India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రశాంత్‌వర్మ తెరకెక్కించనున్న ‘జై హనుమాన్’లో హీరోగా కన్నడ స్టార్ హీరో రిషబ్‌శెట్టి నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ డైరెక్షన్‌లో తేజా సజ్జ హీరోగా వచ్చిన ‘హనుమాన్’ పెద్ద హిట్టయిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే దానికి కొనసాగింపుగా తెరకెక్కించనున్న ‘జై హనుమాన్’లో ఎవరు లీడ్ రోల్ పోషిస్తారనే ఆసక్తి నెలకొంది. రిషబ్‌శెట్టి ‘కాంతార’తో తెలుగులోనూ పాపులర్ అయ్యారు. ఈ ఎంపికపై మీ కామెంట్?

ఎంతో కష్టమైన NEETలో వృద్ధులు ఉత్తీర్ణులై సత్తా చాటుతున్నారు. వైద్యులు కావాలన్న తమ కలను సాకారం చేసుకుంటున్నారు. SBI రిటైర్డ్ ఉద్యోగి NEETలో సీటు పొందగా.. MHRTCలోని రిటైర్డ్ జూ.అసిస్టెంట్(64 ఏళ్లు) రాజేంద్ర భావ్‌సర్ కూడా వైద్య విద్య కోర్సులో చేరారు. తన పేరు ముందు డా. ఉండాలనే కోరికను నెరవేర్చుకోనున్నారు. NEET UG పరీక్ష రాయగా MBBS/BDS సీటు వచ్చింది. కానీ, స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీలో చేరారు.

న్యూజిలాండ్‌తో టెస్టులో తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిచ్‌ను తానే తప్పుగా అంచనా వేసినట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు. పిచ్ ఫ్లాట్‌గా ఉంటుందని భావించానని, సరిగా అర్థం చేసుకోలేకపోయానన్నారు. మరోవైపు రాహుల్ స్థానాన్ని పదే పదే మార్చడం ఇష్టం లేకనే కోహ్లీని ఫస్ట్ డౌన్‌లో పంపినట్లు పేర్కొన్నారు. జట్టులో ప్లేయర్లు సామర్థ్యానికి తగినట్లుగా ఆడలేకపోయారన్నారు.

బ్యాంకులను బట్టి పరిహారం వేరుగా ఉంటుంది. దొంగతనం, తడిచి పాడవడం, షాట్ సర్క్యూట్ వంటి కారణాలతో లాకర్లోనివి దెబ్బతిన్నా, పోయినా పూర్తి నష్టం భర్తీ కాదు. కొన్ని బ్యాంకులు అద్దెకు 100 రెట్ల వరకు క్లెయిమ్ ఇస్తాయి. ఇంకొన్ని బ్యాంకులు లాకర్లలో కస్టమర్లు ఏం ఉంచుతారో చూడము కాబట్టి ఏ పరిహారం ఇవ్వమంటున్నాయి. అందుకే లాకర్ తీసుకునే ముందే ఈ రూల్స్ తెలుసుకోవాలి. లాకర్లో డబ్బు ఉంచరాదు కాబట్టి నోట్లు పోతే ఇక అంతే.

TG: రాష్ట్ర రాజకీయాలు బూతులమయంగా మారుతున్నాయి. ఈరోజు మూసీ పునరుజ్జీవన ప్రజెంటేషన్ ఇస్తూ సీఎం రేవంత్.. కేటీఆర్‌ను వెదవ అని సంబోధించారు. మరోవైపు తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితులతో సమావేశమైన KTR.. రేవంత్‌ను ‘ఓ హౌలే సీఎం’ అని తీవ్ర పదజాలం వాడారు. మేస్త్రీ ఇళ్లు కడితే ‘వీడు కూల్చివేస్తాడు’ అని హాట్ కామెంట్స్ చేశారు. వీళ్ల వ్యాఖ్యలపై మీ కామెంట్?

TG: దామగుండం రాడార్ స్టేషన్‌పై KTR అనవసర రాద్ధాంతం చేస్తున్నారని CM రేవంత్ మండిపడ్డారు. ‘111 జీవో కింద గండిపేట వద్ద ఫాంహౌస్ కట్టుకున్న బుద్ధిలేని ఎదవ నీతులు చెబుతున్నారు. దేశ రక్షణ విషయంలో కొన్నిసార్లు రాజీపడాలి. మొన్న రాజ్‌నాథ్ సింగ్ వచ్చినప్పుడు నిరసన తెలపాల్సింది. ఆయన కారు కింద పడుకోకపోయినవ్? ఎవరు వద్దన్నారు? నిన్ను ఎవరైనా హౌస్ అరెస్ట్ చేశారా? లేదు కదా?’ అని ప్రశ్నించారు.

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నారాయణపేట, గద్వాల, నాగర్ కర్నూల్, MBNR, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, వరంగల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.

తన సినిమా ఎమర్జెన్సీకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందని నటి కంగనా రనౌత్ వెల్లడించారు. సర్టిఫికేట్ రావడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు. అభిమానులు సహనంతో ఉండి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇందులో ఇందిరా గాంధీని, ఒక వర్గం ప్రజలను తప్పుగా చూపించారంటూ అభ్యంతరాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.

2003లో రిలీజైన ‘దేవదాస్’ సినిమా షారుఖ్ ఖాన్ కెరీర్లో ఓ లాండ్ మార్క్ మూవీగా నిలిచింది. అయితే ఆ సినిమాలో తాను నటించాలనుకోలేదని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ‘నా కెరీర్లో అప్పటి వరకు భారీతనంతో కూడిన సినిమా లేదు. స్వర్గంలో ఉన్న నా తల్లిదండ్రులు నన్ను చూస్తుంటారని నా నమ్మకం. వారు పైనుంచి నన్ను చూసి గర్వపడేలా చేయాలనుకున్నాను. అందుకే సన్నిహితులు వద్దన్నా ఆ సినిమా ఒప్పుకొన్నాను’ అని వివరించారు.

అస్సాంలోని డిమా హసావో జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అగర్తల-ముంబై మధ్య నడిచే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్(12520) పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు సా.4 గంటలకు డిమా హసావో జిల్లాలోని దిబ్లాంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రైలు ఇంజిన్, నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు సమాచారం. ప్రాణనష్టం జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.