India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చైనాతో సరిహద్దుల్లో పరిస్థితి సాధారణ స్థితికి ఇంకా రాలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఓ కార్యక్రమంలో తెలిపారు. ‘దౌత్యపరంగా సానుకూల సంకేతాలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం కోర్ కమాండర్లదే తుదినిర్ణయం. 2020కి పూర్వం ఉన్న స్థితి నెలకొనాలి. అప్పటి వరకు బోర్డర్‌లో వాతావరణం గుబులుగానే ఉంటుంది. యుద్ధం వచ్చినప్పుడు వస్తుంది కానీ మేం మాత్రం ఎప్పుడూ రెడీగానే ఉంటాం’ అని పేర్కొన్నారు.

TG: సీఎం రేవంత్ రెడ్డిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు తాము అండగా నిలబడటాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ‘మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదు. ఇది ఉద్యమాల పిడికిలి అని గుర్తు పెట్టుకోవాలి. పేదల గొంతులను మీ బుల్డోజర్లు తొక్కి పెట్టలేవు’ అని HYDRAA ఇళ్లను కూల్చేస్తున్న ఫొటోను KTR షేర్ చేశారు.

అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ పెరోల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. అక్టోబర్ 5న జరగనున్న హరియాణా ఎన్నికల ముందు ఆయనకు పెరోల్ రావడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఈ కేసులో ఆయన గత 9 నెలల్లో మూడుసార్లు, గత నాలుగేళ్లలో 15 సార్లు పెరోల్‌పై విడుదలవ్వడం గమనార్హం. అతని పెరోల్ రద్దు చేయాలని ఈసీని కాంగ్రెస్ కోరింది.

కామన్‌సెన్స్ లేకుండా ఆన్‌లైన్ రెమిడీస్ వెతకడం ఎంత డేంజరో చెప్పడానికి ఇదే ఉదాహరణ. గుజరాత్‌లో 23Yrs నర్సింగ్ గ్రాడ్యుయేట్, ఆమె బాయ్‌ఫ్రెండ్ SEP23న హోటల్‌కెళ్లి శృంగారంలో పాల్గొన్నారు. అప్పుడామెకు విపరీతంగా రక్తస్రావమైంది. ఓ వైపు ఆమె భయపడుతోంటే అతడేమో గూగుల్లో రెమిడీస్ వెతికాడు. విలువైన సమయం వృథా కావడంతో ఆమె స్పృహ తప్పింది. ఆస్పత్రికి తీసుకెళ్తే చనిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేశారు.

రైలు ప్రయాణాల్లో రిజర్వేషన్ చేయించుకున్నవారు టికెట్‌తో పాటు ఏదైనా ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని రైల్వే అధికారులు సూచించారు. టీటీఈ అడిగినప్పుడు గుర్తింపు కార్డును చూపించకపోతే టికెట్ లేనట్లు పరిగణించి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒకరి టికెట్‌తో మరొకరు ప్రయాణించడాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆధార్, ఓటర్, పాన్, లైసెన్స్ తదితరాల్లో ఏ ఐడీ కార్డునైనా చూపించవచ్చు.

త్వరలో జరిగే IPL2025 మెగావేలంపై భారీ అంచనాలున్నాయి. అయితే భారీ సిక్సర్లు బాదడంతో పాటు మెరుపులా వికెట్ కీపింగ్ చేసే వారిపై ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, ధ్రువ్ జురేల్, జితేశ్ శర్మపై అందరి దృష్టి నెలకొంది. ఇషాన్‌కు MI 2022లోనే రూ.15.25కోట్లు వెచ్చించిన విషయం తెలిసిందే. RR తరఫున ధ్రువ్, PBKSలో జితేశ్ అంచనాలకు మించే రాణించారు. వీరిలో మీ ఓటు ఎవరికి?

సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్రమైన కడుపునొప్పితో ఈరోజు ఉదయం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు అనుభవజ్ఞులైన ముగ్గురు వైద్యుల బృందం పొత్తి కడుపు కింది భాగంలో స్టెంట్స్ వేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియ విజయవంతమైనట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.

నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ల పరంపర కొనసాగుతోంది. మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ‘కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ.. కదా? ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి.. జరిగిందేదో జరిగిపోయింది. జస్ట్ ఆస్కింగ్’ అంటూ ట్వీట్ చేశారు.

AP: సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పత్తికొండ(M)లోని పుచ్చకాయలమడ గ్రామంలో పర్యటిస్తున్నారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కాసేపట్లో గ్రామ సభ నిర్వహించి ప్రసంగిస్తారు.

డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో DJ సౌండ్ మిక్సర్‌లు, యాంప్లిఫయర్, బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులిచ్చారు. డీజేల నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.