News October 3, 2024
వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు: చిరంజీవి
TG: సినీ రంగంలో పలువురిపై మంత్రి కొండా సురేఖ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి బాధపడ్డానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘వార్తల్లో నిలిచేందుకు కొందరు సినీ ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అసత్య ఆరోపణలు చేయడం దారుణం. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని వారిని ఇందులోకి లాగొద్దు. రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News November 14, 2024
గడచిన 30 ఏళ్లలో రెండింతలైన మధుమేహం!
ప్రపంచాన్ని మధుమేహం వేగంగా కబళిస్తోంది. డయాబెటిస్‌తో బాధపడేవారి సంఖ్య గడచిన 30 ఏళ్లలో రెండింతలైంది. ది లాన్సెట్ జర్నల్ ఈ విషయాన్ని తెలిపింది. దాని ప్రకారం.. 1990లో ప్రపంచవ్యాప్తంగా 7శాతం పెద్దల్లో షుగర్ ఉండగా 2022 నాటికి అది 14శాతానికి పెరిగింది. అంకెల్లో చూస్తే వరల్డ్‌వైడ్‌గా 80 కోట్లమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు. భారత్‌లోనూ మధుమేహుల సంఖ్య వేగంగా పెరుగుతోందని లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేసింది.
News November 14, 2024
సచివాలయ ఉద్యోగులకు అలర్ట్
AP: రాష్ట్ర సచివాలయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ విధానం నవంబర్ 1నుంచి 30వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని, తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు.
News November 14, 2024
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు
AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కనుమూరు రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికైనట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారికంగా ప్రకటించారు. కాగా డిప్యూటీ స్పీకర్ పదవికి RRR తప్ప మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.