News October 10, 2024

రతన్ టాటా ‘లవ్ స్టోరీ’ తెలుసా?

image

రతన్ టాటా జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. అయితే ఆయనకు ఓ ప్రేమకథ ఉంది. USలో ఉన్నప్పుడు ఓ యువతితో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ, ఆ సమయంలో రతన్ టాటా వ్యక్తిగత కారణాలతో భారతదేశానికి రావాల్సి వచ్చింది. అదే సమయంలో భారత్-చైనా యుద్ధం జరగడంతో ఆ యువతిని ఆమె తల్లిదండ్రులు భారత్‌ రావడానికి అనుమతించలేదు. దీంతో ఆ ప్రేమకథ పెళ్లిపీటలు ఎక్కలేదని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Similar News

News November 14, 2024

బ్రెజిల్ సుప్రీం కోర్టు వద్ద బాంబు పేలుళ్లు

image

బ్రెజిల్‌లో ఏకంగా సుప్రీం కోర్టును పేల్చేందుకు ఓ దుండగుడు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. పేలుడు పదార్థాలతో వచ్చిన సూసైడ్ బాంబర్ ప్రవేశ ద్వారం వద్దే అవి పేలిపోవడంతో మరణించాడని అధికారులు తెలిపారు. అతడి వివరాలతో పాటు వెనుక ఎవరున్నారనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి బ్రెజిల్‌లో జీ20 సదస్సు జరగనుండగా ఈ పేలుడు సంభవించడం చర్చనీయాంశంగా మారింది.

News November 14, 2024

కార్తీక మాసంలో ఉసిరిని ఎందుకు పూజిస్తారంటే..

image

మహావిష్ణువుకు ప్రతిరూపంగా భావించే ఉసిరిని కార్తీక మాసంలో పూజించి దాని వద్ద దీపం వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఉసిరిలో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. ఎండ తక్కువగా ఉండే చలికాలంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉసిరి ఉపకరిస్తుందని శాస్త్రీయ వివరణ. కార్తీక వన భోజనాలు సైతం ఉసిరి చెట్ల నీడలో చేయాలని పెద్దలు పేర్కొనడం గమనార్హం.

News November 14, 2024

శ్రీవారికి రూ.2కోట్ల విలువైన వైజయంతీ మాల విరాళం

image

AP: తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విలువైన స్వర్ణ వైజయంతీ మాలను టీటీడీ మాజీ ఛైర్మన్ డీకే ఆదికేశవులు మనవరాలు తేజస్వీ విరాళంగా అందించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా ఏడుకొండలవాడికి కానుకగా ఇచ్చారు. వజ్ర వైడూర్యాలు పొదిగిన ఈ మాలను ఉత్సవమూర్తులకు అలకరించనున్నారు. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీమాలను ఆమె అందజేయనున్నారు.