news

News October 10, 2024

ఇవాళ సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం ముంబైలో జరగనున్నాయి. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉ.10.30 గంటలకు NCPA గ్రౌండ్‌కు తరలించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి అమిత్ షా అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

News October 10, 2024

Ratan Tata: చాలామంది స్టార్టప్ ఓనర్లకు మెంటార్ కూడా..

image

రతన్ టాటా ఇండస్ట్రియలిస్ట్, ఇన్వెస్టర్ మాత్రమే కాదు. ఎందరో యంగ్ ఆంత్రప్రెన్యూర్స్‌కు ఆయన మెంటార్. 2014లో తొలిసారి స్నాప్‌డీల్‌లో పెట్టుబడి పెట్టారు. ఆ తర్వాత Ola, Upstox, Lenskart, CarDekho, FirstCry, Paytm, Bluestone వంటి 50+ న్యూఏజ్ స్టార్టప్పుల్లో ఇన్వెస్ట్ చేశారు. వ్యాపారంలో రాణించేందుకు ఆ ఓనర్లకు బిజినెస్ పాఠాలు చెప్పారు. డిసిషన్ మేకింగ్, స్ట్రాటజీస్ రూపకల్పనపై తన అనుభవాన్ని పంచుకున్నారు.

News October 10, 2024

నన్ను చంపాలనుకున్నారనే ప్రచారం జరిగింది: సీఎం

image

AP: YCP హయాంలో అందరికంటే ఎక్కువ వేధింపులకు గురైంది తానేనని CM చంద్రబాబు అన్నారు. ‘నేను జైలులో ఉన్నప్పుడు నన్ను చంపేందుకు కుట్ర పన్నారనే ప్రచారం జరిగింది. జైలుపై డ్రోన్లు ఎగురవేశారు. CC కెమెరాలు పెట్టారు. దోమ తెర కూడా ఇవ్వలేదు. కక్ష తీర్చుకోవడం నా లక్ష్యం కాదు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మరీ మితిమీరితే ఏం చేయాలో నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

News October 10, 2024

ఆయూష్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

AP: బీఏఎంఎస్, BHMS, BUMS కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ యూజీ-2024లో అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీలోపు వర్సిటీ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలంది. ఇటు MBBS మేనేజ్‌మెంట్ కోటాలో చేరిన విద్యార్థులు ఈ నెల 14తేదీ లోపు ఫ్రీఎగ్జిట్ అవ్వొచ్చని తెలిపింది. దివ్యాంగ కోటాలో కన్వీనర్ సీట్లు పొందిన వారు ఈ నెల 11లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలంది.

News October 10, 2024

పల్లె పండుగ పనులపై మార్గదర్శకాలు జారీ

image

AP: పల్లె పండుగ పేరిట పంచాయతీల్లో ఈ నెల 14- 20వ తేదీ వరకు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పనులను JAN నెలాఖరులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం నిబంధనలకు అనుగుణంగా పనులు నిర్వహించాలంది. జియో ట్యాగింగ్ సహా అన్ని వివరాలను పీఆర్ వన్ యాప్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించింది. సోషల్ ఆడిట్ అనంతరం బిల్లులు చెల్లిస్తామంది.

News October 10, 2024

రతన్ టాటా ‘లవ్ స్టోరీ’ తెలుసా?

image

రతన్ టాటా జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. అయితే ఆయనకు ఓ ప్రేమకథ ఉంది. USలో ఉన్నప్పుడు ఓ యువతితో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ, ఆ సమయంలో రతన్ టాటా వ్యక్తిగత కారణాలతో భారతదేశానికి రావాల్సి వచ్చింది. అదే సమయంలో భారత్-చైనా యుద్ధం జరగడంతో ఆ యువతిని ఆమె తల్లిదండ్రులు భారత్‌ రావడానికి అనుమతించలేదు. దీంతో ఆ ప్రేమకథ పెళ్లిపీటలు ఎక్కలేదని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News October 10, 2024

జీవితాన్ని మార్చే రతన్ టాటా TOP QUOTES

image

* ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే అతిపెద్ద రిస్క్. వేగంగా మారుతున్న ప్రపంచంలో కచ్చితంగా ఫెయిలయ్యేందుకున్న ఏకైక స్ట్రాటజీ ఇదే * వేగంగా నడవాలంటే ఒంటరిగా వెళ్లండి. ఎక్కువ దూరం నడవాలంటే కలిసి వెళ్లండి * విజేతలంటే నాకిష్టం. నిర్దయతో విజయం అందుకొనేవాళ్లను ఇష్టపడను * జీవితంలో ముందుకెళ్లేందుకు ఆటుపోట్లు కీలకం. ఎందుకంటే ECGలో స్ట్రెయిట్ లైన్ వచ్చిందంటే మనం చనిపోయామని అర్థం * ఇతరులపై దయ, కరుణ చూపండి >>Shareit

News October 10, 2024

ఈరోజు సెలవా? కాదా?

image

తెలంగాణలో ఇవాళ సద్దుల బతుకమ్మ సందర్భంగా సెలవు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే నేడు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. అయితే సాధారణ సెలవు ఇవ్వాలని CMO ముఖ్య కార్యదర్శికి తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ వినతిపత్రం ఇచ్చింది. కానీ దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇవాళ ఉద్యోగులకు ఆప్షనల్ సెలవు మాత్రమే ఉండనుంది.

News October 10, 2024

అల్విదా రతన్‌జీ.. ఓ శకం ముగిసింది

image

పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం భారతీయులను కలిచివేస్తోంది. ‘నేషన్ ఫస్ట్’ అని నమ్మిన ఆయన, తన సంస్థనే కాకుండా పారిశ్రామిక రంగంలో దేశాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారు. టాటా గ్రూప్ లాభాల్లో 60-65% నిధులను దాతృత్వానికే వెచ్చించారు. లేదంటే ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన తొలి వరుసలో ఉండేవారు. కానీ అవేమీ లెక్కచేయని గొప్ప మానవతావాది. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అల్విదా రతన్‌జీ.

News October 10, 2024

రెండు మద్యం షాపులకు తీవ్ర పోటీ.. ఎక్కడంటే?

image

AP: మద్యం దుకాణాల లైసెన్సుల కోసం బుధవారం రాత్రి వరకు 57,709 దరఖాస్తులొచ్చాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ప్రభుత్వానికి రూ.1154.18 కోట్ల ఆదాయం సమకూరింది. నేడు, రేపు కూడా అవకాశం ఉండటంతో మరో 40 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా. NTR(D) వత్సవాయి(M)లో 2 దుకాణాలకు అత్యధికంగా 217(రూ.4.2 కోట్లు) దరఖాస్తులొచ్చాయి. అత్యధికంగా NTR(D)లో 4,420, ఏలూరు(D)లో 3,843, విజయనగరం(D)లో 3,701 దరఖాస్తులు అందాయి.