News November 3, 2024
RC16 షూటింగ్ ఎప్పటి నుంచంటే?
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. మైసూరులో షూటింగ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Similar News
News December 8, 2024
అలాగైతే క్షమాపణలు చెబుతాం: సీఎం రేవంత్
TG: దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అయినా రూ.21వేల కోట్ల రుణమాఫీ జరిగిందా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. ఒకవేళ జరిగినట్లు నిరూపిస్తే తామంతా వచ్చి క్షమాపణలు చెబుతామని ప్రధాని మోదీ, కేసీఆర్‌లకు సవాల్ విసిరారు. దేశంలో BJP ఎక్కడైనా రుణమాఫీ చేసిందా అని ప్రశ్నించారు. ఫార్మాసిటీ కడతామంటే, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటే అడ్డుపడుతున్నాయని, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని సీఎం నిలదీశారు.
News December 8, 2024
ఎక్కువ వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు తెలుసా?
కొన్ని ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడితే అధిక వడ్డీ రేటుతో దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్ని స్కీములు..
➤ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్: 8.2%
➤ సుకన్య సమృద్ధి యోజన : 8%- 8.2%
➤ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: 7.7%
➤ కిసాన్ వికాస్ పాత్ర: 7.5%
➤ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్: 7.4%
➤ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్: 7.1%
News December 8, 2024
బుమ్రాకు గాయమైందా?
అడిలైడ్‌లో జరుగుతున్న BGT రెండో టెస్టులో బౌలింగ్ చేస్తూ టీమ్ఇండియా బౌలర్ బుమ్రా ఇబ్బంది పడ్డారు. 81వ ఓవర్ వేస్తున్న సమయంలో గ్రౌండ్‌లో కిందపడగా, ఫిజియో వచ్చి చికిత్స అందించారు. బుమ్రాకు గాయమైందనే ఆందోళన నేపథ్యంలో బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ క్లారిటీ ఇచ్చారు. గాయం కాలేదని కేవలం కాళ్లు తిమ్మిరెక్కాయన్నారు. రెండో ఇన్సింగ్స్‌లో 128/5 వద్ద ఉన్న భారత్ గెలవాలంటే బుమ్రా మరోసారి చెలరేగాల్సిన అవసరం ఉంది.