News September 28, 2024
కుల్గాంలో ఉగ్రవాదుల కాల్పులు.. నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
కశ్మీర్‌లోని కుల్గాంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల సమాచారంతో భారత సైన్యం, స్థానిక పోలీసు బలగాలు కుల్గాం, అరిగాంలో జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడ్డ ఉగ్రవాదులు విచక్షణారహితంగా భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్టు భారత సైన్యం తెలిపింది.
Similar News
News October 7, 2024
22, 23 తేదీల్లో విజయవాడలో డ్రోన్ సమ్మిట్
AP: విజయవాడలో ఈ నెల 22, 23 తేదీల్లో అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ జరగనుంది. డ్రోన్ల తయారీ సంస్థలు, ఐఐటీలు, ఐఐఎస్‌సీల నుంచి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 22న కృష్ణా తీరంలో 5వేల డ్రోన్లతో భారీ ప్రదర్శన జరుగుతుంది. సదస్సులో సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారు. విస్తృతమైన ప్రజా వినియోగానికి వీలుగా డ్రోన్లను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
News October 7, 2024
కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హార్దిక్
టీ20ల్లో అత్యధిక మ్యాచులను సిక్సర్లతో ముగించిన భారత ప్లేయర్‌గా హార్దిక్ పాండ్య నిలిచారు. బంగ్లాతో మ్యాచులో కోహ్లీ(4 మ్యాచులు) రికార్డును అధిగమించారు. ఆ తర్వాతి స్థానాల్లో ధోనీ, పంత్ మూడేసి మ్యాచులతో ఉన్నారు. కాగా బంగ్లాదేశ్ జరిగిన T20 మ్యాచులో హార్దిక్ 39 పరుగులు చేయగా అందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదారు.
News October 7, 2024
బతుకమ్మకు అమెరికాలో అరుదైన గౌరవం
తెలంగాణ పువ్వుల పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు ఈ పండుగను అధికారికంగా గుర్తించాయి. అంతే కాకుండా ఈ వారాన్ని హెరిటేజ్ వీక్‌గా ప్రకటిస్తూ ఆ రాష్ట్రాల గవర్నర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై అమెరికాలోని తెలంగాణ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.