news

News April 27, 2024

‘సందేశ్‌ఖాలీ రైడ్స్’.. ఈసీని ఆశ్రయించిన తృణమూల్

image

ఎన్నికల వేళ తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు సీబీఐ, NSG సందేశ్‌ఖాలీలో ఫేక్ రైడ్లు నిర్వహించాయని ఆరోపిస్తూ తృణమూల్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ‘రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా CBI రైడ్లు నిర్వహించింది. ఈ ఆయుధాలు ఎక్కడ దొరికాయో స్పష్టత లేదు. వాటిని సీబీఐ/ఎన్ఎస్‌జీనే పెట్టి ఉండొచ్చు’ అని పేర్కొంది. అంతకుముందు ఈ రైడ్లపై స్పందించిన BJP.. తృణమూల్‌ను ఓ ఉగ్రవాద సంస్థగా అభివర్ణించింది.

News April 27, 2024

హైబీపీని లైట్ తీసుకుంటున్నారా?

image

చాలామంది హైబీపీని లైట్ తీసుకుంటారు. 18-54Yrs మధ్య భారతీయుల్లో 30% BP చెక్ చేయించుకోవడం లేదని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. సాధారణ రక్తపోటు 120/80 కాగా.. 140/90కి చేరితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. నిరంతర హైబీపీతో కళ్లు దెబ్బతింటాయట. రక్తనాళాలు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందని, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చని చెబుతున్నారు.
> SHARE

News April 27, 2024

దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత మన దగ్గరే!

image

ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో నమోదైంది. ఈరోజు నంద్యాలలో 44.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో.. దేశంలోనే హాటెస్ట్ సిటీగా నిలిచిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అసన్‌సోల్, భువనేశ్వర్ 44.6డిగ్రీల ఉష్ణోగ్రతతో రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత కర్నూల్(44.5), అనంతపూర్(43.7), ఝర్సుగుడ(43.65), మహబూబ్‌నగర్(43.5) ఉన్నాయి.

News April 27, 2024

ప్రభుదేవా ‘ప్రేమికుడు’ రీరిలీజ్

image

ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన ‘ప్రేమికుడు’ సినిమా రీరిలీజ్‌కు సిద్ధమైంది. మే 1న 300కుపైగా థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఎస్ శంకర్ తెరకెక్కించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వడివేలు, రఘువరణ్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా 1994 సెప్టెంబర్ 17న విడుదలై అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

News April 27, 2024

రేవంత్ మాటలను ఎవరూ నమ్మరు: కిషన్‌రెడ్డి

image

TG: బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు చూస్తోందని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి స్పందించారు. రేవంత్ ఎంత దుష్ప్రచారం చేసినా బీజేపీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో లేని అంశాలు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన మాటలు ఎవరూ నమ్మరని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలోనూ బీజేపీ‌కి డబుల్ డిజిట్ ఖాయమని జోస్యం చెప్పారు.

News April 27, 2024

రాణించిన రాహుల్.. లక్నో స్కోర్ 196/5

image

రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కెఎల్.రాహుల్(76) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20ఓవర్లలో 5 వికెట్లకు 196 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో రాహుల్‌కు తోడుగా దీపక్ హుడా(50) హాఫ్ సెంచరీతో రాణించారు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. గత మ్యాచ్‌లో సెంచరీ హీరో స్టొయినిస్(0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ 2, బౌల్ట్, అవేష్ ఖాన్, అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు.

News April 27, 2024

సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్

image

AP: మలివిడత ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా సీఎం జగన్ రేపు మూడు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో జరిగే సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న ఆయన.. ఆ తర్వాత వెంకటగిరిలో త్రిభువని సర్కిల్‌లో జరిగే సభలో, అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.

News April 27, 2024

రేపు జాగ్రత్త

image

తెలంగాణలో మరో 3-4 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు ADB, ASF, మంచిర్యాల, నిర్మల్, NZB, JGTL, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, KTDM, KMM, NLG, SRPT, MBNR, WNP, గద్వాల్, NRPTలో వేడి మరియు తేమతో కూడిన పరిస్థితులుంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోని 58 మండలాల్లో తీవ్ర వడగాలులు, 148 మండలాల్లో రేపు వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

News April 27, 2024

సుధీర్ బాబు ‘హరోం హర’ రిలీజ్ డేట్ ఫిక్స్

image

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన ‘హరోం హర’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజు మే 31న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. జ్ఞానసాగర్ ద్వారక డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా కథ 1989 బ్యాక్‌డ్రాప్‌లో కుప్పం నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది.

News April 27, 2024

నేను దిగిపోగానే కరెంట్ ఎందుకు పోతోంది?: KCR

image

TG: BRS పాలనలో రెప్పపాటు కూడా కరెంట్ పోలేదని KCR చెప్పారు. నాగర్‌కర్నూలులో ప్రసంగించిన ఆయన.. ‘నేను దిగిపోగానే కరెంట్ ఎందుకు పోతోంది? ఇవాళ అన్నం తింటుంటే 2 సార్లు కరెంట్ పోయింది. సీఎం కరెంట్ పోవడం లేదంటున్నారు. ప్రధాని మోదీ వంద నినాదాలు చేశారు. ఒక్కటైనా జరిగిందా? పదేళ్లలో రైతుల ఆదాయం పెరిగిందా? గ్యాస్ ధరలు తగ్గాయా? తెలంగాణకు ఒక్క నవోదయ స్కూలు, ఒక్క మెడికల్ కాలేజీ అయినా ఇచ్చారా?’ అని ప్రశ్నించారు.