news

News May 1, 2024

రింకూ సింగ్ లేకపోవడం పెద్ద లోటు: రాయుడు

image

T20 WC జట్టులో రింకూ సింగ్ లేకపోవడం పెద్ద లోటు అని అంబటి రాయుడు అభిప్రాయపడ్డారు. ‘అతడిని తప్పించడం చూస్తుంటే క్రికెటింగ్ సెన్స్‌ కంటే గణాంకాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థమవుతోంది. ఇప్పుడు ఎంపికైన ప్లేయర్లలో జడేజా మినహా ఏ ఆటగాడు గత రెండేళ్లలో చివరి ఓవర్లలో అధిక స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి మ్యాచును గెలిపించారు?. క్వాంటిటీ కంటే క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి’ అని ట్వీట్ చేశారు.

News May 1, 2024

రేవంత్ అందుకే విచారణకు రాలేదు: టీపీసీసీ లీగల్ సెల్

image

TG: ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసుల నోటీసులకు TPCC లీగల్ సెల్ సమాధానమిచ్చింది. CM రేవంత్‌కు వచ్చిన నోటీసులపై 4 వారాల గడువు కోరింది. ఎన్నికల ప్రచారంలో ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారని, ప్రచార షెడ్యూల్ కారణంగా ఈరోజు విచారణకు హాజరు కాలేదని పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతకు ఢిల్లీ పోలీసులు తాజాగా నోటీసులిచ్చారు. ఆమె అమిత్ షా వీడియోను ఎడిట్ చేసినట్టు అనుమానిస్తున్నారు.

News May 1, 2024

41 ఏళ్లలో తొలిసారిగా బెంగళూరులో సున్నా వర్షపాతం!

image

బెంగళూరు ఇప్పటికే నీటి ఎద్దడితో అల్లాడుతుండగా.. వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నగరంలో ఒక్కసారి కూడా వర్షం పడలేదని వెల్లడించింది. ఏప్రిల్ నెలలో వర్షపాతం అసలు నమోదు కాకపోవడం గత 41 ఏళ్లలో ఇదే తొలిసారి అని తెలిపింది. నగరంలో నీటి అవసరాలకు, భూగర్భజలాల పెరుగుదలకు ఏప్రిల్ వర్షాలు కీలకం. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితి పట్ల బెంగళూరువాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

News May 1, 2024

సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసు.. కస్టడీలో నిందితుడి సూసైడ్

image

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకడైన అనుజ్ థాపన్ పోలీసుల కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులకు పాల్పడిన ఇద్దరు షూటర్లకు అనుజ్ ఆయుధాలు సమకూర్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అరెస్ట్ చేయగా.. ఇవాళ అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

News May 1, 2024

మహీంద్రా XUV 700లో లోపాలు.. వ్యక్తి ట్వీట్

image

AP: కర్నూల్‌కు చెందిన తేజేశ్వర్‌రెడ్డి ‘మహీంద్రా XUV 700 AX7’ కారులో వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. కారు 6సార్లు పల్టీ కొట్టినా అదృష్టవశాత్తు బయటపడ్డామని చెప్పారు. ప్రమాదం నుంచి తమను రక్షించాల్సిన ఎయిర్ బ్యాగ్స్‌ తెరచుకోకవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కారు భద్రతా ప్రమాణాలను ప్రశ్నిస్తూ కంపెనీని ట్యాగ్ చేయగా.. కంపెనీ స్పందించింది. ఈ ఇష్యూను పరిశీలిస్తామని చెప్పినట్లు తేజేశ్వర్‌ వెల్లడించారు.

News May 1, 2024

సంజూ శాంసన్ ఎమోషనల్ పోస్ట్

image

టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కడంపై సంజూ శాంసన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన మంజుమ్మల్ బాయ్స్ మూవీలోని ‘చెమట.. కష్టం కుట్టిన చొక్కా’ అంటూ సాగే పాట లిరిక్స్‌ను ఇన్‌స్టా స్టోరీ పెట్టుకున్నారు. శాంసన్ శ్రమకు తగిన గుర్తింపు లభించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2011 వన్డే ప్రపంచకప్ (శ్రీశాంత్) తర్వాత ఓ మలయాళీ ప్లేయర్ టీమ్ఇండియా తరఫున వరల్డ్ కప్ ఆడనుండటం ఇదే తొలిసారి.

News May 1, 2024

రేపు అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక

image

అమేథీ, రాయ్‌బరేలీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ సెంట్రల్ కమిటీ రేపు ప్రకటించనుంది. రాహుల్ పోటీ చేసి ఓడిన అమేథీలో తిరిగి ఆయన పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే వయనాడ్‌లో పోటీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాయ్‌బరేలీలో పోటీ చేసేందుకు ప్రియాంకా గాంధీ సుముఖత వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాలకు వచ్చే నెల 20న ఎన్నికలు జరగనున్నాయి.

News May 1, 2024

అజిత్‌‌కు భార్య షాలినీ సర్‌ప్రైజ్‌ బర్త్ డే గిఫ్ట్‌

image

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ బర్త్ డే సందర్భంగా ఆయన భార్య షాలినీ స్పెషల్ గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్ చేశారు. అజిత్‌కి బైక్స్ అంటే బాగా ఇష్టం కావడంతో లేటెస్ట్ మోడల్ డుకాటీ బైక్‌ని భర్తకు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అజిత్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ, విదా ముయార్చి సినిమాలు చేస్తున్నారు.

News May 1, 2024

T20WC: వాన్‌ జోస్యం.. ఇండియా ఇంటికేనట

image

టీ20 వరల్డ్ కప్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్‌ వాన్‌ జోస్యం చెప్పారు. మరో నెల రోజుల్లో ప్రారంభంకానున్న ఈ టోర్నీలో టీమ్ఇండియా లీగ్ దశలోనే ఇంటి బాట పడుతుందని పరోక్షంగా సూచించారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుతాయని వాన్ ట్వీట్ చేశారు. గత వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ ఇలాంటి జోస్యం చెప్పి వాన్ చివరికి నాలుక కర్చుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News May 1, 2024

‘కోవిషీల్డ్’ తీసుకున్నారా?

image

‘కోవిషీల్డ్’తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆస్ట్రాజెన్‌కా అంగీకరించడంతో అందరిలో ఆందోళన మొదలైంది. కానీ 10 లక్షల మందిలో 7-8 మందికే సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చని ICMR మాజీ సైంటిస్ట్ రామన్ తెలిపారు. ఫస్ట్ డోస్ తీసుకున్న 2-3 నెలల్లోనే ఇవి బయటపడతాయట. అటు ఈ టీకా తీసుకుని మరణించిన, వైకల్యం పొందిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని SCలో లాయర్ విశాల్ పిటిషన్ వేశారు. దుష్ప్రభావాలపై నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.