India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉద్యోగంలో ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటుండటం ఆందోళనకరం. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను తొలగించి మిమ్మల్ని మానసికంగా దృఢంగా మార్చేందుకు కేంద్రం ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తోంది. దీనికోసం టోల్ ఫ్రీ నంబర్ 1800-599-0019కు కాల్ చేయాలి. ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం, సానుకూల ధోరణిని పెంచడం వంటి మానసిక ఆరోగ్య సేవలను ఈ హెల్ప్‌లైన్ అందిస్తుంది. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. >>SHARE IT

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖలో కేంద్రాలు సిద్ధం చేసి నిపుణులతో తరగతులు చెప్పించనుంది. ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఎంట్రన్స్ నిర్వహించి, అందులో ప్రతిభ చూపినవారిని ట్రైనింగ్‌కు ఎంపిక చేయనుంది. ఇందుకోసం నారాయణ కాలేజీల సహకారం తీసుకోనున్నట్లు సమాచారం.

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలపై నిన్న సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ విచారణను కొనసాగించాలా? లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా? అనే దానిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని కోరింది. సిట్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది కాబట్టి నివేదిక సైతం దానికి అనుకూలంగానే వస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

TG: కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు హాట్ కామెంట్స్ చేశారు. RRR ప్రాజెక్టు నుంచి BRS MLA హరీశ్ భూములను తప్పించారని ఆరోపించారు. రెండు రోజుల్లో తాను హరీశ్‌రావు భూములను సందర్శిస్తానన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు.

కరుణ కుమార్ డైరెక్షన్‌లో వరుణ్ తేజ్ నటిస్తోన్న ‘మట్కా’ మూవీని నవంబర్ 14న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మెగా ప్రిన్స్ రెట్రో స్టైలిష్ లుక్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 1958-1982 మధ్య జరిగే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తుండగా, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. రేపు గాంధీ జయంతి కాగా, ఈ నెల 13 వరకు ఏపీలో సెలవులు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 14 వరకు సెలవులు ప్రకటించింది. దీంతో HYD, ఇతర పట్టణాల నుంచి సొంతూళ్లకు పిల్లలతో కలిసి పేరెంట్స్ పయనమవుతున్నారు. కాగా ప్రైవేటు యాజమాన్యాలు సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

AP: రాష్ట్రంలోని పట్టా భూములు, డీకేటీ భూముల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ఉత్తర్వులు ఇచ్చారు. భూయజమానులు నిబంధనల మేరకు ఇసుక విక్రయాలు చేసుకోవచ్చు. కాగా గ్రామ, వార్డు సచివాలయాలతోపాటు వ్యక్తిగతంగా ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ <<14145449>>ప్రక్రియ<<>> మొదలైన విషయం తెలిసిందే.

క్రూడాయిల్ ధరల పతనంతో HPCL, BPCL, IOL వంటి OMCలు లాభాల పంట పండిస్తున్నాయి. లీటర్ పెట్రోలుపై రూ.15, డీజిల్‌పై రూ.12 వరకు ప్రాఫిట్స్ పొందుతున్నాయని ICRA తెలిపింది. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించి కస్టమర్లపై భారం తగ్గించే స్థాయిలో ఇవి ఉన్నాయని వెల్లడించింది. OMCలకు FY24 అద్భుతంగా ఉందని, గత FYతో పోలిస్తే మొత్తం లాభం 25 రెట్లు పెరిగి రూ.86,000 కోట్లకు చేరుకుందని పెట్రోలియం మినిస్ట్రీ సైతం పేర్కొంది.

AP: తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరగడం వాస్తవమని మంత్రి డీబీవీ స్వామి స్పష్టం చేశారు. ఈ ఘటనపై సిట్‌ను ఏర్పాటుచేశామని, ఇందులో ఎవరి ప్రమేయమున్నా వదిలేది లేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేసినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తామని తెలిపారు. దీపావళి నుంచి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ప్రతి నెలా 1న పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరుగుతోందని పేర్కొన్నారు.

తెలంగాణ బీజేపీ నేతలు ‘రైతు హామీల సాధన దీక్ష’ను విరమించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలంటూ హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద దీక్ష చేపట్టిన నేతలకు బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ నిమ్మరసం ఇచ్చారు. ప్రకటించిన గ్యారంటీలను సీఎం రేవంత్ అమలు చేయలేకపోయారని విమర్శించారు.
Sorry, no posts matched your criteria.