News October 10, 2024

ప్రేమకు దు:ఖమే మూల్యం: గుండెల్ని తడిమేస్తున్న టాటా యంగ్‌ఫ్రెండ్ సందేశం

image

రతన్‌ టాటా యంగ్ ఫ్రెండ్, అసిస్టెంట్ శంతనూ నాయుడి సోషల్ మీడియా పోస్ట్ గుండెల్ని తడిమేస్తోంది. ‘మా స్నేహబంధానికి లోటు ఏర్పడింది. దానిని పూడ్చుకుంటూ నేనిప్పుడు జీవితం గడపాలి. ప్రేమకు దు:ఖమే మూల్యం. గుడ్‌బై మై డియర్ లైట్‌ హౌస్’ అన్న పోస్ట్ వైరలైంది. వయసు రీత్యా 56 ఏళ్ల తేడా ఉన్న వీరిని జంతువులపై ప్రేమే కలిపింది. అర్ధరాత్రి వీధికుక్కల్ని కాపాడుతున్న శంతనూను 2014లో టాటా తన ఆఫీస్‌కు GMగా నియమించారు.

Similar News

News November 4, 2024

ఇవాళే టెట్ నోటిఫికేషన్

image

TG: ఇవాళ టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ ఏడాది మే, జూన్‌లో తొలి టెట్ నిర్వహించింది. ఇవాళ రెండో టెట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వనుండగా జనవరిలో పరీక్షలు జరపనుంది. మేలో నిర్వహించిన టెట్‌లో 1.09 లక్షల మంది క్వాలిఫై అయ్యారు. ఇటీవల డీఎస్సీ కూడా పూర్తి కావడంతో ఈసారి పరీక్ష రాసే వారి సంఖ్య స్వల్పంగా తగ్గొచ్చని అధికారులు భావిస్తున్నారు.

News November 4, 2024

రేపటి నుంచి వరల్డ్ ట్రావెల్ మార్కెట్.. నేడు లండన్‌కు మంత్రి జూపల్లి

image

TG: ఈనెల 5 నుంచి 7 వరకు జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో పాల్గొనేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ లండన్‌కు వెళ్లనున్నారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన UK పర్యటన సాగనుంది. ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ చరిత్ర, వారసత్వ సంపద తెలిసేలా పర్యాటక శాఖ అక్కడ ఓ స్టాల్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ట్రావెల్ మార్ట్‌లో 100కు పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు.

News November 4, 2024

ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్‌.. నలుగురు యువకులు మృతి

image

AP: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాడిపర్రులో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మృతులను వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉండ్రాజవరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.