News October 30, 2024

అఫ్గాన్‌లో మహిళలు బిగ్గరగా ప్రేయర్ చేసినా నేరమే

image

అఫ్గానిస్థాన్‌లో మహిళల చదువు, ప్రయాణాలు, బహిరంగంగా మాట్లాడటంపై నిషేధం విధించిన తాలిబన్లు తాజాగా మరో క్రూర నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థనా వేళల్లో ఒక స్త్రీ గొంతు మరో మహిళకు వినిపించకూడదని, బిగ్గరగా ప్రేయర్ చేయకూడదని మంత్రి మహ్మద్ ఖలీద్ హనాఫీ ఆంక్షలు విధించారు. వారు పాటలు కూడా పాడకూడదని స్పష్టం చేశారు. ఈ ఆంక్షలపై మానవ హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 6, 2024

రేపు అనుష్క మూవీ అప్డేట్స్

image

హీరోయిన్ అనుష్క సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కమర్షియల్ కాకుండా కథకు ప్రాధాన్యమున్న చిత్రాలకే ఆమె ఓటు వేస్తున్నారు. ఆమె ప్రధానపాత్రలో క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటి’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనుష్క పుట్టినరోజు సందర్భంగా రేపు ఉ.9.45 గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సా.4.05 గంటలకు గ్లింప్స్ రిలీజ్ చేస్తామని పేర్కొంది.

News November 6, 2024

ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీగా పాక్ ప్లేయర్

image

పాకిస్థాన్ ఆటగాడు నోమన్ అలీ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీగా ఎంపికయ్యారు. అతడితోపాటు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్‌ను కూడా నామినీలుగా ఐసీసీ ఎంపిక చేసింది. కాగా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో నోమన్ అలీ విశేషంగా రాణించారు. మొత్తం 20 వికెట్లు పడగొట్టి మూడేళ్ల తర్వాత సొంతగడ్డపై తన జట్టుకు సిరీస్ విజయాన్ని అందించారు.

News November 6, 2024

రేపు ఈ జిల్లాలో వర్షాలు

image

AP: రాష్ట్రంలో రేపు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశమున్నట్లు APSDMA తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కృష్ణా, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.