News April 27, 2024

హైబీపీని లైట్ తీసుకుంటున్నారా?

image

చాలామంది హైబీపీని లైట్ తీసుకుంటారు. 18-54Yrs మధ్య భారతీయుల్లో 30% BP చెక్ చేయించుకోవడం లేదని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. సాధారణ రక్తపోటు 120/80 కాగా.. 140/90కి చేరితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. నిరంతర హైబీపీతో కళ్లు దెబ్బతింటాయట. రక్తనాళాలు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందని, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చని చెబుతున్నారు.
> SHARE

Similar News

News November 14, 2024

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మహిళలకు ఆహ్వానం

image

TG: కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. డిసెంబర్ 7న ట్యాంక్‌బండ్ పరిసరాల్లో, 8న సచివాలయ పరిసరాల్లో, 9న నెక్లెస్ రోడ్డులో వేడుకలు నిర్వహించనున్నారు. 9న సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు.

News November 14, 2024

ఒకప్పుడు పండ్లు అమ్మారు.. ఇప్పుడు రూ.10వేల కోట్ల ఆస్తి!

image

సినీ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులెవరో తెలుసా? హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం రూ.10వేల కోట్ల నికర విలువతో T-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అగ్రస్థానంలో ఉన్నారు. గతంలో కపూర్‌లు, చోప్రాలకే ఈ ట్యాగ్ ఉండేది. అయితే, ఇప్పుడు అత్యంత ధనవంతులైనప్పటికీ.. భూషన్ కుటుంబం ఒకప్పుడు పండ్లు అమ్ముకునేది. 1970లలో భూషన్ తండ్రి గుల్షన్ కుమార్ సంగీత క్యాసెట్లు విక్రయించే షాపును కొనుగోలు చేయడంతో వీరి రాత మారిపోయింది.

News November 14, 2024

పాలనకు ఏడాది.. విజయోత్సవాలపై సీఎం సమీక్ష

image

TG: వచ్చే నెలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో విజయోత్సవాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నేతలకు సూచించారు. ముఖ్యంగా మహిళా సాధికారత, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించాలని చెప్పారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌ సభల్లో సీఎం పాల్గొనే అవకాశం ఉంది.