news

News May 3, 2024

నేడు మూడు చోట్ల సీఎం రేవంత్ ప్రచారం

image

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ ఈరోజు మూడు చోట్ల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ధర్మపురి, సాయంత్రం 4గంటలకు సిరిసిల్లలో జరిగే జన జాతర బహిరంగ సభల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. సాయంత్రం 6.30గంటలకు ఉప్పల్‌లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొని, ఆ తర్వాత కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతారు.

News May 3, 2024

‘ప్రత్యేక మేనిఫెస్టో’ విడుదల చేయనున్న కాంగ్రెస్!

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ ఆవిష్కరించనుంది. ఇవాళ గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ 23 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. దీనిని ఇంటింటికి ప్రచారం చేసేలా కాంగ్రెస్ ప్రణాళికలు చేస్తోంది. ఈ మేనిఫెస్టోలో కొత్త ఎయిర్ పోర్టులు, రైల్వే లైన్లు, ఇంటింటికి ఉచిత సోలార్ సిస్టమ్ వంటి హామీలు ఉన్నట్లు సమాచారం.

News May 3, 2024

మేనకా గాంధీ ఆస్తులు ఎంతంటే?

image

బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. యూపీలోని సుల్తాన్ పూర్ నుంచి పోటీ చేస్తున్న ఆమె తన ఆస్తుల విలువ రూ.97.17 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో రూ.51.20 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.45.97 కోట్ల చరాస్తులు ఉన్నాయి. 2019లో ఆమె ఆస్తుల విలువ రూ.55.69 కోట్లు ఉండగా.. ఐదేళ్లలో 43శాతం పెరిగింది.

News May 3, 2024

బంగ్లాతో సిరీస్ భారత్ వశం

image

బంగ్లాదేశ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను రెండు మ్యాచులు మిగిలి ఉండగానే భారత మహిళా జట్టు కైవసం చేసుకుంది. నిన్న జరిగిన మూడో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 117 పరుగులు చేసింది. ఛేదనలో 18.3 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని అందుకుంది. భారత ప్లేయర్లు షెఫాలి వర్మ(51), స్మృతి మంధాన(47) రాణించారు.

News May 3, 2024

తమిళ సినిమాలను తెలుగులో కాపీ కొట్టారు: సుందర్

image

తమిళ దర్శకుడు, ఖుష్బూ భర్త సుందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాను గతంలో చూసిన తెలుగు సినిమాలు కొన్ని తమిళ్ నుంచి కాపీ కొట్టారని అన్నారు. తాను తీసిన మూవీ కంటెంట్‌ను కూడా కాపీ చేశారని ఆరోపించారు. ఆ పగతోనే గత ఏడాది తెలుగు సినిమాలను కాపీ కొట్టి ‘విన్నర్’ మూవీ తీశానని చెప్పారు. ఆయన తెరకెక్కించిన ‘బాక్’ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు.

News May 3, 2024

ఈ నెల 6 నుంచి హైకోర్టుకు సెలవులు

image

TG: హైకోర్టుకు సమ్మర్ వెకేషన్ సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6 నుంచి 31 వరకు సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర కేసులు, పిటిషన్ల కోసం ప్రతి గురువారం బెంచ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అయితే దీని కోసం రెండు రోజుల ముందే పిటిషన్లు ఫైల్ చేయాలని పేర్కొన్నారు.

News May 3, 2024

మరణమే మా నాన్నకొచ్చిన వారసత్వ ఆస్తి: ప్రియాంక

image

వారసత్వాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. తన తండ్రి రాజీవ్ గాంధీకి వాళ్ల అమ్మ(ఇందిరా గాంధీ)నుంచి ఆస్తికి బదులు మరణమే వారసత్వంగా వచ్చిందన్నారు. కాంగ్రెస్ బర్రెలు తీసుకుంటుందని ప్రధాని అబద్దాలు చెప్పడం మానేసి.. యూపీ, మధ్యప్రదేశ్‌లో ఆవులు, గేదేలకు షెల్టర్లు నిర్మించాలన్నారు. దేశంలో ఎన్నడూ లేని రీతిలో బీజేపీ హయాంలో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు.

News May 3, 2024

అదే జరిగితే బీజేపీకి సింగిల్ డిజిట్ రాదు: వీకే పాండియన్

image

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజకీయ వారసుడిగా పేరొందిన వీకే పాండియన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రాష్ట్రంలో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే సింగిల్ డిజిట్ కూడా ఆ పార్టీకి రాదన్నారు. బీజూ జనతా దళ్(BJD) విజయం భారీగా ఉండనుందని.. ఈ ఎన్నికల్లో తాము క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఒడిశాలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13 నుంచి జూన్ 1 వరకు నాలుగు దశల్లో జరగనున్నాయి.

News May 3, 2024

75 వేల ఏళ్ల నాటి మహిళ ముఖాన్ని సృష్టించారు

image

కేంబ్రిడ్జి పురావస్తు శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. 75 వేల ఏళ్ల కిందటి మహిళ పుర్రె ఆధారంగా ఆమె ముఖాన్ని తిరిగి సృష్టించారు. నియాండర్తల్స్ జాతికి చెందిన మహిళగా ఆమెను పేర్కొన్నారు. ఈ నిర్మాణానికి ఏడాది సమయం పట్టినట్లు తెలిపారు. కాగా ఇరాక్ కుర్దిస్తాన్‌లోని షానిదార్ గుహలో ఈ పుర్రెను గుర్తించారు. 6 లక్షల ఏళ్ల క్రితం మానవ జాతి రెండు బృందాలుగా విడిపోగా అందులో ఒకటే నియాండర్తల్స్.

News May 3, 2024

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ కమెడియన్ కూతురు

image

బాలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్ జానీ లివర్ తెలుగు వారన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన హిందీ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన వారసురాలు జెమీ లివర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అల్లరి నరేశ్ హీరోగా నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రంలో ఆమె నటించారు. తండ్రిని అనుకరించడంలో జెమీ దిట్ట. తనకు ఈ మూవీ ఆఫర్ హీరో నరేశ్ వల్లే వచ్చిందని జెమీ చెప్పుకొచ్చారు.