news

News October 22, 2024

టెస్టు క్రికెట్‌: డౌన్ ట్రెండ్‌లో భారత బ్యాటింగ్!

image

బలమైన బ్యాటింగ్‌ లైనప్‌కు కేరాఫ్‌గా పేరున్న టీమ్ ఇండియా క్రమంగా బలహీనమవుతూ వస్తోంది. 2020 నుంచి సొంతగడ్డపై టెస్టుల్లో యావరేజ్ రన్స్ పర్ వికెట్ తగ్గిపోతూ వస్తోంది. 2015-19లో తొలి ఇన్నింగ్స్‌ సగటు 48.57 ఉంటే ఇప్పుడు 32.62కి పడిపోయింది. 2వ ఇన్నింగ్స్‌లో 53.93 నుంచి 36.58 రన్స్‌కి తగ్గింది. అటు మన పిచ్‌లపై విదేశీ బ్యాటర్ల రన్‌రేట్ పెరుగుతూ వస్తోంది. NZతో టెస్టులో భారత్ 46 పరుగులకే ఆలౌట్ అయింది.

News October 22, 2024

ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 22, 2024

BRICS శత్రు కూటమేమీ కాదు: అమెరికా

image

సంయుక్త లక్ష్యాలను సాధించేందుకు అనేక దేశాలతో US కలిసి పనిచేస్తుందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరిన్ జీన్ పియరీ అన్నారు. BRICSను తాము జియో పొలిటికల్ రైవల్‌గా చూడటం లేదని పేర్కొన్నారు. భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. PM మోదీ సైతం ‘బ్రిక్స్ యాంటీ వెస్ట్రన్ కూటమి కాదు, నాన్ వెస్ట్రన్ కూటమి మాత్రమే’ అని అభిప్రాయపడటం తెలిసిందే. G7తో పోలిస్తే BRICS బలంగా మారింది.

News October 22, 2024

కేజీబీవీలకు రూ.24 కోట్లు రిలీజ్

image

AP: కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) అదనపు గదులు, లేబొరేటరీలు ఇతర సివిల్ పనుల కోసం సమగ్ర శిక్ష రూ.24.84 కోట్లు మంజూరు చేసింది. వీటిలో రూ.20.61 కోట్లు నిర్మాణాలకు, రూ.4.23 కోట్లు రిపేర్ల కోసం ఖర్చు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. అన్ని పనులను మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించింది.

News October 22, 2024

వినేశ్, బజరంగ్ స్వార్థంతో ఉద్యమానికి చెడ్డ పేరు: సాక్షి మాలిక్

image

రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా బ్రిజ్‌భూష‌ణ్‌ను తొలగించాలంటూ చేసిన ఉద్యమంలో తన సహచర రెజర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాపై రెజ్లర్ సాక్షి మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పు. అది మా నిరసనకు చెడ్డ పేరు తెచ్చింది. కొందరు వారిద్దరిలో స్వార్థం నింపి సొంత ప్రయోజనాల కోసం ఆలోచించేలా చేయగలిగారు’ అని తన పుస్తకం విట్‌నెస్‌లో వెల్లడించారు.

News October 22, 2024

మా సెల్ఫ్ డిఫెన్స్ హక్కును భారత్ సమర్థించింది: ఇజ్రాయెల్

image

భారత్‌తో తమది సుదీర్ఘ మిత్రబంధమని ఇజ్రాయెల్ అంబాసిడర్ రూవెన్ అజర్ అన్నారు. వెస్ట్ ఏషియాలో ఎకనామికల్‌గా, పొలిటికల్‌గా ఢిల్లీ చాలా చేయగలదని పేర్కొన్నారు. ‘భారత్ మా సెల్ప్ డిఫెన్స్ హక్కును సమర్థించింది. వాళ్లు చాలా సమర్థులు. OCT 7న మాపై భీకర దాడి జరిగింది. సామాన్యులు చనిపోయారు. హమాస్‌ను దాదాపుగా తుడిచిపెట్టేశాం. గాజా, లెబనాన్‌లో కొంత పని మిగిలే ఉంది. మా ప్రజలు స్వేచ్ఛగా బతికేలా చేస్తాం’ అని అన్నారు.

News October 22, 2024

నాలుగో పెళ్లి చేసుకున్న పాప్ సింగర్.. ట్విస్ట్ ఏంటంటే?

image

మూడు సార్లు పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఈ సారి తనను తానే పెళ్లి చేసుకున్నట్లు ట్విస్ట్ ఇచ్చారు. సోలోగా హనీమూన్‌కు వెళ్లానని ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను చేసిన తెలివైన పని ఇదేనని రాసుకొచ్చారు. 42 ఏళ్ల ఈ పాప్ సింగర్ ఈ ఏడాది మేలో సామ్ అస్గారి నుంచి విడాకులు తీసుకున్నారు.

News October 22, 2024

గుడ్‌న్యూస్.. రాత్రి వేళల్లో పాలిటెక్నిక్ చదివేందుకు అవకాశం

image

AP: ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లో పని చేస్తున్న వారు రాత్రి పూట చదువుకునేలా 6 పాలిటెక్నిక్ కాలేజీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మామూలు రోజుల్లో రాత్రి 6-9 గంటల వరకు, ఆదివారాల్లో పూర్తిగా క్లాసులు నిర్వహిస్తారు. విశాఖలో 3, చిత్తూరులో 2, రాజమహేంద్రవరంలో ఒక కాలేజీలో 429 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సెలక్ట్ చేసుకున్న కాలేజీల్లోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

News October 22, 2024

రోగులకు ఇబ్బంది కలిగించొద్దు: మంత్రి

image

TG: ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బంది కలిగిస్తే వైద్య సిబ్బందిపై చర్యలుంటాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. HYDలోని ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆఫీసులో ఆయన ఉన్నతాధికారులతో సమావేశమై బోధనాసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రుల్లో ఏవైనా సమస్యలుంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య పథకం పటిష్ఠంగా అమలు చేస్తామన్నారు.

News October 22, 2024

సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ షురూ

image

ఏపీలో సాగునీటి సంఘాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 28.22 లక్షల ఆయకట్టును పర్యవేక్షించేందుకు గాను 6,149 సాగునీటి సంఘాలకు, 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులు ఆయా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. వారు సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. NOV 20న నోటిఫికేషన్ జారీ చేసి 27 నాటికి ప్రక్రియ ముగిస్తారు.