news

News October 3, 2024

నాగార్జున ఫ్యామిలీని అవమానించడంతో భరించలేకపోయా: ఆర్జీవీ

image

తనను ఎవరో అవమానించారని నాగార్జున ఫ్యామిలీని దారుణంగా అవమానించడం ఏంటని మంత్రి కొండా సురేఖను డైరెక్టర్ ఆర్జీవీ ప్రశ్నించారు. ‘సురేఖ కామెంట్లు విని నేను షాక్ అయ్యా. నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగడం ఏమాత్రం భరించలేకపోయా. 4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు మీడియాతో మాట్లాడటం దారుణం. సీఎం రేవంత్ ఈ విషయంలో స్పందించి చర్యలు తీసుకోవాలి’ అని ఆయన వరుస ట్వీట్లు చేశారు.

News October 3, 2024

వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు: చిరంజీవి

image

TG: సినీ రంగంలో పలువురిపై మంత్రి కొండా సురేఖ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి బాధపడ్డానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అసత్య ఆరోపణలు చేయడం దారుణం. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు. రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.

News October 3, 2024

సింగపూర్ మాజీ మంత్రి S ఈశ్వరన్‌కు జైలు శిక్ష

image

భారత మూలాలు ఉన్న సింగపూర్ మాజీ మంత్రి S ఈశ్వరన్‌కు ఆ దేశ న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. ఆయన రవాణాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 3 లక్షల డాలర్ల విలువైన బహుమతులను లంచంగా తీసుకున్నారని రుజువు కావడంతో జడ్జి ఈ తీర్పు వెల్లడించారు. ఈశ్వరన్ 13 ఏళ్ల పాటు సింగపూర్ మంత్రిగా పని చేశారు. సింగపూర్‌లో అవినీతిని తీవ్రంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఈశ్వరన్‌కు శిక్ష పడటం ఆ దేశంలో సంచలనంగా మారింది.

News October 3, 2024

విరాట్ కోహ్లీ మరో ఘనత

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత అందుకున్నారు. టెస్టులు, వన్డేల్లో 1000+ చొప్పున ఫోర్లు బాదిన ఎనిమిదో క్రికెటర్‌గా ఆయన రికార్డులకెక్కారు. ఇప్పటివరకు ఆయన టెస్టుల్లో 1,001, వన్డేల్లో 1,302 ఫోర్లు కొట్టారు. గతంలో సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర, రికీ పాంటింగ్, మహేల జయవర్ధనే, క్రిస్ గేల్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా ఈ ఫీట్ నమోదు చేశారు.

News October 3, 2024

ట్రైనీ వైద్యురాలి బాధను ప్రతిబింబించేలా విగ్రహావిష్కరణ

image

కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నివాళిగా జూనియర్ డాక్టర్లు RGకర్ ఆస్పత్రిలోని ప్రిన్సిపల్ ఆఫీసు వద్ద ఓ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఘటన సమయంలో ఆమె పడిన క్షోభ, బాధ, నొప్పిని ప్రతిబింబించేలా దీన్ని శిల్పి అసిత్ సైన్ రూపొందించారు. ఈ విగ్రహానికి ‘క్రై ఆఫ్ ది అవర్’గా నామకరణం చేశారు. అయితే విగ్రహావిష్కరణపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News October 3, 2024

సమంత ఫోన్ ట్యాప్ అయ్యిందా? స్పందించిన చిన్మయి

image

సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో సామ్ ఫోన్ ట్యాపింగ్ గురించి సింగర్ చిన్మయి స్పందించారు. ‘BRS హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై సమంత స్పందించాలి. ఆమె ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమా? కాదా?’ అని నెటిజన్ ప్రశ్నించగా ‘ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం సమంతకు లేదు. రాజకీయ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతారు’ అని సింగర్ బదులిచ్చారు.

News October 3, 2024

రూ.500 బోనస్‌పై నేడు విధివిధానాలు!

image

AP: ఈ సీజన్ నుంచి సన్నబియ్యం రకాలకు క్వింటాకు ₹500 బోనస్ చెల్లించే అంశంపై నేడో, రేపో విధివిధానాలను ప్రభుత్వం వెల్లడించనుంది. రైతులకు మద్దతు ధర(కామన్ రకానికి ₹2,300, గ్రేడ్-Aకు ₹2,320), బోనస్‌ను విడివిడిగా చెల్లించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సన్నాల దిగుబడి 88 లక్షల టన్నులు కాగా, కొనుగోలు కేంద్రాలకు 49 లక్షల టన్నులు వస్తాయని అంచనా. ₹500 చొప్పున చెల్లిస్తే ₹2,455 కోట్ల ఖర్చవుతుంది.

News October 3, 2024

ఆస్పత్రిలో చేరిన టీమ్ ఇండియా క్రికెటర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది. కాగా 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూనే నిన్న రెస్టాఫ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఆడారు. సర్ఫరాజ్ డబుల్ సెంచరీ చేసేందుకు శార్దూల్ (36 రన్స్) సహకారం అందించారు.

News October 3, 2024

లడ్డూ వివాదంపై నేడు సుప్రీం విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ను కొనసాగించాలా?లేదా స్వతంత్ర సంస్థను నియమించాలా? అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ తన అభిప్రాయాన్ని ధర్మాసనానికి చెప్పనున్నారు. దీన్నిబట్టి న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. గత విచారణలో సీఎం చంద్రబాబుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News October 3, 2024

హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా అల్లుడి హతం

image

హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసిర్ హతమైనట్లు ఐడీఎఫ్ తెలిపింది. సిరియా డమాస్కస్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ దాడి చేయగా మరొకరితోపాటు ఖాసిర్ కూడా మరణించారు. మరోవైపు తాజాగా లెబనాన్‌లోని దహియేపై ఇజ్రాయెల్ మూడు క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఆరుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.