India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగే టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక అవసరాలు కలిగిన(మెంటల్ బిహేవియర్, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ) విద్యార్థులకు పాస్ మార్కులను 10(గతంలో 35)గా నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఉత్తర్వులిచ్చారు. అన్ని సబ్జెక్టుల్లోనూ 10 మార్కులు వస్తే చాలని పేర్కొన్నారు.

దావూద్ ఇబ్రహీంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత నవాబ్ మాలిక్ NCP(అజిత్ పవార్) తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే మాలిక్‌కు తాము మద్దతు ఇవ్వట్లేదని BJP నేతలు తెలిపారు. దావూద్‌తో సంబంధాలు ఉన్నవారికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కూటమి పార్టీలు తమకు నచ్చిన నేతను ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు. సిట్టింగ్ స్థానాన్ని వదిలేసిన మాలిక్ మన్ఖుర్డ్-శివాజీ నగర్ నుంచి బరిలో ఉన్నారు.

యూరప్ దేశాలకు రిఫైన్డ్ ఫ్యూయెల్ అత్యధికంగా సప్లై చేస్తున్న దేశంగా భారత్ నిలిచింది. ఈ క్రమంలో భారత్.. సౌదీ అరేబియా, రష్యాను అధిగమించింది. యూరప్ ఆంక్షలు విధించడంతో రష్యా ఆయిల్ ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో మన దేశం రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేసి, ఆయిల్ కంపెనీల్లో శుద్ధి చేస్తుంది. ప్రస్తుతం రోజుకు 3.60 లక్షల రిఫైన్డ్ ఆయిల్ బ్యారెళ్లను యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుస్తోంది.

TG: ప్రభుత్వం విధుల నుంచి డిస్మిస్ చేసిన 10 మంది ప్రత్యేక పోలీసులు, సస్పెండ్ చేసిన 37 మందిని విధుల్లోని తీసుకోవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. సమస్యలను వెల్లడించేందుకు వారు రోడ్డెక్కినట్లు పేర్కొన్నారు. వలసకాలపు ధోరణులను తొలగించి, సమస్యను పరిష్కరించాలన్నారు. అలా చేయకుండా వారిని అణచివేస్తే భవిష్యత్తులోనూ అసంతృప్తి కొనసాగే అవకాశముందన్నారు.

రోజూ ఉదయాన్నే 15-30 నిమిషాల ప్రాణాయామంతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందుగా సుఖాసనం/వజ్రాసనంలో నిటారుగా కూర్చోవాలి. కుడి ముక్కు రంధ్రాన్ని నొక్కిపట్టి ఎడమ రంధ్రం ద్వారా దీర్ఘ శ్వాసను తీసుకోవాలి. తర్వాత ఎడమ ముక్కు రంధ్రాన్ని నొక్కి కుడి రంధ్రం ద్వారా గాలిని వదలాలి. ఇలా రెండువైపులా చేయాలి. దీనివల్ల ఒత్తిడి, హైబీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగై గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

AP: రద్దీగా ఉండే రైలు జనరల్ బోగీల్లో ఎక్కాలంటే ప్రయాణికులు యుద్ధం చేయాల్సిందే. తోపులాటలు, వాగ్వాదాలు, ఘర్షణలు సర్వసాధారణం. వీటికి చెక్ పెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. ప్రయాణికులు ప్రశాంతంగా రైలు ఎక్కేలా రైల్వే స్టేషన్లలో జనరల్ బోగీలు ఆగేచోట ప్లాట్‌ఫామ్‌లపై క్యూలు ఏర్పాటు చేస్తోంది. తొలుత విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్న మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. నవంబర్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. తొలుత యంగ్ టైగర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. వార్-2 షూటింగ్ ముగిసిన తర్వాత జనవరి లాస్ట్ వీక్‌లో నీల్ ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి.

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకుగాను కేంద్రం అనుమతిచ్చిన రూ.47,000 కోట్ల రుణ పరిమితి సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. దీంతో కొత్తగా అక్టోబర్-డిసెంబర్ మధ్య మరో రూ.7,000 కోట్ల అప్పునకు ఓకే చెప్పింది. ఇది అడ్వాన్స్ మాత్రమేనని, మిగిలింది ఇంకా ఖరారు చేయాల్సి ఉందని పేర్కొంది. కాగా ఈ FYలో సెక్యూరిటీల వేలం ద్వారా ప్రభుత్వం రూ.50,000 కోట్ల అప్పు చేసింది.

TG: వచ్చే నెల 6 నుంచి మొదలయ్యే కులగణనకు టీచర్లను వినియోగించుకోవాలని కలెక్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. స్కూల్ ముగిసిన తర్వాత ఒక్కో ఉపాధ్యాయుడు రోజూ 5-7 ఇళ్లలో వివరాలు సేకరించాలన్నారు. ఇందులో పాల్గొనే ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు మంచి వేతనం ఇస్తామని చెప్పారు. ప్రజలను అడగాల్సిన 50 ప్రశ్నలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.

అఫ్గానిస్థాన్‌లో మహిళల చదువు, ప్రయాణాలు, బహిరంగంగా మాట్లాడటంపై నిషేధం విధించిన తాలిబన్లు తాజాగా మరో క్రూర నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థనా వేళల్లో ఒక స్త్రీ గొంతు మరో మహిళకు వినిపించకూడదని, బిగ్గరగా ప్రేయర్ చేయకూడదని మంత్రి మహ్మద్ ఖలీద్ హనాఫీ ఆంక్షలు విధించారు. వారు పాటలు కూడా పాడకూడదని స్పష్టం చేశారు. ఈ ఆంక్షలపై మానవ హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.