News September 17, 2024
మహిళలు రాత్రి వేళల్లో పనిచేయకుండా అడ్డుకోలేం: సుప్రీంకోర్టు
నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసే మహిళలను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాత్రి పనివేళల నుంచి మహిళా డాక్టర్లకు విముక్తి కల్పించవచ్చనే బెంగాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. మహిళలకు మినహాయింపులు అవసరం లేదని, వారికి సమాన అవకాశాలు కల్పించాని సీజే బెంచ్ అభిప్రాయపడింది. మహిళా వైద్యులకు పురుషులతో సమానంగా పని చేసేందుకు అనుమతించాలని ఆదేశించింది.
Similar News
News October 14, 2024
కాల్పులకు సిద్ధంగా ఉండాలని ఆర్మీకి నార్త్ కొరియా ఆదేశాలు
దక్షిణ కొరియా తమ దేశంలోకి డ్రోన్లను పంపిస్తోందని ఆరోపిస్తూ తమ సైన్యాన్ని నార్త్ కొరియా సమాయత్తం చేసింది. అనుమానాస్పదంగా ఏ వస్తువు కనిపించినా వెంటనే కాల్చేయాలని స్పష్టం చేసింది. తమ అధినేత కిమ్‌ను విమర్శించే పార్సిళ్లను దక్షిణ కొరియా పంపుతోందని ప్యాంగ్యాంగ్ ఆరోపిస్తోంది. అయితే, ఆ ఆరోపణల్ని సియోల్ కొట్టిపారేస్తోంది. వాటిని తాము పంపడం లేదని తేల్చిచెబుతోంది.
News October 14, 2024
J&Kలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా J&K ముఖ్యమంత్రిగా ఈ నెల 16న ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్-ఎన్సీ కూటమి నాయకుడిగా అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
News October 14, 2024
అల్పపీడన ప్రభావంతో భారీ వర్షం
APలో అల్పపీడన ప్రభావం మొదలైంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, తూ.గో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరుకు NDRF బృందం చేరుకుంది. తిరుపతిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం <<14350584>>ఏర్పడనుందని<<>> అమరావతి వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.