News October 1, 2024
రేపటి నుంచి స్కూళ్లకు సెలవు
తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. రేపు గాంధీ జయంతి కాగా, ఈ నెల 13 వరకు ఏపీలో సెలవులు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 14 వరకు సెలవులు ప్రకటించింది. దీంతో HYD, ఇతర పట్టణాల నుంచి సొంతూళ్లకు పిల్లలతో కలిసి పేరెంట్స్ పయనమవుతున్నారు. కాగా ప్రైవేటు యాజమాన్యాలు సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Similar News
News October 4, 2024
26 జిల్లాల్లో నార్కోటిక్ కంట్రోల్ సెల్స్: హోంమంత్రి
AP: ప్రతి జిల్లాలో ఒక ‘నార్కోటిక్ కంట్రోల్ సెల్’ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉప సంఘం నిన్న సచివాలయంలో సమావేశమైంది. ‘స్టేట్ టాస్క్ ఫోర్స్’ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను పెంచి యువత డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు చేపడతామని హోంమంత్రి తెలిపారు. ఫిర్యాదుల కోసం 1908 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
News October 4, 2024
ప్రజా నాయకులు ఇలా బారికేడ్ల మధ్యలో ఉంటారా?: వైసీపీ
AP: Dy.CM పవన్ తిరుపతి సభపై YCP విమర్శలు చేసింది. ‘ప్రజా నాయకులు ఇలా బారికేడ్ల మధ్యలో అందరికీ దూరంగా ఉంటారా? వరదల టైమ్‌లో బయటకు రాని ఈయన కొత్తగా మత రాగం ఎత్తుకున్నాడు. అసెంబ్లీలో కులమతాలకు అతీతంగా ప్రమాణం చేసి ఇప్పుడు కొత్తగా సనాతన ధర్మం డిక్లరేషన్ ఏమిటి? ప్రచారం కోసం మొన్నటిదాకా తిరుపతి లడ్డూను అవమానించారు. ఇప్పుడు రాజకీయం కోసం మత ధర్మాన్ని బారికేడ్ల మధ్యలోకి తెచ్చారు’ అని ట్వీట్ చేసింది.
News October 4, 2024
మంత్రి అలా మాట్లాడటం సిగ్గుచేటు: అశ్విని వైష్ణవ్
మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ మహిళా వ్యతిరేక ఆలోచనను సూచిస్తున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ‘ఒక మంత్రి ఇలా సినీ ప్రముఖుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. ఫిల్మ్ ఇండస్ట్రీని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుందనే దానికి ఇదే నిదర్శనం. దీనిపై రాహుల్ గాంధీ, పార్టీ అధిష్ఠానం మౌనంగా ఉండటం చూస్తుంటే వారు ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్లు అర్థం అవుతోంది’ అని ట్వీట్ చేశారు.