News October 15, 2024
కృష్ణ జింకల కోసం ప్రాణాలను సైతం పణంగా..!
బిష్ణోయ్ తెగ ప్రజలు కృష్ణ జింకల్ని వారి ఆధ్యాత్మిక గురువు జంభేశ్వరుని పునర్జన్మగా భావిస్తుంటారు. 15వ శతాబ్దంలో 29 సూత్రాలతో గురు జంభేశ్వర్ (జంబాజీ) బిష్ణోయ్ సంఘాన్ని స్థాపించారు. ఇందులో వన్యప్రాణులు, వృక్షసంపదను రక్షించాలని ఉంది. బిష్ణోయ్ తెగ వారు జింకలుగా పునర్జన్మ పొందుతారని నమ్ముతారు. ఈ జంతువులను రక్షించడానికి బిష్ణోయిలు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారని చరిత్రకారుడు వినయ్ పరిశోధనలో తేలింది.
Similar News
News November 12, 2024
ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. అక్కడి నుంచి ఆయన రేపు ఉదయం మహారాష్ట్రకు వెళ్లి, పార్టీ కీలక సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణ తరహాలో ఆ రాష్ట్రంలోనూ ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేయాలని అఘాడీ రేవంత్‌ను కోరింది. దానిపై ఆయన అక్కడి నేతలకు వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
News November 12, 2024
రఘురామ పిటిషన్లపై విచారణ మరో ధర్మాసనానికి బదిలీ
YS జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసింది. జస్టిస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం విచారిస్తుందని తెలిపింది. మరోవైపు ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు తమకు మరింత సమయం కావాలని సీబీఐ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అక్రమాస్తుల కేసు విచారణను HYD నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని, జగన్ బెయిల్ రద్దు చేయాలని RRR వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
News November 12, 2024
చైనాలో అతి పెద్ద షాపింగ్ డే గురించి తెలుసా?
వాలంటైన్స్ డేకి పోటీగా చైనాలో 1993లో సింగిల్స్ డే వేడుకలు మొదలయ్యాయి. బ్యాచిలర్స్‌గా ఉన్నవారు ఈ రోజున భారీగా షాపింగ్ చేస్తుంటారు. మొదలైనప్పటి నుంచి ఏటేటా ఈ రోజుకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది అక్టోబరు 14న ప్రారంభమై నిన్న ముగిసిన వేడుకలు చైనా చరిత్రలో సుదీర్ఘ సింగిల్స్ డే వేడుకలుగా నిలిచాయి. గత ఏడాది 156.4 బిలియన్ డాలర్ల షాపింగ్ జరగగా, ఈసారి వ్యాపారం దాన్ని మించిపోతుందని అంచనా.