news

News October 15, 2024

ఎగ్జిట్ పోల్స్‌కు శాస్త్రీయత లేదు: రాజీవ్ కుమార్

image

ఎగ్జిట్ పోల్స్‌పై సీఈసీ రాజీవ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్‌కు శాస్త్రీయత లేదని, వాటి ఆధారంగా తమపై నిందలు వేయడం అర్థరహితమని అన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం 9.30 గంటలకంటే ముందు ఇచ్చే ఫలితాలు బోగస్ అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అంచనా మాత్రమేనని, వీటిలో ఈసీ ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. కాగా ఇటీవల వెలువడిన ఫలితాల్లో హరియాణా ఎగ్జిట్ పోల్స్ తారుమారైన సంగతి తెలిసిందే.

News October 15, 2024

RED ALERT: రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి 24 గంటల్లో వాయుగుండంగా మారనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనిప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలకు <>రెడ్ అలర్ట్,<<>> బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News October 15, 2024

కృష్ణ జింకల కోసం ప్రాణాలను సైతం పణంగా..!

image

బిష్ణోయ్ తెగ ప్రజలు కృష్ణ జింక‌ల్ని వారి ఆధ్యాత్మిక గురువు జంభేశ్వరుని పునర్జన్మగా భావిస్తుంటారు. 15వ శతాబ్దంలో 29 సూత్రాలతో గురు జంభేశ్వర్ (జంబాజీ) బిష్ణోయ్ సంఘాన్ని స్థాపించారు. ఇందులో వన్యప్రాణులు, వృక్షసంపదను రక్షించాలని ఉంది. బిష్ణోయ్ తెగ వారు జింకలుగా పునర్జన్మ పొందుతారని నమ్ముతారు. ఈ జంతువులను రక్షించడానికి బిష్ణోయిలు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారని చరిత్రకారుడు వినయ్ పరిశోధనలో తేలింది.

News October 15, 2024

‘ఆమడ దూరం’ వెళ్లొస్తా.. అంటే ఎంత దూరం?

image

పూర్వీకులు ఆమడ దూరం అనే పదాన్ని ఎక్కువగా వాడేవారు. ఏదైనా ప్రాంతం ఎంత దూరంలో ఉందో చెప్పేందుకు ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అయితే, ఇలా చెప్పేవారికీ అది ఎంతదూరమో తెలియదనేది వాస్తవం. ఆంగ్లేయులు రాకముందు భారతీయులు కొలతల్లో ‘ఆమడ’ను వినియోగించేవారు. దీన్నే యోజనం అని కూడా పిలుస్తారు. అతి చిన్న కొలత అంగుళమైతే.. అతిపెద్దది ‘ఆమడ’. 8 మైళ్ల దూరాన్ని ఆమడ అంటారు. అంటే దాదాపు 13 కిలోమీటర్లని పెద్దలు చెప్తుంటారు.

News October 15, 2024

84 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం

image

సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవసీ పాలసీని ఉల్లంఘించిన 84.58 లక్షల ఖాతాలను వాట్సాప్ బ్యాన్ చేసింది. ఒక్క ఆగస్టులోనే ఈ సంఖ్యలో నిషేధం విధించినట్లు పేర్కొంది. వీటిలో అనుమానాస్పదంగా ఉన్న 16.61 లక్షల అకౌంట్లను ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ముందుగానే గుర్తించి జాగ్రత్త చర్యగా బ్యాన్ చేసినట్లు తెలిపింది. కాగా ఆగస్టులో వాట్సాప్ గ్రీవెన్స్‌కు 10,707 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించింది.

News October 15, 2024

‘దేవర’ విజయం: లేఖ రాసిన ఎన్టీఆర్

image

దేవర సినిమా విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ ఈరోజు ఓ లేఖ విడుదల చేశారు. ‘దేవర సినిమాకు నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మీరు అందిస్తున్న ఆదరణకు థాంక్స్. నా సహనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలు అందరికీ ధన్యవాదాలు. నెల రోజులుగా దేవరను ఓ పండుగలా జరుపుకొంటున్న నా ఫ్యాన్స్‌కు శిరసు వంచి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎప్పటికీ మీరు గర్వపడే సినిమాలే చేయడానికి ప్రయత్నిస్తాను’ అని పేర్కొన్నారు.

News October 15, 2024

WTC: కోహ్లీ రికార్డును రోహిత్ బ్రేక్ చేస్తారా?

image

WTC చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా కోహ్లీ పేరిట రికార్డు ఉంది. WTCలో ఆయన 22 టెస్టులకు కెప్టెన్సీ చేయగా 14 మ్యాచుల్లో గెలిచి, ఏడింట్లో ఓడారు. ఒకటి డ్రాగా ముగిసింది. రోహిత్ శర్మ ఇప్పటివరకూ 18 మ్యాచుల్లో కెప్టెన్‌గా ఉన్నారు. ఇందులో 12 విజయాలు, 4 అపజయాలు, రెండు డ్రా మ్యాచులు ఉన్నాయి. NZతో జరిగే 3 మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను 3-0తో గెలిస్తే కోహ్లీ రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేస్తారు.

News October 15, 2024

2019లో మహారాష్ట్రలో ఏం జరిగింది? (1/2)

image

2019 Octలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో BJP- అప్ప‌టి ఉద్ధ‌వ్ నేతృత్వంలోని శివ‌సేన కూట‌మి 161 స్థానాలు గెలుచుకుంది. BJP105, శివ‌సేన 56 సీట్లు ద‌క్కించుకున్నాయి. అయితే, ఫ‌లితాల త‌రువాత త‌మ‌కూ CM ప‌ద‌వి ఇవ్వాల‌ని శివ‌సేన మెలిక పెట్టింది. దీనికి BJP అంగీక‌రించ‌లేదు. దీంతో కాంగ్రెస్ (44), ఎన్సీపీ (54)ల మ‌ద్ద‌తుతో ఉద్ధ‌వ్ ఠాక్రే CM అయ్యారు. త‌ద్వారా మ‌హారాష్ట్రలో మ‌హావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్ప‌డింది.

News October 15, 2024

ఇవే మా డిజిటల్ పిల్లర్లు: ప్రధాని మోదీ

image

త‌క్కువ డివైజ్ కాస్ట్‌, డిజిటల్ క‌నెక్టివిటీ, డేటా వినియోగ వసతి, డిజిట‌ల్ ఫ‌స్ట్ త‌మ Digital India నాలుగు స్తంభాలని PM మోదీ పేర్కొన్నారు. World Telecommunication Standardization Assembly-2024 స‌ద‌స్సును ఆయ‌న ప్రారంభించారు. 120 కోట్ల మొబైల్ ఫోన్ల యూజ‌ర్ల‌లో 95 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నార‌ని పేర్కొన్నారు. టెలికాం, టెలికాం సంబంధిత సాంకేతిక వృద్ధిలో భార‌త్ వేగంగా ముందుకెళ్తోంద‌ని మోదీ అన్నారు.

News October 15, 2024

నాటకీయం ‘మహా’ రాజకీయం (2/2)

image

ఉద్ధ‌వ్ ప్ర‌భుత్వం Nov 28, 2019న ఏర్ప‌డింది. కాంగ్రెస్, NCPలు అధికారంలో భాగ‌స్వామ్యం అయ్యాయి. అయితే, జూన్ 29, 2022న‌, అంటే ఉద్ధ‌వ్ CM ప‌ద‌వి చేప‌ట్టిన 31 నెల‌ల‌కు BJP రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌కు శివ‌సేన, NCP చీలిపోయాయి. 40 మంది MLAల‌తో ఏక్‌నాథ్ శిండే వ‌ర్గం శివసేన పార్టీని క్లైం చేసుకొని BJP వెంట న‌డిచింది. దీంతో MVA కూట‌మి ప్ర‌భుత్వం కూలిపోయింది. BJP అండ‌తో ఏక‌నాథ్ శిండే CM ప‌ద‌వి దక్కించుకున్నారు.