CBN విజన్ ఉన్న నాయకుడు. TCSను ఒప్పించి పెట్టుబడులు తేవడమే కాదు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. చిన్న పరిశ్రమలనూ ప్రోత్సహిస్తూ ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.

News October 11, 2024

ఇంగ్లండ్ చేతిలో పాక్ ఘోర పరాజయం

image

ముల్తాన్‌ టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాభవంపాలైంది. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్‌పై తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 556 పరుగులు చేశాక కూడా ప్రత్యర్థి చేతిలో ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. ఇలా ఓడిన తొలిజట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్‌ను 823-7 స్కోరు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 220కే ఆలౌటైంది. లీచ్ 4 వికెట్లు పడగొట్టారు.

News October 11, 2024

యువకుడి కడుపులో ప్రాణాలతో బొద్దింక.. వైద్యులు ఏం చేశారంటే?

image

ఢిల్లీ డాక్టర్లు ఓ యువకుడి కడుపులో బతికి ఉన్న బొద్దింకను ఎండోస్కోపి ద్వారా తొలగించారు. గత కొంత కాలంగా యువకుడు తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా పరీక్షించిన ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు చిన్న పేగుల్లో బొద్దింక ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే అతనికి ఎండోస్కోపి చేసి దానిని తొలగించారు. అన్నం తింటుండగా లేదా నిద్రిస్తున్న సమయంలో నోటి ద్వారా బొద్దింక లోపలికి వెళ్లి ఉంటుందని చెప్పారు.

News October 11, 2024

East Asia సదస్సులో మోదీ రికార్డ్

image

East Asia సదస్సులో హోస్ట్, కాబోయే ఛైర్‌పర్సన్ తర్వాత మాట్లాడే మొదటి అతిథి ప్రధాని నరేంద్రమోదీ అని తెలిసింది. ఇప్పటి వరకు ఈ సదస్సు 19 సార్లు జరగ్గా 9 సార్లు పాల్గొన్న ఏకైక నేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, శాంతి గురించి ఆయన మాట్లాడతారు. క్వాడ్ పాత్రను వివరిస్తారు. లావోస్ బయల్దేరే ముందు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఇక ASEANలోనూ భారత్ పాత్ర, ప్రాముఖ్యం పెరిగింది.

News October 11, 2024

ఇ-కామర్స్ కంపెనీల dark patternsపై కేంద్రం స్క్రూటినీ

image

ఫెస్టివ్ సీజన్లో ఇ-కామర్స్ కంపెనీలు డార్క్ ప్యాటర్న్ రూల్స్ పాటిస్తున్నాయో లేదో పరిశీలించేందుకు కేంద్రం సిద్ధమైంది. యూజర్ల ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు త్వరగా కొనేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీని క్రియేట్ చేస్తుంటాయి. ఇంకా 2 ఐటెమ్స్ మాత్రమే ఉన్నాయి, మరికాసేపట్లో ఈ వస్తువుపై డిస్కౌంట్ ఉండదని ఫ్లాష్ చేస్తుంటాయి. ఇవన్నీ అన్‌ఫెయిర్ ప్రాక్టీసెస్ కిందకు వస్తాయి.