news

News May 4, 2024

పట్టాదారు పుస్తకాలపై జగన్ బొమ్మ.. సజ్జల రియాక్షన్

image

AP: భవిష్యత్తులో పాస్ పుస్తకాలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగకుండా వాటిని రూపొందించామని సజ్జల తెలిపారు. ‘క్యూఆర్ కోడ్‌ ముద్రించి భూహక్కుదారుల పూర్తి వివరాలను డిజిటలైజ్ చేశాం. రెవెన్యూ శాఖలో ఇలాంటి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన CM జగన్ ఫొటో ముద్రించడంలో తప్పేముంది. గతంలో ప్రతిదానిపై తన ఫొటోలు వేసుకున్న CBNకు ప్రశ్నించే అర్హత ఉందా? ప్రజలెవ్వరికీ లేని అభ్యంతరం బాబుకి ఎందుకు?’ అని మండిపడ్డారు.

News May 4, 2024

IPL: బెంగళూరు బౌలింగ్

image

గుజరాత్‌తో మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచింది. కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నారు.
★ బెంగళూరు: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, విల్‌జాక్స్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, దినేశ్ కార్తీక్, కరుణ్ శర్మ, సిరాజ్, యశ్ దయాల్, విజయ్ కుమార్, స్వప్నిల్ సింగ్
★ గుజరాత్: సాహా, గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, లిటిల్

News May 4, 2024

తండ్రీకొడుకులకు చుక్కెదురు

image

సంచలనం సృష్టిస్తున్న సెక్స్ వీడియోల కేసులో తండ్రీకొడుకులకు చుక్కెదురైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి రేవణ్ణ, ఎంపీ ప్రజ్వల్ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంగళూరులోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు జర్మనీకి పారిపోయిన ప్రజ్వల్‌పై రెండోసారి లుక్‌ఔట్ నోటీసు జారీ అయింది. ఈ నోటీసులతో ఆయన దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముంది.

News May 4, 2024

IPL ప్లేఆఫ్స్.. ఏ జట్టుకు ఎంత ఛాన్స్ ఉందంటే?

image

IPL మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. నిన్నటితో 51 మ్యాచ్‌లు పూర్తవగా, ప్లేఆఫ్స్‌కు వెళ్లడానికి అన్ని జట్లూ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. క్రిక్లెటిక్స్ క్వాలిఫికేషన్ ప్రొజెక్షన్ ప్రకారం ప్లేఆఫ్స్‌కు చేరుకోవడానికి RR, KKRకు 99% ఛాన్స్ ఉంది. SRHకు 72%, LSGకు 66%, CSKకు 50% అవకాశం ఉంది. తక్కువ పాయింట్లు ఉన్న DCకి 6%, PBKSకు 5%, GTకి 2%, RCBకి 1% ఛాన్స్ ఉండగా, MI ఎలిమినేట్ అయినట్లేనని పేర్కొంది.

News May 4, 2024

తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా

image

TG: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఈనెల 6, 7 తేదీల్లో రాష్ట్రానికి రావాల్సి ఉండగా, ఆమె పర్యటన వాయిదా పడింది. ఈనెల 10న ఎల్లారెడ్డి, తాండూర్, షాద్ నగర్‌లో జరిగే ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. అలాగే రాహుల్ గాంధీ పర్యటనలోనూ మార్పులు జరిగాయి. ఆయన ఈనెల 5న నిర్మల్, అలంపూర్ ఎర్రవల్లి చౌరస్తాలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈనెల 9న కరీంనగర్, సరూర్ నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

News May 4, 2024

సూర్యాస్తమయం వేళ సూరీడి ఫొటో

image

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లోని ఓ వ్యోమగామి సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో క్లిక్ మనిపించారు. ఈ ఫొటోను నాసా తాజాగా విడుదల చేసింది. జనవరి 18న ISS జపాన్ మీదుగా తిరుగుతున్న సమయంలో ఈ చిత్రాన్ని తీసినట్లు తెలిపింది. సగం మేర కనిపిస్తున్న సూర్యుడితో ఈ ఫొటో ఆకట్టుకుంటోంది. కాగా ISSలోని వ్యోమగాములు ప్రతిరోజూ 16 సూర్యాస్తమయాలు, సూర్యోదయాలను చూస్తారు. అలా ఓ సారి సూర్యాస్తమయం అవుతుండగా క్లిక్ మనిపించారు.

News May 4, 2024

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: TDPపై వైసీపీ ఫిర్యాదు

image

ఏపీ రాజకీయాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంచలనంగా మారింది. ఈ చట్టంపై IVRS కాల్స్ ద్వారా టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈసీ.. విచారణ జరిపి తక్షణమే నివేదిక అందించాలని సీఐడీని ఆదేశించారు.

News May 4, 2024

‘ప్రతినిధి-2’ విడుదల తేదీ ఫిక్స్

image

హీరో నారా రోహిత్ నటిస్తున్న ‘ప్రతినిధి-2’ మూవీ విడుదల తేదీ ఫిక్సయింది. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గత నెల 25నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. ‘ప్రతినిధి-2’లో నారా రోహిత్ న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.

News May 4, 2024

NSE సరికొత్త రికార్డ్

image

నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లాభాల్లో $1 బిలియన్ల మార్క్ దాటింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో NSE ట్యాక్సులు పోనూ రూ.8300కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఖర్చులు 90% పెరిగినా (రూ.2,812కోట్ల నుంచి రూ.5,350 కోట్లకు) ఈ లాభాలను నమోదు చేయడం విశేషం. FY24లో NSE ద్వారా కేంద్రం రూ.43,514 కోట్లు ఆర్జించింది. కాగా మార్చి 31 నాటికి NSE నికర విలువ రూ.23,974కోట్లుగా ఉంది.

News May 4, 2024

సత్యవేడు సమరంలో టీడీపీకి రెబల్ ఫీవర్‌!

image

తిరుపతి(D) సత్యవేడులో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ 2019లో వైసీపీ తరఫున బంపర్ మెజార్టీ(44,744)తో గెలిచిన కోనేటి ఆదిమూలం ఈసారి TDPలో చేరి టికెట్ దక్కించుకున్నారు. దీంతో గత ఎన్నికల్లో TDP నుంచి పోటీ చేసి ఓడిన జడ్డా రాజశేఖర్ ఫైర్ అయ్యారు. రెబల్‌గా పోటీకి దిగారు. ఇటు YCP నాన్ లోకల్ నూకతోటి రాజేశ్‌ను రంగంలోకి దింపింది. ఆదిమూలంపై అసమ్మతి, పథకాలు కలిసొస్తాయని YCP అంచనా వేస్తోంది. <<-se>>#ELECTIONS2024<<>>