News October 22, 2024
మంగళవారమే ఓటింగ్ ఎందుకు?
అమెరికాలో 170 సంవత్సరాలుగా నవంబర్‌లో మొదటి మంగళవారమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1800లలో USలో ఎక్కువగా రైతులే ఉండేవారు. పంట కోతల తర్వాత చలికాలానికి ముందు ఎన్నికలు జరిపేందుకు నవంబర్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఆదివారం ప్రయాణాన్ని ఇష్టపడనందున సోమవారం ప్రయాణించి, మంగళవారం ఓటేస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ, ప్రస్తుత ఉద్యోగ పరిస్థితుల దృష్ట్యా వీకెండ్స్‌లో ఓటింగ్ నిర్వహించాలంటున్నారు.
Similar News
News November 3, 2024
‘సదర్’కు రాష్ట్ర పండుగ హోదా
TG: రాష్ట్ర ప్రభుత్వం సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించింది. ఈ మేరకు ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జీవో జారీ చేసింది. HYD మినహా అన్ని జిల్లా కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఎంపీ అనిల్ కుమార్ విజ్ఞప్తితో అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయమై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
News November 3, 2024
విశాఖను లింక్ చేస్తూ ORR: చంద్రబాబు
AP: విశాఖ నగర అభివృద్ధిపై కలెక్టరేట్‌లో CM చంద్రబాబు రివ్యూ చేశారు. నగరంలో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం, నెల్లిమర్ల, భోగాపురం, అనకాపల్లి ప్రాంతాలను విశాఖకు అనుసంధానం చేస్తూ ORR నిర్మించేలా ప్లాన్ చేయాలని సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానించేలా రోడ్ల నిర్మాణం ఉండాలన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం 15% వృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
News November 3, 2024
జనవరిలో కొత్త రేషన్ కార్డులు!
AP: నూతన సంవత్సర కానుకగా JANలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కార్డులు ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న కార్డులను రీడిజైన్ చేసి.. పాత, కొత్త లబ్ధిదారులందరికీ సరికొత్త డిజైన్‌తో అందజేయనుంది. పౌరసరఫరాల అధికారులు కొత్త డిజైన్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులున్నాయి.