India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సెప్టెంబరులో తమ కార్ల అమ్మకాలు పెరిగాయని మారుతీ సుజుకీ ప్రకటించింది. మొత్తం 1,84,727 యూనిట్లు విక్రయించినట్లు తెలిపింది. గత ఏడాది సెప్టెంబరుతో పోలిస్తే ఇది 2శాతం ఎక్కువని పేర్కొంది. తాము అమ్ముతున్న ప్రతి మూడు కార్లలో ఒకటి సీఎన్‌జీ వేరియంట్ అని వివరించింది. తొలిసారిగా సీఎన్‌జీ అమ్మకాలు 50వేల మార్కు దాటినట్లు స్పష్టం చేసింది. మరోవైపు హ్యుందాయ్ 64,201 యూనిట్లు విక్రయించినట్లు ప్రకటించింది.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, జనగామ, గద్వాల్, కరీంనగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నల్గొండ, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ, భువనగిరి సహా మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయంది. అటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తోంది.

GST వసూళ్లు సెప్టెంబర్‌లో ₹1.73 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే నెలతో (₹1.63 లక్షల కోట్లు) పోలిస్తే 6.5% వృద్ధి నమోదైంది. అయితే, ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్లు ₹1.75 లక్షల కోట్లుగా ఉండగా, సెప్టెంబర్‌లో కలెక్షన్లు కొంతమేర తగ్గడం గమనార్హం. FY25 First-Halfలో GST వసూళ్లు రూ.10.87 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది FY24 First-Half కంటే 9.5 శాతం అధికం కావడం గమనార్హం.

గత నెలలో థియేటర్లలో రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకున్న ’35 చిన్న కథ కాదు మూవీ’ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ అర్ధరాత్రి నుంచి చిత్రం ‘ఆహా’లో అందుబాటులో ఉండనుంది. నందకిశోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియదర్శి, విశ్వదేవ్, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.

జమ్మూకశ్మీర్ చివరి విడత ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 65.48% పోలింగ్ నమోదైంది. జమ్మూలోని 24, కశ్మీర్‌లోని 16 స్థానాలు కలిపి మొత్తం 40 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా ఉధంపూర్ జిల్లాలో 72.91%, అత్యల్పంగా బారాముల్లాలో 55.73% పోలింగ్ జరిగింది. మొదటి దశలో 61.38%, రెండో దశలో 57.31% పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. అక్టోబర్ 8న కౌంటింగ్ జరగనుంది.

ఢిల్లీ EX CM అరవింద్ కేజ్రీవాల్, డేరా చీఫ్ గుర్మీత్ జైలు నుంచి విడుదల వెనుక BJP హస్తం వుందని రాబర్ట్ వాద్రా ఆరోపించారు. హరియాణా ఎన్నికల్లో BJPకి అనుకూలంగా ప్రచారం చేయడానికే గుర్మీత్‌ను 20 రోజులు పెరోల్‌పై విడుదల చేశారని, ఎన్నికల ప్రచారానికి వీలు కల్పించేలా కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కేలా చేశారని దుయ్యబట్టారు. తద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయవచ్చని BJP భావిస్తోందన్నారు.

* శ్రీలంకపై 2-0తో గెలుపు
* ఆస్ట్రేలియాపై 2-1తో విజయం
* వెస్టిండీస్‌పై 1-0తో గెలుపు
* సౌతాఫ్రికాతో 1-1తో సిరీస్ డ్రా
* ఇంగ్లండ్‌పై 4-1తో విజయం
* బంగ్లాదేశ్‌పై 2-0తో సిరీస్ విజయం

Paytm మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేరు ధర సోమవారం సెషన్‌లో 6.25% పెరిగి రూ.731కి చేరింది. డోలాట్ క్యాపిటల్ సంస్థ Paytmకు Buy రేటింగ్ ఇవ్వడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ప్రస్తుత స్టాక్ ధరను 30% పెంచి రూ.920 టార్గెట్ ప్రైస్‌గా నిర్ణయించింది. Paytm హ్యాండిల్ మైగ్రేషన్ పూర్తి సహా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌కు ఎఫ్‌డీఐ అనుమతి వంటివి సానుకూల కారణాలుగా చూపింది.

AP: బెంగళూరు నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో జగన్, సతీమణి భారతి రెడ్డిలకు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అక్కడి నుంచి వారు నేరుగా తాడేపల్లికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

సౌత్ కొరియాకు చెందిన మోడల్ చోయ్ సూన్ హ్వా(80) చరిత్ర సృష్టించారు. మిస్ యూనివర్స్ పోటీల్లో కొరియా తరఫున పాల్గొననున్న ఓల్డెస్ట్ మహిళగా నిలిచారు. నవంబర్‌లో మెక్సికో వేదికగా జరిగే ఈవెంట్‌లో వివిధ దేశాలకు చెందిన 31 మందితో ఆమె పోటీ పడనున్నారు. ‘80 ఏళ్ల మహిళ శరీరాన్ని ఎలా కాపాడుకుంది? ఇంత ఆరోగ్యంగా ఎలా ఉంది? తినే ఆహారమేంటి? అనే అంశాలపై నేను ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకుంటున్నా’ అని ఆమె చెప్పారు.
Sorry, no posts matched your criteria.