India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షల తేదీలను TGPSC ప్రకటించింది. నవంబర్ 17, 18 తేదీల్లో OMR విధానంలో పేపర్-1,2,3 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలకు వారం ముందు నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు పొందవచ్చని వెల్లడించింది. ఇప్పటికే శాంపిల్ OMR ఆన్సర్ షీటును వెబ్‌సైటులో అందుబాటులో ఉంచామంది.

AP: ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ)లో ప్రస్తుతం ఉన్న 3,257 చికిత్సలను 1,949కి తగ్గిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ‘ఆరోగ్యశ్రీపై విష ప్రచారం చేస్తున్నారు. ఈ పథకంలో ఎలాంటి మార్పులను ప్రభుత్వం చేయట్లేదు. చికిత్సలు తొలగించలేదు. మార్ఫింగ్ చేసిన ప్రకటనలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తప్పవు’ అని ట్వీట్ చేసింది.

తెలంగాణకు కేంద్రం మళ్లీ మొండిచేయి చూపిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘గోదావరి పుష్కరాల కోసం APకి రూ.100 కోట్లు ఇచ్చి, TGకి సున్నా ఇచ్చారు. 8 మంది BJP MPలు, ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ఒక్క రూపాయి సాధించలేదు. బడ్జెట్లోనూ TGకి 0 కేటాయించి, APకి ₹15,000 కోట్లు ఇచ్చారు. APకి ఇచ్చారని బాధ కాదు, తెలంగాణకు అన్యాయం జరుగుతోందనేదే మా ఆవేదన. TGని ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలి’ అని డిమాండ్ చేశారు.

అవినీతిపరులు, పనిచేయని అధికారులపై వేటు వేయాలని యూనియన్ సెక్రటరీలను PM మోదీ ఆదేశించారు. రూల్స్ ప్రకారం వారి పనితీరును మూల్యాంకనం చేయాలని సూచించారు. అంచనాలను అందుకోని వారికి CCS రూల్స్‌లోని ఫండమెంటల్ రూల్ 56(j), రూల్ (48) ప్రకారం రిటైర్మెంట్ ఇచ్చేయాలని బుధవారం ఆదేశించినట్టు తాజాగా తెలిసింది. వీరికి 3 నెలల నోటీస్ లేదా వేతనం ఇస్తారు. ఈ రూల్స్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వం 500 మందిని ఇంటికి పంపేసింది.

రతన్ టాటా మరణంతో టాటా ట్రస్టు ఛైర్మన్‌గా నోయల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బోర్డు సభ్యులు ఓ ప్రకటన చేశారు. ఈయన రతన్‌కు వరుసకు సోదరుడు అవుతారు. ఇప్పటికే టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీలకు ఛైర్మన్, టాటా స్టీల్, టైటాన్ సంస్థలకు వైస్‌ఛైర్మన్‌గా నోయల్ వ్యవహరిస్తున్నారు.

TG: GOVT స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ‘అమ్మ ఆదర్శ పథకం’ కింద ₹657 కోట్లు కేటాయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం(D) పొన్నెకల్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమది చేతల ప్రభుత్వమని చెప్పారు. విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

మంత్రి హత్యను చూసిన ఓ పాప ప్రాణాలను రక్షించేందుకు గోపీరెడ్డి అలియాస్ విశ్వం రంగంలోకి దిగుతాడు. అసలు ఈ విశ్వం ఎవరు, ఎందుకు పాపను రక్షిస్తున్నాడు అన్నది బ్యాలెన్స్ కథ. గోపీచంద్ తన పాత్రను అలవోకగా పోషించారు. నరేశ్, ప్రగతి, పృథ్వీరాజ్, వెన్నెల కిషోర్ కామెడీ ఫర్వాలేదు. సెకండాఫ్‌లో కథను హడావుడిగా చుట్టేయడమే మైనస్. శ్రీను వైట్ల గత 3 సినిమాలతో పోలిస్తే ‘విశ్వం’ బాగుందని చెప్పొచ్చు.
రేటింగ్: 2.25/5

AP: చట్టాన్ని ఉల్లంఘించిన వైసీపీ నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌లో పేరుందని వారు భయపడుతున్నారన్నారు. వరదలొచ్చినప్పుడు జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయటపెట్టలేదని, ఇప్పుడు వరద సాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కోచ్ గౌతమ్ గంభీర్ సలహా తన కాన్ఫిడెన్స్‌ను పెంచిందని టీమ్ఇండియా యంగ్ సెన్సేషన్ నితీశ్‌కుమార్ రెడ్డి (NKR) అన్నారు. బంగ్లాతో రెండో టీ20లో మెరుగైన ప్రదర్శనకు అదే కారణమని చెప్పారు. ‘నిజం చెప్పాలంటే నేను గౌతమ్ సర్‌కు థాంక్స్ చెప్పాలి. బౌలింగ్ చేస్తున్నప్పుడు బౌలర్‌లా ఆలోచించాలని, బౌలింగ్ చేయగలిగే బ్యాటర్‌గా కాదని ప్రతిసారీ చెప్తుంటారు’ అని అన్నారు. మ్యాచులో NKR 74 (34balls), 2 వికెట్లు సాధించారు.

ఆ తల్లి కుక్క ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దానికి పాలు తాగే నాలుగు పిల్లలున్నాయి. తమ తల్లి ప్రాణాలతో లేదన్న విషయం అన్నెం పున్నెం తెలియని ఆ పిల్లలకు తెలిసే దారేది? అప్పటి వరకూ ఆడుకుని అలసిపోయి వచ్చాయి. అమ్మ లేస్తుందని, పాలిస్తుందని చూశాయి. ఎంతసేపటికీ తల్లి లేవకపోవడంతో దీనంగా దాని చెంతనే నిద్రపోయాయి. కర్నూలు జిల్లా సి.బెళగల్ బస్టాండ్ ఆవరణలో చోటుచేసుకున్న ఈ సన్నివేశం చూపరులను కదిలించింది.
Sorry, no posts matched your criteria.