India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారత క్రికెటర్లలో అత్యంత ఫిట్ ప్లేయర్ తానేనని బుమ్రా అనడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇతర క్రికెటర్ల ఫ్యాన్స్ అతడిని ట్రోల్ చేశారు. ఈ విషయంపై భారత స్పిన్నర్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘బుమ్రా మన క్రికెట్‌లో కోహినూర్ వజ్రం. భారత జట్టు కిరీటంలో కలికితురాయి. తను అత్యంత విలువైన ఆటగాడు. అతడేమన్నా పర్వాలేదు. తన ఇష్టం. అవన్నీ మేం అంగీకరిస్తాం’ అని స్పష్టం చేశారు.

ఈ ఏడాది భారత్ నుంచి ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ అయిన ‘లాపతా లేడీస్’ టీమ్‌కు హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్యులేషన్స్ కిరణ్ రావు అండ్ టీమ్. కొత్త తరహా కథల్ని చెప్పాలన్న మీ నిబద్ధత ఆ సినిమాలో కనిపించింది. ఆస్కార్లలోనూ మీ సినిమా రాణించాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు. ‘లాపతా లేడీస్’ తన సినిమా హను-మాన్‌ను దాటి ఎంపికైనప్పటికీ ఆ మూవీ టీమ్‌కు ఆయన బెస్ట్ విషెస్ చెప్పడం విశేషం.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య ఘర్షణలు తీవ్రమవ్వడంతో భారత బలగాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. UN ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్ (UNIFIL) మిషన్‌లో భాగంగా 600 మంది భారత సైనికులు ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుల్లో మోహరించారు. శాంతి స్థాపనలో సహకరించడం, దాడులు తీవ్రం కాకుండా నివారించడం వీరి బాధ్యత. తాజా దాడుల నేపథ్యంలో పరిస్థితులను గమనిస్తున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

‘దేవర’ టికెట్ ధర పెంపునకు అనుమతిస్తూ జీఓ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘మా సినిమా కోసం జీఓ జారీ చేసిన గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు సినీ పరిశ్రమకు మీరు అందిస్తున్న ఎనలేని మద్దతుకు కృతజ్ఞులం’ అని ట్వీట్ చేశారు. ఈ నెల 27న దేవర మూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

✒ తేది: సెప్టెంబర్ 24, మంగళవారం
✒ సప్తమి: మధ్యాహ్నం 12.39 గంటలకు
✒ మృగశిర: రాత్రి 09.54 గంటలకు
✒ వర్జ్యం లేదు
✒ దుర్ముహూర్తం: ఉదయం 08.22 నుంచి 09.10 గంటల వరకు
2)రాత్రి: 10.47 నుంచి 11.35 గంటల వరకు

AP: అక్టోబర్ 1న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకోనున్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన విషయం వెలుగులోకి రావడంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న శ్రీవారిని దర్శించుకుని ఆయన దీక్షను విరమిస్తారు. 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను నిర్వహిస్తారు.

* AP: వరద నష్ట పరిహారంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
* శ్రీవారి విషయంలో తప్పుగా వ్యవహరించినవారికి పుట్టగతులుండవు: మంత్రి అనిత
* లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు: టీటీడీ
* TG: ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తెచ్చే యోచనలో రేవంత్ సర్కారు
* రాష్ట్రంలో గూండా రాజ్యం: హరీశ్ రావు
* 3 రోజుల్లో పంట నష్టపరిహారం: మంత్రి పొంగులేటి
* హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడి.. 272 మంది మృతి

కార్తీ తాజా సినిమా ‘సత్యం సుందరం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన సోదరుడు హీరో సూర్య రివ్యూవర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాను సినిమాలా చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. ‘సినిమాను సెలబ్రేట్ చేసుకుందాం. ఇన్వాల్వ్ అయి చూస్తేనే కథ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్, ఎమోషన్స్, హాస్యం ఇలా ప్రతిదాన్నీ ఆస్వాదించగలం. తప్పులు వెతికేందుకో లేక బాక్సాఫీస్ కలెక్షన్ల దృష్టితో చూస్తే సినిమాను ఎంజాయ్ చేయలేం’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.