India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

US ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడ్డారు. సెన్సెక్స్ రోజంతా 82,866 – 83,153 మధ్య కన్సాలిడేట్ అవుతూ చివరికి 90 పాయింట్ల లాభంతో 83,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 25,418 వద్ద నిలిచింది. హీరో మోటార్స్, బజాజ్ ఆటో, Airtel టాప్ గెయినర్స్. టాటా మోటార్స్, ఐచర్, టాటా స్టీల్, కోల్ ఇండియా, JSW Steel టాప్ లూజర్స్.

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న మహిళా న్యాయవాదులకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని లాయర్ కపిల్ సిబల్ తెలిపారు. ఈ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమ మహిళా లాయర్లపై యాసిడ్ పోస్తామని, రేప్ చేస్తామని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో వారి భద్రతకు చర్యలు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.

కోల్‌కతాకు నూతన పోలీస్ కమిషనర్‌గా మనోజ్ వర్మను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన నేపథ్యంలో కమిషనర్‌ను మార్చాలని వైద్యులు డిమాండ్ చేశారు. దీంతో వినీత్ గోయల్ స్థానంలో మమత సర్కార్ ఆయనను నియమించింది.

ఊటీలోని ఎప్పనాడు, బిక్కనాడు కొండ ప్రాంతాల్లో 12 ఏళ్లకు ఓసారి పూసే నీలకురింజి పూలు వికసించాయి. ఈ సుందర దృశ్యాలు పర్యాటకులను మైమరిపిస్తున్నాయి. వీటి శాస్త్రీయ నామం ‘స్ట్రోబిలాంతెస్ కుంతియానా’. కొండ ప్రాంతాల్లో 1300-2400 మీటర్ల ఎత్తులో ఈ పూల మొక్కలు పెరుగుతుంటాయి. మొక్క 30- 60 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. ఊదా నీలం రంగులో ఉండే ఈ పూల కారణంగానే నీలగిరి పర్వత శ్రేణులకు ఆ పేరు వచ్చింది.

కులమతాలకు అతీతంగా సాగే వినాయక చవితి ఉత్సవాల్లో ఓ ముస్లిం కుటుంబం వేలంలో లడ్డూ గెలుచుకుంది. సదరు కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ అభినందించారు. ‘వినాయక చవితి అంటేనే గంగా జమునా తహజీబ్. ఆసిఫాబాద్‌లోని భట్‌పల్లిలో గణేష్ లడ్డూ గెలుచుకున్న ఆసిఫ్ భాయ్‌కి కంగ్రాట్స్. శాంతియుత, సామరస్యపూర్వక తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రార్థించండి. అసలైన తెలంగాణ సంస్కృతి ఇదే’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసే మహిళలను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాత్రి పనివేళల నుంచి మహిళా డాక్టర్లకు విముక్తి కల్పించవచ్చనే బెంగాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మహిళలకు మినహాయింపులు అవసరం లేదని, వారికి సమాన అవకాశాలు కల్పించాని సీజే బెంచ్ అభిప్రాయపడింది. మహిళా వైద్యులకు పురుషులతో సమానంగా పని చేసేందుకు అనుమతించాలని ఆదేశించింది.

AP: తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా నూతన మద్యం పాలసీ రూపొందించామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. లిక్కర్ పాలసీపై క్యాబినెట్ సబ్‌కమిటీ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడారు. ‘గత ప్రభుత్వం మద్యం రేట్లు పెంచడంతో చాలామంది గంజాయికి ఎడిక్ట్ అయ్యారు. నాసిరకం మందుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు’ అని కొల్లు మండిపడ్డారు. కొత్తగా ప్రీమియం ఔట్‌లెట్స్ ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల వెల్లడించారు.

బ్రిటిష్ పాలకులకు, కాంగ్రెస్‌కు మధ్య పోలికలున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘మన దేశ స్వాతంత్య్రంలో గణేశ్ ఉత్సవం ముఖ్యపాత్ర పోషించింది. విభజించి పాలించే బ్రిటిష్ వారు అప్పట్లో గణేశ్ ఉత్సవాలపై మండిపడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో గణేశ్ విగ్రహాన్ని కటకటాల వెనుక ఉంచారు. ఇది బాధించింది. ఇలాంటివి జరగనివ్వకూడదు’ అని అన్నారు.

కెనరా రొబెకో కన్జూమర్ ట్రెండ్స్ ఫండ్ ఇన్వెస్టర్ల ఇంట సిరులు కురిపించింది. ఏటా 18.64% రిటర్న్ ఇచ్చింది. 2009, సెప్టెంబర్లో మొదలైన ఈ ఫండ్‌లో ప్రతి నెలా రూ.10వేలు సిప్ చేసిన వారికి ఇప్పుడు రూ.84.81 లక్షలు చేతికందాయి. అంటే 15 ఏళ్లలో విడతల వారీగా పెట్టిన రూ.18 లక్షలకు రూ.66.81 లక్షల లాభం వచ్చిందన్నమాట. పదేళ్ల క్రితం ఒకేసారి రూ.12 లక్షలు పెట్టుంటే రూ.34.52 లక్షలు అందేవి. కాంపౌండింగ్ పవర్ అంటే ఇదే.

AP: ప్రభుత్వ స్కూళ్లలో ‘CBSE రద్దు’ ప్రచారంపై TDP స్పందించింది. ‘CBSE విధానం, అసెస్మెంట్‌కు విద్యార్థులు, టీచర్లను సిద్ధం చేయకుండానే జగన్ 1000 స్కూళ్లలో CBSE ఎగ్జామ్స్ మొదలెట్టాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక CBSE అసెస్మెంట్ ప్రకారం పరీక్షలు పెడితే, 64%మంది ఫెయిలయ్యారు. అందుకే ఈ ఏడాది స్టేట్ బోర్డు పరీక్షలు రాసే వెసులుబాటును ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆరో తరగతి నుంచే CBSE ఉంటుంది’ అని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.