India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వరుస నష్టాలకు దేశీయ స్టాక్ మార్కెట్లు బ్రేక్ ఇచ్చాయి. మంగళవారం సెన్సెక్స్ 584 పాయింట్ల లాభంతో 81,634 వద్ద, నిఫ్టీ 217 పాయింట్ల లాభంతో 25,013 వద్ద స్థిరపడ్డాయి. ప్రారంభ సెషన్ నుంచి బెంచ్ మార్క్ సూచీలు Higher Highsతో కదిలాయి. సెన్సెక్స్‌లోని 19 షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీలో Trent, Bel, Adani Ent, Adani Ports, M&M టాప్ గెయినర్స్. Sbi Life, Tata Steel, Titan, Bajaj Finsv, Jsw Steel టాప్ లూజర్స్.

2024 ఏడాదికిగానూ ఫిజిక్స్‌లో ఇద్దరిని నోబెల్ వరించింది. అమెరికాకు చెందిన J. హాప్‌ఫీల్డ్ , బ్రిటిష్-కెనడియన్ జియోఫ్రీ E. హింటన్‌లకు స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. AIలో ఉపయోగపడే కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి మెషీన్ లెర్నింగ్‌కు ఆస్కారం కల్పించే ఆవిష్కరణలకు గుర్తింపుగా వీరిని పురస్కారం వరించింది.

జమ్మూ కశ్మీర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్టకేలకు బోణీ కొట్టింది. జమ్మూ రీజియన్‌లోని దొడ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,470 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పోలైన మొత్తం ఓట్లలో మాలిక్‌కు 22,944 ఓట్లు రాగా, రాణాకు 18,174 ఓట్లు వచ్చాయి. కాగా మాలిక్‌ను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు.

JKలో PDP పట్టుకోల్పోతోంది. 2014 ఎన్నికల్లో ముఫ్తీ మొహమ్మద్ సారథ్యంలో 28 సీట్లు గెలిచిన ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో 4 స్థానాలకు పరిమితమైంది. 2014లో ముక్కోణపు పోటీలో హంగ్ ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు BJPతో PDP చేతులుకలపడం ప్రజలకు రుచించినట్టు లేదు. JK ఓటర్లు ఆ పార్టీని తిరస్కరించారు. పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆమె కుమార్తె ఇల్తిజా ఓటమిపాలయ్యారు.

తమపై దాడులు చేస్తే ప్రతీకార దాడులు తప్పవని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే అణ్వాయుధాలు ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది. కాగా ఇటీవల 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌లోని అణు స్థావరాలు, చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిదే రైతులు, వ్యాపారస్థుల పాలిట శాపంగా మారింది. కర్ణాటకలోని ములుబాగల్‌కు చెందిన ఓ ట్రక్ డ్రైవర్ హైదరాబాద్‌లో టమాటాలు విక్రయించి తిరుగుపయనమయ్యాడు. కర్నూలు సమీపంలో టీ తాగేందుకు ట్రక్ ఆపగా ఓ దొంగల ముఠా టమాటా విక్రయించి వస్తున్న విషయం తెలుసుకుంది. 250 కి.మీ వెంబడించి సోమందేపల్లి వద్ద ట్రక్‌ను ఆపి రూ.5 లక్షలతోపాటు సెల్ ఫోన్ కూడా లాక్కెళ్లిపోయారు.

TG: హుస్సేన్ సాగర్, మూసీ పాపాలకు కాంగ్రెస్ కారణమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ‘చెరువులపై చర్చకు భట్టి విక్రమార్క సిద్ధమా? గూగుల్ మ్యాప్స్ మొదలైనప్పటి నుంచి చెరువుల పరిస్థితేంటో చూద్దాం. ప్రకటించిన లిస్ట్ ప్రకారం అక్రమ నిర్మాణాలు కూల్చే దమ్ముందా? కూల్చివేతలతో ఇప్పటికే ₹1000కోట్లకు పైగా ప్రజల ఆస్తులకు నష్టం జరిగింది. ₹వందల కోట్లు దోచుకోవాలనేదే కాంగ్రెస్ ఆలోచన’ అని ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు.

AP: వరదల సమయంలో ప్రజలను చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమని TDP నేత బుద్దా వెంకన్న అన్నారు. వరదలను అడ్డుపెట్టుకుని దోపిడీ చేశారంటూ YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. దమ్ముంటే ఈ అంశంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వరదలప్పుడు ఏసీ గదిలో కూర్చున్న జగన్ ఇప్పుడు పేదల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ప్రకటించిన రూ.కోటి సాయం ఎవరికి ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు.

ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్ పూర్తి అపోజిట్‌గా ఉండటంతో వాటిపై నమ్మకం పోతోందని నెటిజన్లు అంటున్నారు. సోషల్ మీడియాలో వాటిని విమర్శిస్తూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. కొద్ది తేడా ఉంటే ఫర్వాలేదు మరీ ఇంత ఘోరమేంటని ప్రశ్నిస్తున్నారు. వాటిలో సైంటిఫిక్ వాలిడేషన్, డేటా శాంపుల్ తీరును సందేహిస్తున్నారు. లోక్‌సభ ఫలితాల్లో బీజేపీకి 330+, హరియాణాలో 20+ వస్తాయన్న ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తలకిందులయ్యాయి.

2019 హరియాణా ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా నిలిచిన JJP ఈ ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపలేకపోయింది. దుశ్యంత్ చౌతాలా సారథ్యంలోని ఈ స్థానిక పార్టీ జాట్ వర్గాల అండతో గత ఎన్నికల్లో 14.80% ఓట్లతో 10 సీట్లు గెల్చుకొని BJP ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించింది. దుశ్యంత్‌ను DyCM పదవి వరించింది. అయితే ఈ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేదు. ఉచన కలన్‌లో దుశ్యంత్ 5వ స్థానానికి పరిమితమయ్యారు.
Sorry, no posts matched your criteria.