India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: లడ్డూ వివాదంపై ఎన్డీఏ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ రాజు అన్నారు. లడ్డూ తయారీ ఆరోపణల్లో నిజం ఉందన్నారు. అవసరమైతే విచారణలో కేంద్రం తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని తెలిపారు.

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ & ఆర్ట్ డైరెక్టర్ రజత్ పొద్దార్ కన్నుమూశారు. బర్ఫీ, ఫైటర్, పఠాన్‌లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన పనిచేశారు. తమ జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఉండిపోతారని Tసిరీస్ ట్వీట్ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. రజత్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆయన స్నేహితుడు అనీశ్ తెలిపారు. నిన్న కూడా ఎంతో ఆహ్లాదంగా మాట్లాడుకున్నామన్నారు.

AP: దేశాన్ని, మతాలను ప్రశ్నించే స్థాయికి జగన్ వచ్చేశారని TDP MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఆయనకు కొవ్వెక్కి ఇదేం దేశం అంటున్నారని, ఇండియా కాదనుకుంటే పాక్ లేదా దుబాయ్‌కి వెళ్లిపోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం చేస్తే భారతి ఇంట్లోకి రానివ్వదని పర్యటన రద్దు చేసుకున్నావా? అని ప్రశ్నించారు. తల్లి, చెల్లిని దూరం చేసుకున్న వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు.

రోజురోజుకూ ఎగబాకుతున్న వెండి ధరలు ఇవాళ కాస్త దిగివచ్చాయి. కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి, రూ.95,000కు చేరింది. మరోవైపు బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 24, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్లు రూ.50 చొప్పున తగ్గి రూ.77,400, రూ.70,950గా ఉన్నాయి.

కశ్మీర్‌లోని కుల్గాంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసు బలగాలు కుల్గాం, అరిగాంలో జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడ్డ ఉగ్రవాదులు విచక్షణారహితంగా భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు భారత సైన్యం తెలిపింది.

FM నిర్మలా సీతారామన్‌పై FIR నమోదు చేయాలని బెంగళూరులోని ఓ స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ద్వారా ఆమె బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపిస్తూ JSP నేత ఆదర్శ్ అయ్యర్ ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు BJP ప్రెసిడెంట్ జేపీ నడ్డా, రాష్ట్ర పార్టీ నేతలు నళీన్ కుమార్, బీవై విజయేంద్ర పేర్లనూ చేర్చారు. ED దాడులతో ఒత్తిడి చేసి కార్పొరేట్లతో రూ.కోట్ల విలువైన బాండ్లు కొనిపించారని ఆరోపించారు.

కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు వర్షం కారణంగా రెండో రోజు రద్దయింది. ఈ విషయాన్ని అంపైర్లు ప్రకటించారు. రెండో రోజూ ఒక్క బంతి కూడా పడకపోవడం గమనార్హం. కొన్ని గంటలుగా వర్షం లేకపోయినప్పటికీ నీరు ఇంకా గ్రౌండ్‌లో నిలిచి ఉంది. 3 సూపర్ సప్పర్స్ పనిచేస్తున్నా ప్రయోజనం లేకపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది.

AP: వైసీపీ వేగంగా వ్యాప్తి చేయాలనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘మనం ప్రజలకు నిజం చెప్పేలోపు జగన్ అబద్ధాలను ప్రచారం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వం-పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలి’ అని బాబు సూచించారు.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ బర్త్ డే సందర్భంగా పారిశ్రామికవేత్తగా మారనున్నారు. ఆయన సొంతగా క్లాతింగ్ బ్రాండ్‌ను ‘ARKS’ పేరుతో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇంకా అధికారికంగా ఈ బ్రాండ్ అందుబాటులోకి రానప్పటికీ ఆయన భార్య అలియా, తల్లి నీతూ కపూర్ ఇన్‌స్టాలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. @arks సైతం ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. కాగా, రణ్‌బీర్‌కు సోషల్ మీడియా అకౌంట్స్ లేవు.

వైసీపీ చీఫ్ జగన్ తీరు హిందుత్వంపై దాడి చేసేలా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. డిక్లరేషన్ ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఇతర మతస్థులు హిందూ ఆలయాల్లోకి వస్తే డిక్లరేషన్ ఇచ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులని చెప్పారు. వారిని క్రిస్టియన్లుగా మార్చే కుట్ర సాగుతోందన్నారు. మమ్మీ, డాడీ కల్చర్ వద్దని, అమ్మనాన్నే ముద్దు అని చెప్పారు.
Sorry, no posts matched your criteria.