News March 21, 2024
మహిళా టీ20 WC క్వాలిఫయర్ షెడ్యూల్ విడుదల
మహిళా టీ20 వరల్డ్ కప్ 2024 క్వాలిఫయర్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. వచ్చే నెల 25 నుంచి మే 7వరకు మ్యాచులు జరగనున్నాయి. గ్రూప్-Aలో శ్రీలంక, థాయిలాండ్, స్కాట్లాండ్, ఉగాండా, యూఎస్ఏ ఉండగా.. గ్రూప్-Bలో ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్, యూఏఈ, వనాటు ఉన్నాయి. ఫైనల్ చేరిన 2 జట్లు టీ20 WCకి అర్హత సాధిస్తాయని ఐసీసీ పేర్కొంది.
Similar News
News September 9, 2024
జో రూట్ ఖాతాలో మరో రికార్డు
ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా రూట్ (12,402) అవతరించారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో 11 పరుగుల వద్ద ఉన్నప్పుడు కుమార సంగక్కర (12,400) రికార్డును ఆయన అధిగమించారు. మరో 83 పరుగులు చేస్తే అలిస్టర్ కుక్ (12,472) రికార్డు కూడా రూట్ బద్దలుకొడతారు. అగ్ర స్థానంలో సచిన్ టెండూల్కర్ (15921) ఉన్నారు.
News September 9, 2024
నాటో పరిధిలో కుప్పకూలిన రష్యా డ్రోన్
రష్యాకు చెందిన ఓ సైనిక డ్రోన్ నాటో పరిధిలోని లాత్వియా దేశంలో తాజాగా కుప్పకూలింది. ఈ దేశాధ్యక్షుడు ఎడ్గర్స్ రింకెవిక్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. డ్రోన్ బెలారస్ మీదుగా తమ దేశంలో పడిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఈమధ్య పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో ఉన్న లాత్వియా, తర్వాతి కాలంలో ప్రత్యేక దేశంగా మారి నాటో సభ్యదేశమైంది.
News September 9, 2024
సెప్టెంబర్ 09: చరిత్రలో ఈరోజు
1914: కవి కాళోజీ నారాయణరావు జననం
1935: నటుడు, కూచిపూడి కళాకారుడు వేదాంతం సత్యనారాయణ శర్మ జననం
1953: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి జననం
1957: సినీ నటి జయచిత్ర జననం
1987: బాల మేధావి తథాగత్ అవతార్ తులసి జననం
తెలంగాణ భాషా దినోత్సవం