news

News October 25, 2024

అందుకే ఐదేళ్లు మౌనంగా ఉన్నా: షర్మిల

image

AP:ఆస్తి కోసం తాను, అమ్మ అత్యాశ పడుతున్నామని YS అభిమానులు భావించవద్దని షర్మిల కోరారు. ‘ఆస్తుల విభజన ఒప్పందం ఐదేళ్లు నా చేతుల్లో ఉన్నా ఏనాడూ బయటికి చెప్పలేదు. ఒక్క ఆస్తి ఇవ్వకపోయినా, ఆర్థిక ఇబ్బందులు పడినా కుటుంబ గౌరవం కోసం బయటపెట్టలేదు. తాజాగా ఇవన్నీ బయటకు వచ్చాయంటే NCLTలో కేసు వేసి సొంత అమ్మకే బతుకుపై అసహ్యం కలిగించి, YSR అభిమానులను ఎనలేని క్షోభకు గురిచేసింది ఎవరో మీకు తెలుసు’ అని పేర్కొన్నారు.

News October 25, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్

image

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు అధికారులకు ఫోన్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను కిందకి దించి తనిఖీలు చేస్తున్నారు. ఆ విమానంలో 130 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.

News October 25, 2024

IPL ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్

image

IPL రిటెన్షన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు మంచి కిక్కిచ్చే న్యూస్. ఈ నెల 31వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు రిటెన్షన్ షో ప్రారంభం అవుతుందని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. జియో సినిమాలో దీనికి సంబంధించి లైవ్ ప్రసారం అవుతుంది. అట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను ఆయా జట్లు ఆ రోజున ప్రకటించనున్నాయి. మీ అభిమాన జట్టు ఏ ప్లేయర్‌ను రిటెయిన్ చేసుకుంటుందని మీరు అంచనా వేస్తున్నారో కామెంట్ చేయండి.

News October 25, 2024

పక్షవాతం వచ్చిందని వార్తలు.. ఫైర్ అయిన ఆలియా

image

తాను కాస్మొటిక్ సర్జరీ చేసుకున్నానని, అది విఫలమైందని వస్తోన్న వార్తలను బాలీవుడ్ నటి ఆలియా భట్ ఖండించారు. ‘సోషల్ మీడియాలో వస్తోన్న ఈ వార్తలు ఫేక్. నా శరీరం ఒక వైపు పక్షవాతానికి గురైందని, అందుకే వంకరగా నవ్వుతున్నానని, విచిత్రంగా మాట్లాడుతున్నానని వార్తలు రాస్తున్నారు. క్లిక్స్& అటెన్షన్ కోసం ఇలాంటివి చేస్తున్నారా? ఎలాంటి ప్రూఫ్ లేకుండా, కన్ఫర్మేషన్ లేకుండా ఎలా రాస్తారు’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు.

News October 25, 2024

అవన్నీ జగన్ సొంత ఆస్తులు కాదు: షర్మిల

image

AP: జగన్‌తో ఆస్తుల గొడవలపై YS షర్మిల 3 పేజీల లేఖను విడుదల చేశారు. ‘స్వార్జితం అని జగన్ చెప్పుకుంటున్న ఆస్తులన్నీ కుటుంబానివే. ఆయన గార్డియన్ మాత్రమే. 2019లో సీఎం అయ్యాక విడిపోదామా? అని జగన్ ప్రతిపాదన పెట్టారు. సాక్షి, భారతి సిమెంట్స్‌లో 60% వాటా తీసుకుంటానంటే, ఒప్పుకోలేదని మాపై కేసు వేశారు. నాన్న పేరు చెడిపోతుందని మౌనంగా ఉన్నాం. కొడుకే తల్లిని కోర్టుకు ఈడ్చటం ఎంత అవమానం?’ అని లేఖలో పేర్కొన్నారు.

News October 25, 2024

ఉచిత గ్యాస్ సిలిండర్ రాకపోతే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి: ప్రభుత్వం

image

AP: ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ <<14449018>>బుకింగ్ <<>>చేసుకోవచ్చని ప్రకటించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరికైనా పథకం అందకపోతే 1967 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించింది. మొదటి గ్యాస్ సిలిండర్‌ను ఈ నెల 29 నుంచి వచ్చే ఏడాది మార్చి 31లోపు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. 2వ సిలిండర్ ఏప్రిల్ 1-జులై 30, 3వ సిలిండర్ ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకూ బుక్ చేసుకోవచ్చంది.

News October 25, 2024

ఓటీటీలోకి వచ్చేసిన ‘స్వాగ్’

image

శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్వాగ్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

News October 25, 2024

ఢిల్లీ వాయు కాలుష్యంపై సీజేఐ ఆందోళన.. మార్నింగ్ వాక్‌కు గుడ్‌బై!

image

ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా తాను మార్నింగ్ వాక్‌కు వెళ్లడం మానేసినట్లు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. గాలి నాణ్యత క్షీణించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ సూచన మేరకు మార్నింగ్ వాక్‌కు వెళ్లట్లేదని, దీని వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 283గా నమోదైంది. కాలుష్యం పెరగడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోందని స్థానికులు చెబుతున్నారు.

News October 25, 2024

బెడిసికొట్టిన ప్లాన్.. భారత్ ఆలౌట్

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ వేసిన ‘స్పిన్’ ప్లాన్ బెడిసికొడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు కివీస్ స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్నారు. శాంట్నర్(7), ఫిలిప్స్(2) ధాటికి కుదేలైన భారత్ 156 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 103 పరుగులు వెనుకబడి ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్పిన్ పిచ్‌లో భారత్ తరఫున సుందర్(7), అశ్విన్(3) వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

News October 25, 2024

సీఎం రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నా: కిషన్ రెడ్డి

image

TG: మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం ఉండాలని సీఎం రేవంత్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. HYD ధర్నా చౌక్ వద్ద BJP చేపట్టిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ‘పేదల కోసం మూసీ పరీవాహకంలో ఉండటానికైనా మేము సిద్ధం. ఇళ్లను కూల్చాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. ఇక్కడ ఉండలేకపోతున్నామని పేదలు ఎవరైనా చెప్పారా? వారి బాధలు సీఎంకు తెలుసా?’ అని వ్యాఖ్యానించారు.