news

News October 22, 2024

అదనపు కలెక్టర్‌కు రూ.5కోట్ల అక్రమ ఆస్తులు.. కేసు నమోదు

image

TG: రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు చేయగా, రూ.5కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఆయన రూ.8లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే.

News October 22, 2024

సెబీ చీఫ్‌కు పార్లమెంటు PAC క్లీన్‌చిట్!

image

ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌లపై ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సెబీ చీఫ్ మాధబీ పురీకి పార్ల‌మెంటు PAC క్లీన్‌చిట్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అదానీ షెల్ కంపెనీల్లో మాధ‌బీకి వాటాలున్నాయని, ఆమె ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారంటూ హిండెన్‌బ‌ర్గ్‌, కాంగ్రెస్ ఆరోపించాయి. దీనిపై విచార‌ణ జ‌రిపిన PAC మాధ‌బీ అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ‌లేద‌ని తేల్చినట్టు సమాచారం. దీంతో ఆమె Feb, 2025 వ‌ర‌కు సెబీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా కొన‌సాగే అవకాశముంది.

News October 22, 2024

లెక్కలేనన్ని దుర్మార్గాలు చేసిన జగన్: మంత్రి గొట్టిపాటి

image

AP: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు. ఏ సీఎం చేయనన్ని దుర్మార్గాలు గత ఐదేళ్లలో జగన్ చేశారని విమర్శించారు. ఆయన చేసిన అరాచకాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనమైందని చెప్పారు. ఇప్పుడు వైసీపీ నేతలు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ చేసే కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

News October 22, 2024

క్షమాపణలు చెప్పేది లేదు: ఉదయనిధి స్టాలిన్

image

స‌నాత‌న ధ‌ర్మంపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌ విషయంలో క్ష‌మాప‌ణ‌లు చెప్పే ప్ర‌స‌క్తే లేద‌ని TN Dy.CM ఉద‌య‌నిధి స్టాలిన్ స్ప‌ష్టం చేశారు. మ‌హిళ‌ల అణచివేత విధానాల‌కు వ్య‌తిరేకంగా, ద్ర‌విడ నేత‌లు పెరియ‌ర్‌, అన్నాదురై, క‌రుణానిధి అభిప్రాయాల‌నే తాను వ్య‌క్తం చేశాన‌ని పేర్కొన్నారు. స‌నాత‌న ధ‌ర్మం ఎయిడ్స్ లాంటిద‌ని, దీన్ని వ్యతిరేకించడమే కాకుండా పూర్తిగా నిర్మూలించాల్సిందేనని గ‌తంలో వ్యాఖ్యానించారు.

News October 22, 2024

మంగళవారమే ఓటింగ్ ఎందుకు?

image

అమెరికాలో 170 సంవత్సరాలుగా నవంబర్‌లో మొదటి మంగళవారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1800లలో USలో ఎక్కువగా రైతులే ఉండేవారు. పంట కోతల తర్వాత చలికాలానికి ముందు ఎన్నికలు జరిపేందుకు నవంబర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఆదివారం ప్రయాణాన్ని ఇష్టపడనందున సోమవారం ప్రయాణించి, మంగళవారం ఓటేస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ప్రస్తుత ఉద్యోగ పరిస్థితుల దృష్ట్యా వీకెండ్స్‌లో ఓటింగ్ నిర్వహించాలంటున్నారు.

News October 22, 2024

గ్యాంగ్ రేప్ నిందితులతో టీడీపీకి సంబంధాలు: వైసీపీ

image

AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో విద్యార్థినులపై అత్యాచారం చేసిన నిందితులకు TDPతో సంబంధాలు ఉన్నాయని YCP ఆరోపించింది. నిందితుడు శివ బంధువు జానకీరావు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, మరో నిందితుడు మోహన్ వాళ్ల మామ ఎమ్మెల్యే గౌతు శిరీషకు అనుచరుడని తెలిపింది. దీంతో బాధితులకు నిందితులకు మధ్య రాజీకి ప్రయత్నాలు చేశారని పేర్కొంది. కూటమి నేతలు శాడిస్ట్‌లను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టింది.

News October 22, 2024

వాట్సాప్‌తో ప్రభుత్వం ఒప్పందం

image

AP: కాస్ట్ సహా ఇతర స‌ర్టిఫికెట్లు, పౌర‌సేవ‌లు వాట్సాప్‌లో పొందేలా మెటా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం MOU చేసుకుంది. కరెంట్, వాటర్, ఇంటి పన్ను, ఇతర బిల్లులు ఇకపై వాట్సాప్‌లోనే చెల్లించవచ్చు. న‌కిలీలు, ట్యాంప‌రింగ్ అవ‌కాశం లేకుండా పార‌ద‌ర్శ‌కంగా ఆన్‌లైన్‌లోనే స‌ర్టిఫికెట్లు ఇవ్వనుంది. మెటా నుంచి టెక్నిక‌ల్ స‌పోర్ట్, ఈ గ‌వ‌ర్నెన్స్, AI ద్వారా మ‌రిన్ని సిటిజెన్ స‌ర్వీసెస్ ఏపీ ప్ర‌భుత్వానికి అందించనుంది.

News October 22, 2024

రేవంత్‌ తిట్లను కేటీఆర్ తట్టుకోలేడు: జగ్గారెడ్డి

image

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌‌పై కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన దామగుండం రాడార్ స్టేషన్‌పై పిల్లచేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌ తిడితే కేటీఆర్ తట్టుకోలేరన్నారు. ఆయనకు కష్టమంటే తెలియదని చెప్పుకొచ్చారు. రేవంత్ కష్టపడి ఎదిగారని, ప్రజల బాధలు ఆయనకు తెలుసన్నారు. కేసీఆర్ సైతం ఎన్నో కష్టాలు ఎదుర్కొని పైకి వచ్చారని జగ్గారెడ్డి అన్నారు.

News October 22, 2024

బ్రోకలీ తింటే ఏమవుతుంది?

image

మార్కెట్లో బ్రోకలీ కనిపించినా రెగ్యులర్‌ వంటకం కాదని చాలామంది చూసీచూడనట్లు వెళ్లిపోతుంటారు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తరహాలోనే బ్రోకలీ కూడా క్రూసిఫరస్ ఆకుకూర. ఇందులో క్యాలీఫ్లవర్‌లో ఉన్న ‘క్యాన్సర్‌ను తగ్గించే’ లక్షణాలుంటాయి. బ్రోకలీ మొలకల్లో సల్ఫారఫేన్ ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్ కారకం. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న మహిళల్లో ఇది తీసుకున్నాక అసాధారణ మార్పు కన్పించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

News October 22, 2024

ఇకనైనా హెల్మెట్ ధరించండి బాస్!

image

రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులే అధికంగా మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 2023లో రోడ్డు ప్రమాదాల్లో 76వేల మంది బైకర్లే మరణించారు. ఇందులో 70శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు డేటా చెబుతోంది. ప్రస్తుతం హెల్మెట్స్, ABSలు ప్రమాదాలను నివారిస్తాయని రోడ్ సేఫ్టీ నిపుణులు సూచిస్తున్నారు. ఇకనైనా బైకర్లతో పాటు పిలియన్ రైడర్లు హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు.