news

News November 3, 2024

మా సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు: YCP

image

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్ అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని ఆ పార్టీ ఆరోపించింది. ఇవాళ వినుకొండ, గుడివాడ, భీమవరం, ఉదయగిరి, నెల్లూరు, పెనుగొండ, నందిగామ తదితర ప్రాంతాల్లో కొందరిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించకూడదంటూ లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని దుయ్యబట్టింది. ఈ అక్రమ అరెస్టులను చట్టపరంగా ఎదుర్కొంటామని Xలో పేర్కొంది.

News November 3, 2024

అనకాపల్లిలో భారీ స్టీల్ ప్లాంట్.. విశేషాలివే!

image

AP: ➫అనకాపల్లి(D) నక్కపల్లిలో మొదటి దశలో రూ.80 వేల కోట్ల పెట్టుబడితో మిట్టల్ <<14521702>>స్టీల్ ప్లాంట్<<>> నిర్మాణం. ఏడాదిలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి.
➫రెండో దశలో రూ.60 వేల కోట్ల పెట్టుబడి. 10.5 మి. మెట్రిక్ టన్నులకు ఉత్పత్తి పెంపు
➫పరిశ్రమ కోసం సుమారు 4600 ఎకరాలు కేటాయింపు
➫25 వేల మందికి ప్రత్యక్షంగా, 60 వేల మందికి పరోక్షంగా ఉపాధి
➫ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి ముడి ఖనిజాన్ని పైపులైన్లతో తరలించే అవకాశం.

News November 3, 2024

ఈనెల 8న యాదాద్రికి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 8న యాదాద్రి గుట్టకు వెళ్లనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. సీఎం అయ్యాక ఆయన జరుపుకుంటున్న మొదటి జన్మదినం ఇదే. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక నేతలు, అధికారులు ఇవాళ పరిశీలించారు.

News November 3, 2024

ఆఫీసులో పనిచేస్తేనే మానసిక ఆరోగ్యం: సర్వే

image

వ‌ర్క్‌ఫ్రం హోం కంటే ఆఫీసులకు వెళ్లి ప‌ని చేస్తున్న భార‌తీయులు మెరుగైన మాన‌సిక ఆరోగ్యాన్ని అనుభూతి చెందుతున్న‌ట్టు సేపియన్స్ ల్యాబ్స్ అనే సంస్థ చేసిన అధ్య‌య‌నంలో తేలింది. ఈ సంస్థ 65 దేశాల్లోని 54,000 మంది ఉద్యోగులపై స‌ర్వే చేసింది. మెరుగైన మాన‌సిక ఆరోగ్యానికి ఆఫీసుల్లో పాజిటివ్ రిలేష‌న్స్ ఓ కార‌ణమని తెలిపింది. ప్ర‌తికూల బంధాలు, వృత్తిపై ఆస‌క్తిలేక‌పోవ‌డం నిస్స‌హాయ‌త‌కు గురిచేస్తాయని పేర్కొంది.

News November 3, 2024

ఫారిన్ ఇన్వెస్టర్లు ₹94 వేల కోట్లు వెన‌క్కి తీసుకున్నారు.. కార‌ణం ఇదే!

image

దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్ట‌ర్లు అక్టోబ‌ర్‌లో ₹94,000 కోట్ల పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకున్నారు. ముందెన్న‌డూ ఒక నెల‌లో ఈ స్థాయి డిజిన్వెస్ట్‌మెంట్ జ‌ర‌గ‌లేదు. ఈక్విటీ మార్కెట్లను ఓవ‌ర్ వ్యాల్యూగా ప‌రిగ‌ణించ‌డం, చైనా మార్కెట్ల ఆక‌ర్ష‌ణీయ వ‌డ్డీ రేట్లే దీనికి కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా FIIలు జాగ్రత్తపడుతున్నారు!

News November 3, 2024

ఆ ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయలేదు: HMDA

image

TG: హెచ్‌ఎండీఏ పరిధిలోని గ్రామపంచాయతీల్లో అనధికార లేఅవుట్లలో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిషేధించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ ఖండించింది. దీనికి సంబంధించి గత ఏడాది కాలంగా తాము రిజిస్ట్రేషన్&స్టాంపుల శాఖకు ఎలాంటి అభ్యర్థనను పంపలేదని తెలిపింది. పంచాయతీల్లో అనధికారిక లేఅవుట్‌ల ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది.

News November 3, 2024

కాబోయే జంటకు ఎన్టీఆర్ విషెస్

image

తన బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం ఫొటోలను Jr.NTR ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘నితిన్-శివాని మీకు కంగ్రాట్స్. జీవితాంతం మీరిద్దరూ సుఖసంతోషాలతో కలిసుండాలి’ అంటూ విషెస్ తెలియజేశారు. నూతన వధూవరులతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటోను పంచుకున్నారు. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ఫొటోలను ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

News November 3, 2024

RC16 షూటింగ్ ఎప్పటి నుంచంటే?

image

‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. మైసూరులో షూటింగ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

News November 3, 2024

ALERT.. రేపు వర్షాలు

image

APలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ పలుచోట్ల వర్షాలు పడ్డాయి.

News November 3, 2024

ఝార్ఖండ్‌లో మహిళల ఓట్లే ల‌క్ష్యం

image

ఝార్ఖండ్‌లో గెలుపు కోసం JMM, BJP కూట‌ములు మ‌హిళా ఓటర్ల‌ను ఆక‌ట్టుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. రాష్ట్రంలోని 81 నియోజ‌క‌వ‌ర్గాల్లో 32 స్థానాల్లో మ‌హిళా ఓటర్లే ఎక్కువ‌గా ఉన్నారు. వీరి మెప్పు పొందేందుకు JMM ప్ర‌భుత్వం ఇప్ప‌టికే మహిళల ఖాతాల్లో నెలకు రూ.1000 సాయం ఇస్తోంది. మరోవైపు ప్ర‌తి నెల మ‌హిళ‌ల‌కు రూ.2,100 ఆర్థిక సాయం ఇస్తామ‌ని బీజేపీ హామీ ఇచ్చింది. మ‌రి మ‌హిళ‌ల ఓటు ఎట‌న్న‌ది తేలాల్సి ఉంది.