News October 22, 2024
గుడ్‌న్యూస్.. రాత్రి వేళల్లో పాలిటెక్నిక్ చదివేందుకు అవకాశం
AP: ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లో పని చేస్తున్న వారు రాత్రి పూట చదువుకునేలా 6 పాలిటెక్నిక్ కాలేజీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మామూలు రోజుల్లో రాత్రి 6-9 గంటల వరకు, ఆదివారాల్లో పూర్తిగా క్లాసులు నిర్వహిస్తారు. విశాఖలో 3, చిత్తూరులో 2, రాజమహేంద్రవరంలో ఒక కాలేజీలో 429 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సెలక్ట్ చేసుకున్న కాలేజీల్లోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
Similar News
News November 5, 2024
ట్రంప్ గెలిస్తే నిజంగానే ‘పెద్ద’న్న అవుతారు!
అమెరికా ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అధిక వయస్కుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలువనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ వయసు 81 ఏళ్లు. నాలుగేళ్ల క్రితం ఆయన ప్రమాణస్వీకారం చేసిన నాటి వయసుతో పోల్చితే ట్రంప్ వయసు ఐదు నెలలు అధికం. ఈ లెక్కన ట్రంప్ గెలిస్తే అధ్యక్షుడిగా ప్రమాణం చేసే పెద్ద వయస్కుడిగా (78 ఏళ్ల నాలుగు నెలలు) చరిత్ర సృష్టిస్తారు.
News November 5, 2024
తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్: రాహుల్
TG: తెలంగాణలో చేసే కులగణన ప్రక్రియ దేశానికి రోల్ మోడల్ అవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. దేశంలో కుల వివక్ష ఉందని, అది అగ్రకులాలకు ఎప్పుడూ కనిపించదని తెలిపారు. ఇదే విషయం తాను చెబితే దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తారని వ్యాఖ్యానించారు. అందులో నిజాన్ని పరిశీలించాలని, వాస్తవాలను అన్వేషిస్తూ ముందుకు వెళ్లాలని రాహుల్ కోరారు.
News November 5, 2024
రాజకీయాలకు గుడ్ బై చెప్పే యోచనలో శరద్ పవార్!
రాజకీయాలకు స్వస్తి పలకాలని శరద్ పవార్ (83) యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బారామతి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘రాజ్యసభ MPగా ఏడాదిన్నర పదవీకాలం మిగిలింది. ఇప్పటివరకు పోటీ చేసిన 14 ఎన్నికల్లో ప్రతిసారీ నన్ను గెలిపించారు. ఇక ఎక్కడో ఒకచోట ఆపేయాలి. రాబోయే 30 ఏళ్లపాటు పనిచేసే కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. మంచి చేయడానికి రాజకీయాలు అవసరం లేదన్నారు.