news

News April 28, 2024

మా పాలనలో ప్రజల జీవితాలు బాగుపడ్డాయి: సీఎం జగన్

image

AP: వైసీపీ పాలనలో పౌర సేవలన్నీ ఇంటికే వస్తున్నాయని CM జగన్ అన్నారు. ‘ పెన్షన్లు, రేషన్, వైద్య సేవలు ఇంటికే అందేలా వ్యవస్థను ఏర్పాటు చేశాం. మరో 15ఏళ్లు ఇలాంటి పాలన ఉంటే ప్రజల జీవితాలు ఇంకెంత బాగుపడతాయో ఆలోచించండి. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు లాంటి మోసకారిని నమ్మొచ్చా? సైకిల్‌‌ను ఇంటి బయటే ఉంచాలి.. గ్లాసుని సింక్‌లో పడెయ్యాలి. వైసీపీకి ఒక్క సీటు తగ్గకుండా గెలిపించాలి’ అని కోరారు.

News April 28, 2024

చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖిని నిద్రలేపినట్లే: సీఎం

image

AP: చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పథకాలను ఆపేస్తారని సీఎం జగన్ పునరుద్ఘాటించారు. ‘చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖిని నిద్రలేపినట్లే. పేదల ఆత్మగౌరవాన్ని పెంచేలా మంచి పాలన అందించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవుల్లో ప్రాధాన్యమిచ్చాం. పేద విద్యార్థులు ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడేలా విద్యను అందిస్తున్నాం. 2లక్షల 30వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇంత మంచి చేసిన మీ బిడ్డను మళ్లీ ఆదరించాలి’ అని కోరారు.

News April 28, 2024

తెలుగు ప్లేయర్‌పై హార్దిక్ తీవ్ర వ్యాఖ్యలు

image

నిన్న ఢిల్లీ చేతిలో ముంబై ఓటమికి చాలా కారణాలున్నా, తెలుగు కుర్రాడు తిలక్ వర్మే కారణమని ముంబై కెప్టెన్ పాండ్య అనడం చర్చనీయాంశంగా మారింది. ‘8వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్‌కు వచ్చారు. ఎడమ చేతి బ్యాట్స్‌మన్ అయిన తిలక్‌ ఆ ఓవర్లో దూకుడుగా ఆడాల్సింది. కానీ తొలి 4బంతులకు సింగిల్స్ తీశారు. అక్కడే మ్యాచ్ పోయింది’ అని పేర్కొన్నారు. హార్దిక్ ఇలా తిలక్‌ పేరును కారణంగా చూపడంపై నెట్టింట విస్తృత చర్చ నడుస్తోంది.

News April 28, 2024

Job Resumeలో ఈ తప్పులు చేయొద్దు!

image

ఉద్యోగం సాధించేందుకు మొదటి మెట్టు Resume. ఈ నేపథ్యంలో మంచి Resume ఎలా ఉండాలన్నదానిపై ఉద్యోగ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
* భారీ వాక్యాలు రాయొద్దు. సూటిగా సుత్తి లేకుండా ఉండేలా చూసుకోవాలి.
* రిక్రూటర్ దృష్టిలో పడేందుకు కీ వర్డ్స్ అతిగా వాడొద్దు. నిజాయితీ కనిపించాలి.
* మీ లక్ష్యాల గురించి అతిగా చెప్పొద్దు. అలా అని మరీ పొడిగా రాయొద్దు. సంస్థకు మీ వల్ల ఉపయోగాన్ని క్లుప్తంగా చెప్తే చాలు.

News April 28, 2024

ఢిల్లీలో హస్తం పార్టీకి ఎదురుదెబ్బ

image

దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. AAPతో కాంగ్రెస్ పొత్తును వ్యతిరేకిస్తూ హస్తం పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. INCపై తప్పుడు, దుర్మార్గపు అవినీతి ఆరోపణలు చేసిన పార్టీతోనే పొత్తు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు.

News April 28, 2024

నేను ఫస్ట్ రాకుండా ఉండాల్సింది: యూపీ టాపర్

image

ముఖంపై అవాంఛిత రోమాల విషయంలో దారుణ ట్రోల్స్ ఎదుర్కొన్నారు యూపీ టెన్త్ పరీక్షల టాపర్ ప్రాచీ నిగమ్. ఆ ట్రోల్స్ పట్ల తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘బహుశా ఇంకొన్ని తక్కువ మార్కులు తెచ్చుకోవాల్సిందేమో. అలా అయితే ట్రోలింగ్ తప్పేది. సామాజిక మాధ్యమాల్లో జనం ఇష్టం వచ్చినట్లు రాస్తుంటారు. చాలా బాధగా అనిపిస్తుంటుంది. ఇంజినీర్ అవ్వాలనేది నా కల. సాధిస్తాను’ అని ధీమా వ్యక్తం చేశారు.

News April 28, 2024

త్వరలోనే ఆల్ ఇన్ వన్ బీమా?

image

జీవిత, ఆరోగ్య, ప్రమాద, స్థిరాస్తి బీమా పథకాలను ఇకపై విడివిడిగా తీసుకునే బాధ తప్పనుంది. అన్నింటికి కవరేజీ కల్పించే ఆల్ ఇన్ వన్ పాలసీ ‘బీమా విస్తర్’ విధివిధానాలను IRDAI త్వరలో ప్రకటించనుంది. ఏటా రూ.1500 ప్రీమియం ఉండే ఛాన్సుండగా.. జీవిత బీమా పాలసీకి రూ.820, ఆరోగ్య బీమాకు రూ.500, వ్యక్తిగత ప్రమాద బీమాకు రూ.100, ఆస్తి బీమాకు రూ.80 చొప్పున ప్రీమియం ఉండనున్నట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

News April 28, 2024

రేపు తెలంగాణ EAPCET హాల్‌టికెట్లు

image

తెలంగాణ EAPCET హాల్‌టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 3.5 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా.. ఇంజినీరింగ్‌కు 2.5 లక్షలు, అగ్రికల్చర్, ఫార్మాకు 98 వేల మంది అప్లై చేశారు. మే 7, 8 న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ అమలుకు అధికారులు చర్యలు చేపట్టారు. రూ.5000 ఫైన్‌తో మే 1 వరకు EAPCETకు దరఖాస్తు చేయవచ్చు.

News April 28, 2024

ఏఐ రాకతో కాల్‌సెంటర్లు కనుమరుగు కావొచ్చు: టీసీఎస్ సీఈవో

image

కాల్ సెంటర్లకు భవిష్యత్తుపై TCS సీఈవో కృతివాసన్ విస్తుపోయే విషయాన్ని వెల్లడించారు. ఏఐ వచ్చే ఏడాదిలోపు కాల్‌సెంటర్ల అవసరం లేకుండా చేయొచ్చని అభిప్రాయపడ్డారు. అధునాతన చాట్‌బాట్‌లు కస్టమర్ల లావాదేవీలను విశ్లేషించి.. కాల్ సెంటర్ ఏజెంట్ల అవసరాన్ని తగ్గించేస్తాయని చెప్పారు. AI ప్రాజెక్టులపై కంపెనీలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతుండటంతో భవిష్యత్తులో దాని వినియోగం గణనీయంగా పెరుగుతుందన్నారు.

News April 28, 2024

డేంజర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా!

image

కొవిడ్ కారణంగా పెరిగిన వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ వల్ల ఫ్యాటీ లివర్ ముప్పు పెరుగుతోందని వైద్యుల పరిశీలనలో తేలింది. కదలకుండా కూర్చోవడం, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమట. కాలేయంలో కొవ్వు పెరిగి గడ్డలుగా మారి లివర్ సిరోసిస్‌కు దారి తీస్తోంది. ప్రతి ఇద్దరిలో ఒకరికి ఈ సమస్య ఉంటోందట. అధిక బరువు, థైరాయిడ్, షుగర్ ఉన్నవారిలో ఈ వ్యాధి ముప్పు పెరుగుతోందని.. రోజూ అరగంట వ్యాయామం తప్పక చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.