News October 17, 2024

నువ్వో వెదవ.. నువ్వు హౌలే: రేవంత్VsKTR

image

TG: రాష్ట్ర రాజకీయాలు బూతులమయంగా మారుతున్నాయి. ఈరోజు మూసీ పునరుజ్జీవన ప్రజెంటేషన్‌ ఇస్తూ సీఎం రేవంత్.. కేటీఆర్‌ను వెదవ అని సంబోధించారు. మరోవైపు తెలంగాణ భవన్‌లో హైడ్రా బాధితులతో సమావేశమైన KTR.. రేవంత్‌ను ‘ఓ హౌలే సీఎం’ అని తీవ్ర పదజాలం వాడారు. మేస్త్రీ ఇళ్లు కడితే ‘వీడు కూల్చివేస్తాడు’ అని హాట్ కామెంట్స్ చేశారు. వీళ్ల వ్యాఖ్యలపై మీ కామెంట్?

Similar News

News November 11, 2024

వయనాడ్‌‌లో మైకులు బంద్.. 13న ఉపఎన్నిక

image

వ‌య‌నాడ్ లోక్‌స‌భ స్థానానికి జ‌రుగుతున్న ఉపఎన్నిక‌లో పార్టీల ప్ర‌చార ప‌ర్వానికి నేటి సాయంత్రంతో తెర‌ప‌డింది. బుధ‌వారం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. చివ‌రి రోజు UDF అభ్యర్థి, సోద‌రి ప్రియాంక‌తో క‌లిసి రాహుల్ గాంధీ సుల్తాన్ బ‌తెరిలో ప్రచారం చేశారు. వయనాడ్‌ను ఉత్తమ పర్యాటక ప్రాంతంగా నిలిపేందుకు ప్రియాంకకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. అటు LDF నుంచి స‌త్యం మోకెరి, NDA నుంచి న‌వ్య హ‌రిదాస్ బ‌రిలో ఉన్నారు.

News November 11, 2024

చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ

image

AP: CM చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మరో 20 హోటళ్లను ఏర్పాటు చేసేందుకు చంద్రశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. రూ.40వేల కోట్లతో టాటాపవర్ సోలార్, విండ్ ప్రాజెక్టులు, విశాఖలో TCS ద్వారా 10వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. భేటీలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.

News November 11, 2024

ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పెంపు

image

AP: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించే గడువు తేదీని పొడిగించారు. మార్చిలో ఫస్ట్, సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 21వరకు ఎటువంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. రూ.1,000 ఫైన్‌తో డిసెంబర్ 5 వరకు ఫీజు కట్టొచ్చన్నారు. తొలుత అక్టోబరు 21 నుంచి నవంబర్ 11 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. మరోసారి గడువు పెంచే ఆస్కారం లేదని అధికారులు స్పష్టం చేశారు.