India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

1977 నుంచి INC ఒక్కసారే గెలిచిన, ఒక్క మహిళా గెలవని MP స్థానం బెంగళూరు సౌత్. 1977-84 వరకు జనతా పార్టీ, 1991 నుంచి BJP అభ్యర్థులే సత్తా చాటారు. 2019లో గెలిచిన తేజస్వీ సూర్య మరోసారి బరిలో నిలిచారు. ఇక్కడ పాగా వేయాలనుకుంటోన్న కాంగ్రెస్.. మంత్రి రామలింగారెడ్డి కూతురు సౌమ్యారెడ్డిని బరిలో నిలిపింది. ఆమె గెలిస్తే 2 రికార్డులు బ్రేకవుతాయి. కానీ అంత సులువు కాదంటున్నారు విశ్లేషకులు. <<-se>>#ELECTIONS2024<<>>

AP: దేశానికి రాష్ట్రపతి, ప్రధానిని అందించిన MP నియోజకవర్గంగా నంద్యాల చరిత్రకెక్కింది. 1977 ఎన్నికల్లో 41 స్థానాల్లో INC గెలవగా, జనతా పార్టీ నుంచి నంద్యాలలో గెలిచిన ఏకైక MP నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయ్యారు. 1991లో PV నరసింహారావు PMగా ఎన్నికవడంతో ఆయన కోసం నంద్యాల సిట్టింగ్ MP గంగుల ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో PV.. BJP అభ్యర్థిపై 5.80 లక్షల మెజార్టీతో గెలిచారు.
<<-se>>#ELECTIONS2024<<>>

TG: టెట్ దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. పరీక్ష కోసం 2,83,441 మంది అప్లై చేసుకున్నారు. పేపర్-1కి 99,210, పేపర్-2కి 1,84,231 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలను సీబీటీ విధానంలో మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పరీక్ష ఫలితాలను జూన్ 12న రిలీజ్ చేస్తామని పేర్కొంది.

TG: పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్(CEIR) పోర్టల్ అందుబాటులోకి వచ్చిన ఏడాదిలోనే 26,833 ఫోన్లను రాష్ట్ర పోలీసులు రికవరీ చేశారు. గత ఏడాది ఏప్రిల్ 13న ఈ సేవలు ప్రారంభం అయ్యాయి. రోజూ 73 ఫోన్ల చొప్పున పోలీసులు తిరిగి స్వాధీన పరుచుకున్నారు.

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జాగ్వార్ లాండ్ రోవర్(JLR) లగ్జరీ కార్లను భారత్‌లోనే తయారు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం తమిళనాడులో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కొత్త ప్లాంట్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బ్రిటన్, చైనా, బ్రెజిల్, స్లొవాకియాలో JLR ప్లాంట్లు ఉన్నాయి. కాగా 2008లో JLR బ్రాండ్‌ను టాటా మోటార్స్ సొంతం చేసుకుంది.

పురాతన విద్యాసంస్థల్లో యేల్ యూనివర్సిటీ(US) ఒకటి. దీనికి, భారత్‌కు ఓ సంబంధం ఉంది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ ఎలిహు యేల్. మద్రాస్‌లో 30+ ఏళ్లు ఉన్న ఇతను కొన్ని వేల మంది భారతీయులను బానిసలుగా మార్చి ఎగుమతి చేశాడు. లండన్ వెళ్లిన తర్వాత ఓ US కాలేజీకి డొనేషన్లు ఇచ్చాడు. దీంతో అతని పేరునే దానికి పెట్టారు. కాగా బానిసత్వంతో తమకు సంబంధాలు ఉన్నందుకు ఆ వర్సిటీ ఫిబ్రవరిలో క్షమాపణ చెప్పింది.

తాను ఎలాంటి పాత్రనైనా పోషిస్తానని, కానీ పీఆర్ మేనేజర్ కారణంగా ఎన్నో అవకాశాలు కోల్పోయానని హీరోయిన్ పరిణీతి చోప్రా వెల్లడించారు. ‘అమర్‌సింగ్ చంకీల’ ప్రమోషన్లలో మాట్లాడుతూ.. ‘నా టీమ్ యాక్టివ్‌గా లేకపోవడంతో ప్రముఖులతో సంబంధాలను పెంచుకోలేకపోయా. వారి ఇళ్లలో పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లకపోవడం వల్ల మంచి సినిమాల్లో ఛాన్స్‌లు రాలేదు. ప్రస్తుతం ఉన్న గుర్తింపు కంటే మంచి స్థానంలో నేను ఉండాల్సింది’ అని చెప్పారు.

TG: మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానంలో ఈసారి ముక్కోణపు పోరు జరగనుంది. చల్లా వంశీధర్ రెడ్డి(INC), డీకే అరుణ(BJP), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) పోటీ చేస్తున్నారు. ముగ్గురూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం, పార్టీలు బలంగా ఉండటంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఇక్కడ కాంగ్రెస్ 10 సార్లు, జనతా పార్టీ, జనతా దళ్, బీజేపీ ఒక్కోసారి గెలవగా, 2009, 14, 19 ఎన్నికల్లో వరుసగా BRS సత్తా చాటింది.
<<-se>>#ELECTIONS2024<<>>

ఎన్నికల ఏడాదిలోనూ భారత్ మంచి ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని IMF ప్రశంసించింది. 6.8% వృద్ధి రేటును నమోదు చేయడం గొప్ప అంశమని ఆ సంస్థ ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ‘ఎన్నికల టైంలో ప్రభుత్వాలు జనాకర్షక పథకాలను ప్రకటిస్తాయి. కానీ భారత్ ద్రవ్య క్రమశిక్షణను పాటించింది. విదేశీ మారక నిల్వలు గరిష్ఠ స్థాయి 648.522 బి.డాలర్లకు చేరడమే దీనికి ఉదాహరణ’ అని పేర్కొన్నారు.

మణిపూర్‌లోని 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నిన్న లోక్‌సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సందర్భంగా ఖురై, క్షేత్రీగావ్‌తో పాటు మరో 3 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో పోలింగ్ కేంద్రాల వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కారణంగానే ఈ నెల 22న ఆయా కేంద్రాల్లో తిరిగి ఓటింగ్ ను నిర్వహించాలని ఈసీ ఆదేశించినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.