India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రూ.2లక్షలలోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ అన్నారు. రూ.2లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు, ఆ పై మొత్తాన్ని చెల్లిస్తే మాఫీ చేస్తామని తెలిపారు. రుణమాఫీ కాని రైతులు రోడ్లు ఎక్కడానికి బదులుగా ఆయా జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మితే ‘మన్నుపోసి అంబలి కాసిన’ పరిస్థితి వస్తుందని రేవంత్ అన్నారు.

TG: మూసీ నిర్వాసితులను ఏ విధంగా ఆదుకోవాలో సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. పేదలకు అన్యాయం చేయబోమని, రివర్ బెడ్, బఫర్ జోన్‌లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తామని స్పష్టం చేశారు. మూసీ విషయంలో రెచ్చగొట్టే వారి మాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు. పేదల మంచి కోసమే తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. పేదలకు న్యాయం చేసేందుకు BRS, BJPలు సూచనలు చేయాలని కోరారు.

TG: రేవంత్‌రెడ్డి CM కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అక్టోబర్ వచ్చినా మాఫీ చేయలేదన్నారు. రేవంత్ బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. సీఎం మనుషులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు.

TG: తనపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తొలిసారి స్పందించారు. ‘సురేఖ దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ఇప్పటికే పరువు నష్టం దావా వేశా. సీఎం రేవంత్‌పైనా వేస్తా’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సమంత విడాకులతో పాటు టాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్లు వెళ్లిపోవడానికి KTR కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే.

భారత్ మెన్స్, ఉమెన్స్ క్రికెట్ జట్లు రేపు(ఆదివారం) రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మహిళల T20WCలో భాగంగా దుబాయ్ వేదికగా మ.3.30కు ఇండియా-పాక్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఓడిన భారత్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. దీంతో పోరు హోరాహోరీగా ఉండనుంది. మరోవైపు గ్వాలియర్ స్టేడియంలో సూర్య సేన బంగ్లాదేశ్‌తో తొలి T20 ఆడనుంది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు BJP MP నవీన్ జిందాల్ గుర్రంపై పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఇది శుభమని నమ్మడమే కాక ప్రజల్లో ఓటుపై అవగాహన కల్పించేందుకే ఇలా చేసినట్లు ఆయన వివరించారు. ‘ప్రజల్లో చాలా చైతన్యం కనిపిస్తోంది. వారు బీజేపీకి ఓటేసి తమ దీవెనల్ని అందిస్తారని నమ్మకంతో ఉన్నాం. నయబ్ సింగ్ మళ్లీ CM అవుతారు’ అని పేర్కొన్నారు. ఆ రాష్ట్రంలో 90 స్థానాలకు ఈరోజు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది.

తాను 1994 నుంచే హింసను వదిలేశానని, ఇప్పుడు గాంధేయవాదినని ఉగ్రవాది, వేర్పాటువాది యాసిన్ మాలిక్ చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం(UAPA) ట్రిబ్యునల్‌కు తెలిపారు. శాంతియుత విధానాల్లోనే స్వతంత్ర, ఐక్య కశ్మీర్‌ను సాధించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. మాలిక్ ప్రస్తుతం తిహార్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. 1990లో భారత వాయుసేనకు చెందిన నలుగురు అధికారుల హత్యలో మాలిక్ ప్రధాన నిందితుడు.

మరికొన్ని రోజుల్లో ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సుచిన్‌షాన్-అట్లాస్ అనే తోకచుక్క భూమికి 44 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుందని నాసా వెల్లడించింది. 2023లో సూర్యుడికి అత్యంత సమీపంగా ప్రయాణించినప్పుడు దీన్ని తొలిసారి గుర్తించామని పేర్కొంది. ఈ నెల 9-10 తేదీల మధ్య స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని వివరించింది. ఈ తోకచుక్క భూమి సమీపానికి మళ్లీ వచ్చేది మరో 80వేల సంవత్సరాల తర్వాతే!

TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం HYD నార్సింగి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏదైనా ప్రాజెక్టుకు ఖరారైన కాంట్రాక్ట్‌కు మళ్లీ టెండర్లు పిలవడాన్ని రివర్స్ టెండరింగ్ అంటారు. మొదటిసారి పిలిచిన టెండర్లలో అవకతవకలు జరగడం లేదా ఆ పనిని మరింత చౌకగా చేయడానికి అవకాశం ఉందని తేలితే రివర్స్ టెండరింగ్‌కు పిలుస్తారు. జాతీయ స్థాయిలో NTPC, కోల్ ఇండియా, సోలార్ పవర్ కార్పొరేషన్ అమలు చేస్తున్న ఈ విధానాన్ని YCP ప్రభుత్వం తొలిసారి ఏపీలో తీసుకొచ్చింది. దాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది.
Sorry, no posts matched your criteria.