India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘వెట్టయాన్’ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ కోసం ఆయన తాజాగా రజనీతో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో రజనీ పోలీస్‌గా నటిస్తున్నట్లు తెలుస్తుండగా, బిగ్ బీ పాత్ర ఏంటనేది తెలియాల్సి ఉంది. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తెలుగులో ‘వేటగాడు’గా రానుంది.

గుజరాత్‌లోని వడాలిలో దారుణం జరిగింది. వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు జయంతిభాయ్ బాంబ్ పార్సిల్ పంపాడు. అది పేలి భర్త జీతూభాయ్, ఓ కుమార్తె మరణించగా.. మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలయ్యాయి. ఆ సమయంలో అతడి భార్య ఇంట్లో లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన ప్రియురాలిని జీతూభాయ్ వివాహం చేసుకోవడంతోనే హత్య చేశానని జయంతిభాయ్ పోలీసుల విచారణలో తెలిపాడు. టేప్ రికార్డర్ వంటి పరికరంలో బాంబ్ అమర్చానని చెప్పాడు.

బంగారం విలువ పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్లకు ఇటీవల కాలంలో డిమాండ్ గణనీయంగా పెరిగింది. గత ఏడాది కాలంలో బంగారం ధర 20% పెరిగింది. ఇదే అదనుగా చాలా సంస్థలు విచ్చలవిడిగా గోల్డ్ లోన్స్ మంజురు చేస్తున్నాయి. ఈ పరిస్థితిపై RBI ఆందోళన వ్యక్తం చేస్తోంది. బంగారం ధర ఒకవేళ పడిపోతే ఆ ప్రభావం లోన్ విలువ, వడ్డీరేట్లపై పడి సవాళ్లు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలోనే నిబంధనలు ఫాలో కానీ సంస్థలపై చర్యలు చేపడుతోంది.

TG: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో ముందస్తు విచారణ చేయొద్దని పోలీసులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. రిజర్వేషన్లను ఎత్తేస్తామంటూ అమిత్ షా మాట్లాడినట్లుగా ఓ మార్ఫింగ్ వీడియో వైరలైన విషయం తెలిసిందే. దీనికి బాధ్యులైన ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.

AP: మచిలీపట్నం YCP MLA అభ్యర్థి, మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదైంది. నిన్న ఆయన ప్రచారంలో ఉండగా జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కొందరు YCP కార్యకర్తలు చొరబడి దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో కిట్టుని A1గా చూపగా.. మరో ఐదుగురి YCP నేతలపైనా హత్యాయత్నం కేసు నమోదు అయింది. ఇదే కేసులో ఓ మహిళను దూషించారంటూ కర్రి మహేశ్‌పై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

‘కూ’.. 2020లో ట్విటర్‌కు పోటీగా లాంచ్ అయిన ఈ యాప్ గ్రాఫ్ 2021లో ఒక్కసారిగా పెరిగింది. AUG 2021 నాటికి 10 మిలియన్ డౌన్లోడ్స్ నమోదు చేసింది. ఆ సమయంలో రైతు ఉద్యమానికి సంబంధించి ట్విటర్, కేంద్రానికి మధ్య చెలరేగిన వైరాన్ని ఈ యాప్ క్యాష్ చేసుకుంది. కేంద్రమంత్రులు, సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో ఈ యాప్‌పై భారీ అంచనాలు పెరిగాయి. కట్ చేస్తే ఇప్పుడు ఆ సంస్థ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు.

ప్రస్తుతం కూ యాప్ డైలీహంట్ సంస్థతో టైఅప్ అయ్యే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా అంతకుముందు మరో రెండు సంస్థలను సైతం సంప్రదించినట్లు తెలుస్తోంది. పార్ట్‌నర్‌షిప్ సంగతి తేలేవరకు జీతాల చెల్లింపు కష్టమేనని సంస్థ వ్యవస్థాపకుడు మయాంక్ బిదవట్క పేర్కొన్నారు. ట్విటర్‌కు ఇది సరైన ప్రత్యామ్నాయం అనిపించేలా యాప్‌లో ప్రత్యేకతలు లేకపోవడం, సరైన ఫండింగ్ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

TG: ఈనెల 6న జరగనున్న ఈసెట్ ప్రవేశ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఉ.9 నుంచి మ.12 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తామని, పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, డిజిటల్ వాచ్‌లు, ఫోన్లకు అనుమతి ఉండదని, హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు.

AP: చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి తిరిగొస్తుందని CM జగన్ చెప్పారు. ఆయన ఇప్పుడే సూపర్-6లో రూ.4,000 పెన్షన్ హామీని ఎత్తేశారని మండిపడ్డారు. కనిగిరి సభలో మాట్లాడుతూ.. ‘మీ జగన్ అధికారంలో ఉంటేనే పెంచిన అమ్మ ఒడి, కాపు నేస్తం, EBC నేస్తం, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కళ్యాణమస్తు, షాదీతోఫా, రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీ అందుతాయి. విలేజ్ క్లినిక్‌లో వైద్యం, ఇంటికే పౌర సేవలు కొనసాగుతాయి’ అని పేర్కొన్నారు.

అమెరికాలోని యూనివర్సిటీల్లో పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు చేపట్టి సస్పెండ్ అయిన విద్యార్థులకు హౌతీ మిలిటెంట్లు మద్దతు తెలిపారు. యెమెన్‌లో హౌతీల ఆధ్వర్యంలో నడిచే సనా యూనివర్సిటీ ఈ మేరకు విద్యార్థులను ఆహ్వానించింది. విద్యార్థుల మానవతా దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు USలో HIMS అనే ఆన్‌లైన్ ఫార్మసీ సంస్థ CEO ఆండ్రూ సైతం ఉద్యోగాలు ఇస్తానని విద్యార్థులకు తన మద్దతు ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.