news

News March 21, 2024

BIG BREAKING: సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఆయనను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్‌ను ఈడీ ఆఫీస్‌కు తరలిస్తున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది.

News March 21, 2024

‘ఆపరేషన్ ఇంద్రవతి’ చేపట్టిన భారత్

image

హైతీలో హింస చెలరేగిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశంలో చిక్కుకున్న భారత పౌరులను తరలించేందుకు ‘ఆపరేషన్ ఇంద్రవతి’ చేపట్టింది. 12 మంది భారతీయులను హైతీ నుంచి డొమినికన్ రిపబ్లిక్‌కు తరలించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. విదేశాల్లోని భారత పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో డొమినికన్ రిపబ్లిక్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

News March 21, 2024

ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల

image

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. జూన్ నెలకు సంబంధించి వృద్ధులు/దివ్యాంగుల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను మార్చి 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ దాతలకు అదే రోజు ఉదయం 11 గంటలకు దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని తెలిపింది. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను మార్చి 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది.

News March 21, 2024

మహిళా టీ20 WC క్వాలిఫయర్ షెడ్యూల్ విడుదల

image

మహిళా టీ20 వరల్డ్ కప్ 2024 క్వాలిఫయర్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. వచ్చే నెల 25 నుంచి మే 7వరకు మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-Aలో శ్రీలంక, థాయిలాండ్, స్కాట్లాండ్, ఉగాండా, యూఎస్ఏ ఉండగా.. గ్రూప్-Bలో ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్, యూఏఈ, వనాటు ఉన్నాయి. ఫైనల్ చేరిన 2 జట్లు టీ20 WCకి అర్హత సాధిస్తాయని ఐసీసీ పేర్కొంది.

News March 21, 2024

‘ప్రజాగళం’ భద్రతా వైఫల్యంపై ఈసీ కీలక ఆదేశాలు

image

AP: ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన చిలకలూరిపేట ‘ప్రజాగళం’ సభలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై సీఈవోను ఈసీ నివేదిక కోరింది. త్వరగా విచారణ పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధాని సభలో బ్లాంకు పాసులు ఇవ్వడం, పవర్ కట్‌పై టీడీపీ, జనసేన ఈసీకి ఫిర్యాదు చేశాయి.

News March 21, 2024

ధోనీకి షేక్ హ్యాండ్‌ ఇస్తూ రోహిత్ పోస్ట్

image

IPLలో ధోనీ, రోహిత్ విజయవంతమైన కెప్టెన్లు. CSKకు ధోనీ, MIకి రోహిత్ సుదీర్ఘ కాలం సారథులుగా సేవలందించి అత్యధిక ట్రోఫీలను గెలిపించారు. తాజాగా ధోనీ CSK కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్ అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. టాస్ సందర్భంగా ధోనీకి షేక్ హ్యాండ్‌ ఇస్తున్న ఫొటోను హిట్‌మ్యాన్ పోస్ట్ చేశారు. ‘ఇద్దరు లెజెండ్‌లను తొలిసారి ప్లేయర్లుగా చూడబోతున్నాం’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News March 21, 2024

ఏంటీ లిక్కర్ స్కాం?

image

ఆప్ సర్కార్ 2021లో కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ఈ పాలసీని రూపొందించింది. 2022లో వచ్చిన కొత్త చీఫ్ సెక్రటరీ దీనిలో స్కామ్ జరిగిందని భావించి నివేదికను లెఫ్టినెంట్ గవర్నర్‌‌కు అందజేశారు. అదే ఏడాది ఆయన CBI విచారణకు ఆదేశించారు. ఇందులో రూ.కోట్ల అవినీతి జరిగిందని భావించి ఈడీ కూడా దర్యాప్తులోకి ఎంట్రీ ఇచ్చింది.

News March 21, 2024

ఏ పార్టీనీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు: మనోజ్

image

ఓటు వినియోగంపై మంచు మనోజ్ చేసిన <<12888614>>వ్యాఖ్యలు<<>> చర్చనీయాంశంగా మారాయి. తాజాగా దీనిపై మనోజ్ స్పష్టతనిచ్చారు. ఈ వ్యాఖ్యలను ఏ పార్టీనీ ఉద్దేశించి మాట్లాడలేదని చెప్పారు. రాజకీయ హద్దులు దాటి.. ఐక్యత, గౌరవంతో ముందుకు సాగాలనేది తన ఉద్దేశమని తెలిపారు. లైవ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా తాను మాట్లాడిన కొన్ని కీలక అంశాలు ప్రసారం కాలేదని, అది కాస్తా తప్పుడు అర్థాలకు దారితీసిందని పేర్కొన్నారు.

News March 21, 2024

వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్!

image

యూజర్లకు మరో సూపర్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. వాయిస్ నోట్స్ మెసేజ్‌ను టెక్ట్స్ రూపంలోకి మార్చి అందించే దిశగా పరీక్షలు నిర్వహిస్తోంది. వాయిస్ మెసేజ్‌ను అర్థం చేసుకోలేకపోయే వారు, చెవిటివారికి ఇది ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను Android 2.24.7.8 వెర్షన్‌లో పరీక్షిస్తున్నట్లు WABetaInfo వెల్లడించింది.

News March 21, 2024

సుప్రీంకోర్టుకు ఆప్ నేతలు?

image

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారంతో ఆప్ నేతలు అలర్ట్ అయ్యారు. అత్యవసరంగా సమావేశమై తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీఎంను ప్రశ్నించేందుకు 12 మంది ఈడీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. కేజ్రీవాల్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.